భారత్‌కు రానున్న రెండు సరికొత్త ఆప్రిలియా బైక్స్ - డీటేల్స్

ఇటలీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రిలియా భారత మార్కెట్లో త్వరలోనే రెండు సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆర్‌ఎస్ 660, టుయోనో 660 మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ విషయాన్ని స్వయంగా పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డియాగో గ్రాఫి ధృవీకరించారు. వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి వీటిని భారతదేశంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

 

భారత్‌కు రానున్న రెండు సరికొత్త ఆప్రిలియా బైక్స్ - డీటేల్స్

అప్రిలియా తమ ఆర్ఎస్ 660 మరియు టుయోనో 660 మోడళ్లను మిడిల్ వెయిట్ ప్రీమియం మోటార్‌సైకిళ్ల విభాగంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు మోడళ్లలో అప్రిలియా ఆర్ఎస్ 660 వివరాలను కంపెనీ అంతర్జాతీయంగా వెల్లడి చేసింది, కారా ఆప్రిలియా టుయోనో 660 వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే, ఈ రెండు మోటార్‌సైకిళ్ల మధ్య అనేక విడిభాగాలు మరియు ఫీచర్లు ఒకేలా ఉండొచ్చని సమాచారం. ఆర్ఎస్ 660 మరియు టుయోనో 660 మోడళ్ల మధ్య ఉన్న ఏకైక మరియు ముఖ్యమైన మార్పు వాటి డిజైన్ మరియు ఇంజన్ ఆప్షన్స్ మాత్రమే అవుతుంది.

భారత్‌కు రానున్న రెండు సరికొత్త ఆప్రిలియా బైక్స్ - డీటేల్స్

అప్రిలియా ఆర్ 660 మోడల్‌ను దాని బిగ్ బ్రదర్ అయిన ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 డిజైన్ నుండి ప్రేరణ పొంది తయారు చేశారు. ఇది ఆర్ఎస్‌వి4 లో కనిపించినట్లుగా ఫుల్ ఫెయిరింగ్ మరియు ఏరో వింగ్లెట్లతో అగ్రెసివ్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇందులోని రేస్-స్పెక్ స్టైల్ వింగ్లెట్స్ అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు మెరుగైన ఏరోడైనమిక్ స్థిరత్వాన్ని అందిస్తాయి.

MOST READ:భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

భారత్‌కు రానున్న రెండు సరికొత్త ఆప్రిలియా బైక్స్ - డీటేల్స్

ఈ మోడల్‌లో బ్రాండ్ యొక్క సిగ్నేచర్ త్రీ పార్ట్ ఎల్ఈడి హెడ్‌లైట్ ఉంటుంది, దానికి ఇరువైపులా ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్లు ఉంటాయి. స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు షార్ప్ క్రీజ్ లైన్లతో ఈ మోటారుసైకిల్ అగ్రెసివ్ లుక్ మరింత మెరుగ్గా ఉంటుంది. ఆర్ఎస్ 660 వెనుక డిజైన్ చూడటానికి ఆర్ఎస్‌వి4 మాదిరిగానే కనిపిస్తుంది.

భారత్‌కు రానున్న రెండు సరికొత్త ఆప్రిలియా బైక్స్ - డీటేల్స్

ఇంజన్ విషయానికి వస్తే, ఆప్రిలియా ఆర్ఎస్ 660 మోడల్‌లో 660సిసి, పారలల్ ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఫార్ములా 2 కార్ రేస్‌లో ఘన విజయం సాధించిన భారత రేసర్ జెహన్ దారువాలా ; వివరాలు

భారత్‌కు రానున్న రెండు సరికొత్త ఆప్రిలియా బైక్స్ - డీటేల్స్

ఆప్రిలియా ఆర్‌ఎస్ 660 కెర్బ్ వెయిట్ 165 కిలోలుగా ఉండి, ఇది ఈ విభాగంలోనే అత్యంత తేలికైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా నిలుస్తుంది. ఇందులో ఆప్రిలియా అనేక ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లను అందిస్తోంది. ఇందులో వీలీ కంట్రోల్, కార్నరింగ్ ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, ఐదు వేర్వేరు రైడ్ మోడ్‌లు మరియు బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌కు రానున్న రెండు సరికొత్త ఆప్రిలియా బైక్స్ - డీటేల్స్

ఈ మోటార్‌సైకిల్‌లో 5 ఇంచ్ టిఎఫ్‌టి స్ప్లిట్-స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్ కూడా ఉంటుంది, ఇది మోటార్‌సైకిల్‌పై అన్ని ఎలక్ట్రానిక్ అసిస్టెన్స్ ఫీచర్లను కంట్రోల్ చేయటానికి మరియు రైడర్‌కు వివిధ రకాల సమాచారాన్ని అందించడానికి సహకరిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం ఇది ప్రత్యేకమైన యాప్ మరియు బ్లూటూత్ కనెక్టింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది.

MOST READ:భారత్‌లో కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

భారత్‌కు రానున్న రెండు సరికొత్త ఆప్రిలియా బైక్స్ - డీటేల్స్

ఆర్‌ఎస్ 600 మోటార్‌సైకిల్‌లో ముందు వైపు కయాబా బ్రాండ్ నుండి గ్రహించిన 41 మిమీ, యుఎస్‌డి ఫోర్క్స్ మరియు వెనుక వైపు మోనో-షాక్ సెటప్ ఉంటాయి. ఈ రెండిటినీ పూర్తిగా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయల్-డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక వైపున సింగిల్ డిస్క్-బ్రేక్ ఉంటాయి. ఈ రెండింటినీ బ్రెంబో బ్రాండ్ నుండి గ్రహించారు.

భారత్‌కు రానున్న రెండు సరికొత్త ఆప్రిలియా బైక్స్ - డీటేల్స్

ఈ మోటార్‌సైకిల్‌ను ఆప్రిలియా ఆర్ఎస్250 రెగ్గియాని రెప్లికా మోటార్‌సైకిల్ నుండి ప్రేరణ పొంది అపెక్స్ బ్లాక్, యాసిడ్ గోల్డ్ మరియు లావా రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందించనున్నారు. ఆప్రిలియా తమ ఆర్ఎస్ 660 మరియు టుయోనో 660 రెండు మోడళ్లను కూడా సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) యూనిట్లుగా భారత దేశానికి దిగుమతి చేసుకొని విక్రయించాలని ప్లాన్ చేస్తోదంి.

MOST READ:ఒకే రోజు ఏడు గ్లోస్టర్ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన ఎంజి మోటార్ ; ఎక్కడో తెలుసా ?

భారత్‌కు రానున్న రెండు సరికొత్త ఆప్రిలియా బైక్స్ - డీటేల్స్

భారతదేశపు కొత్త దిగుమతి నిబంధనల ప్రకారం, ఆటోమొబైల్ కంపెనీలు సంవత్సరానికి 2,500 వాహనాలను సికెడి (విడిభాగాల రూపంలో భారత్‌కు దిగుమతి చేసుకోవటం) మరియు సిబియు (పూర్తిగా విదేశాల్లో తయారు చేసిన వాహనాలను భారత్‌కు దిగుమతి చేసుకోవటం) దిగుమతి చేసుకోవచ్చు. ఈ నియమం ప్రకారం, దిగుమతి చేసుకున్న వాహనాలు అంతర్జాతీయ ఆటోమోటివ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నంత వరకూ వాటికి ప్రత్యేక హోమోలోగేషన్ అవసరం లేదు.

భారత్‌కు రానున్న రెండు సరికొత్త ఆప్రిలియా బైక్స్ - డీటేల్స్

అప్రిలియా ఆర్ఎస్ 660 మరియు టుయోనో 660 మోటార్‌సైకిళ్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో అప్రిలియా ఆర్ఎస్ 660 మరియు టుయోనో 660 మోడళ్లు మిడిల్-వెయిట్ విభాగంలో విడుదల కానున్నాయి. ఈ విభాగంలో ఇవి కవాసాకి నింజా 650, కెటిఎమ్ 790 డ్యూక్ మరియు రాబోయే ట్రయంప్ ట్రైడెంట్ 660 వంటి మోడళ్లకు పోటీగా నిలువనున్నాయి.

Most Read Articles

English summary
Aprilia RS 660 And Tunono 660 Models Will Be Launched In India By Next Year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X