Just In
- 1 hr ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 1 hr ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 3 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 4 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- Sports
3 బంతుల్లో 15 పరుగులు.. ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్ బాదిన సోలంకి! సెమీస్‌కు బరోడా!
- Finance
మైల్స్టోన్ బడ్జెట్: కొత్త ఉద్యోగాలపై సీఈవోలు ఏమన్నారంటే? ఆ ఖర్చులపై ఆందోళన
- News
ఏపీ పంచాయతీ ఏకగ్రీవాలపై ఫోకస్, అక్రమంగా జరిగితే అంతే, కలెక్టర్లు, ఎస్పీలకు నిమ్మగడ్డ
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ కోసం బుకింగ్స్ ఓపెన్, త్వరలో విడుదల
భారత మార్కెట్లో ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ కోసం బుకింగ్‌లను ప్రారంభించినట్లు పియాజియో ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన ఈ ప్రీమియం స్కూటర్ త్వరలోనే భారత్‌లో కూడా విడుదల కానుంది. కస్టమర్లు ఇప్పుడు రూ.5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవ్చచు.

పియాజియో ఇప్పటికే తమ బారామతి ప్లాంట్‌లో అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ ఉత్పత్తిని కూడా ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్రీమియం స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసిన తక్షణమే డెలివరీలను కూడా ప్రారంభించేందుకు ఇది వీలు కల్పించనుంది.

ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్‌ని మొదటిసారిగా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచారు. అప్పటి నుండి ఈ మోడల్‌పై మార్కెట్‌లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎస్ఎక్స్ఆర్ 160తో పాటుగా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్‌ను కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు గతంలో ఆప్రిలియా వెల్లడించింది. అయితే, ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ 2021లో విడుదలయ్యే అవకాశం ఉంది.
MOST READ:టైటానికి షిప్‌ను తలపిస్తున్న ఫెర్రీ షిప్ : పూర్తి వివరాలు

వాస్తవానికి పియాజియో తమ ఆప్రిలియా ఎస్‌ఎక్స్ఆర్ 160 మ్యాక్సీ స్కూటర్‌ను చాలా ముందుగానే భారత మార్కెట్లో విడుదల చేయాలని భావించినప్పటికీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఈ స్కూటర్ విడుదల జాప్యమైందని కంపెనీ పేర్కొంది.

ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్160 భారత మార్కెట్లో ఓ కొత్త స్కూటర్ విభాగాన్ని సృష్టించనుంది. ఈ ప్రీమియం మాక్సీ స్కూటర్ అప్రిలియా యొక్క సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌ని ప్రతిబింబింపజేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో అప్‌డేట్ చేయబడిన తాజా ఉద్గార నిబంధనలకు లోబడి, అధిక పనితీరు గల బిఎస్6 ఇంజన్‌తో పాటుగా అనేక ఇతర ఫీచర్లతో ఈ స్కూటర్ అందుబాటులోకి రానుంది.
MOST READ:దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్ ; వివరాలు

ఈ స్కూటర్ ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో కూడిన ఆప్రిలియా బ్రాండ్ సిగ్నేచర్ ట్రిపుల్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది. ఇంకా భారీ ఫ్రంట్ ఆప్రాన్, పెద్ద వైజర్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, అల్లాయ్స్ వీల్స్, మజిక్యులర్ ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లతో ఇది సరికొత్త మరియు ఆధునిక రూపాన్ని కలిగి ఉంటుంది.

ఈ స్కూటర్‌లోని ఇతర ఫీచర్లలో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రైడర్ మరియు పిలియన్ రైడర్ కోసం విశాలమైన సీట్లు, ఫ్రంట్ ఆప్రాన్‌కు ఇరువైపులా గ్లౌవ్‌బాక్స్, యుఎస్‌బి ఛార్జర్ మరియు లైటింగ్‌తో కూడిన పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. అదేంటో తెలుసా ?

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్‌లో బిఎస్6 160సిసి సింగిల్ సిలిండర్ ఫ్యూయెల్ ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ గరిష్టంగా 7600 ఆర్‌పిఎమ్ వద్ద 10.5 బిహెచ్‌పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 11.6 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ ప్రీమియం స్కూటర్ ముందు భాగంలో 30 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక భాగాల్లో వరుసగా 220 మిమీ మరియు 140 మిమీ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇవి డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.
MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ ముందు మరియు వెనుక వైపు 120/70 ప్రొఫైల్‌తో కూడిన 12 ఇంచ్ ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. ఇది గ్లాసీ రెడ్, మ్యాట్ బ్లూ, గ్లాసీ వైట్ మరియు మ్యాట్ బ్లాక్ అనే నాలుగు రంగులలో లభ్యం కానుంది.

ఆప్రిలియా నుండి వస్తున్న ఈ సరికొతత్ ఎస్ఎక్స్ఆర్ 160 మాక్సీ స్కూటర్ ఈ విభాగంలో ప్రధానంగా సుజుకి బర్గ్‌మ్యాన్‌కు పోటీగా నిలుస్తుంది. ఈ కొత్త మ్యాక్సీ స్కూటర్లు ట్రెడిషనల్ స్కూటర్ల కంటే మెరుగైన ప్రాక్టికాలిటీని అందిస్తూ మరింత కంఫర్ట్ రైడ్‌ని ఆఫర్ చేస్తాయి.