Just In
Don't Miss
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- News
ఏపీలో కొత్తగా 135 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్నంటే..? మళ్లీ పెరుగుతున్న యాక్టివ్ కేసులు
- Sports
మ్యాక్సీనా మజాకానా.. సిక్స్ కొడితే సీటుకే బొక్క!
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏథర్ 450ఎక్స్ సిరీస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం
బెంగుళూరుకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, తొలిసారిగా తమ సరికొత్త 450ఎక్స్ సిరీస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. గడచిన అక్టోబర్ 1, 2020వ తేదీన కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల పేమెంట్ విండో తెరిచిన తరువాత, మొదటిసారిగాఈ కలెక్టర్ ఎడిషన్ స్కూటర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి.

మొదటి కొద్ది మంది వినియోగదారులకు ఏథర్ ఎనర్జీ తమ సరికొత్త 450ఎక్స్ సిరీస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను డెలివరీ చేసింది. మార్కెట్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ (స్టాండర్డ్ వేరియంట్)ను రూ.1.59 లక్షల ఎక్స్-షోరూమ్ (బెంగళూరు) ధరతో విక్రయిస్తున్నారు. ఇది గ్రే, వైట్ మరియు గ్రీన్ అనే మూడు రంగులో లభిస్తుంది.

కాగా, స్టాండర్డ్ మోడర్ ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో 450ఎక్స్ సిరీస్1 పేరిట కొత్త కలెక్టర్స్ ఎడిషన్ మోడల్‌ను తయారు చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను రెడ్ యాక్సెంట్స్‌తో మరింత స్పోర్టీగా కనిపించే గ్లోస్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో ఫినిష్ చేశారు.
MOST READ:బాగా దాహంగా ఉన్న ఏనుగు రోడ్డుపై ఏం చేసిందో తెలుసా.. అయితే వీడియో చూడండి

ప్రస్తుతం డెలివరీ చేసిన మోడళ్లలోని గ్లోస్-బ్లాక్ సైడ్ ప్యానెళ్లను త్వరలో అపారదర్శక ప్యానెల్స్‌తో భర్తీ చేయనున్నారు. మార్చి 2021 నుండి ఈ ప్యానెళ్లను ఉచితంగా వినియోగదారులకు అందించనున్నారు. ఏథర్ 450ఎక్స్ సిరీస్1 మోడల్‌ను జనవరి 28, 2020వ తేదీకి ముందు బుక్ చేసుకున్న వారికి మాత్రమే బ్లాక్ అండ్ రెడ్ పెయింట్ స్కీమ్‌లో ప్రత్యేకంగా లభిస్తుంది.

ఈ కలెక్టర్స్ ఎడిషన్ స్కూటర్‌ను ప్రత్యేకమైన బ్లాక్ అండ్ రెడ్ కలర్ స్కీమ్‌తో పాటుగా, కొద్దిగా అప్‌గ్రేడే చేశారు. ఇందులో అప్‌డేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ యూఐ కూడా ఉంటుంది. అయితే, యాంత్రికంగా 450ఎక్స్ సిరీస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎలాంటి ఇతర మార్పులు లేవు. స్టాండర్డ్ 450ఎక్స్‌లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్‌లనే ఇందులో ఉపయోగించారు.
MOST READ:ఈ కార్లు ఎంతో పాపులర్, అసలు ఇవున్నాయని మీకు తెలుసా?

ఈ పవర్‌ట్రైన్ 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారు రూపంలో 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 85 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 - 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఈ గణాంకాలతో ఇది ఈ విభాగంలోనే వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలుస్తుంది.

ఏథర్ 450ఎక్స్ డెలివరీలు మొదటగా భారతదేశంలోని 9 నగరాల్లో ప్రారంభించబడ్డాయి. సమీప భవిష్యత్తులో ఏథర్ ఎనర్జీ మరిన్ని నగరాలకు తమ వ్యాపారాలను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఏథర్ ఇటీవలే 35 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడిని అందుకున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో కంపెనీ తమ వ్యాపారాన్ని, ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించుకోనుంది.
MOST READ:బ్లూటూత్ హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఏథర్ ఎనర్జీ 450ఎక్స్ సిరీస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీల ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
జనవరి 2020లో 450ఎక్స్ బుక్ చేసుకున్న కస్టమర్ల కోసం కంపెనీ ఏథర్ 450ఎక్స్ సిరీస్1 పేరిట ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను తయారు చేసి, తాజాగా డెలివరీలను ప్రారంభించింది. భారత మార్కెట్లో ఏథర్ 450ఎక్స్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మరియు టివిఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.