హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఏథర్ 450ఎక్స్ సిరీస్1 డెలివరీలు

బెంగుళూరుకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, అందిస్తున్న స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ "ఏథర్ 450ఎక్స్ సిరీస్1" డెలివరీలను దేశంలోని మరిన్ని నగరాల్లో ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఏథర్ 450ఎక్స్ సిరీస్1 డెలివరీలు

కంపెనీ త్వరలోనే పూనే, హైదరాబాద్ మరియు అహ్మదాబాద్ నగరాల్లో 450ఎక్స్ సిరీస్1 స్కూటర్ డెలివరీలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎథర్ ఎనర్జీ ఇటీవలే దేశంలోని కొన్ని నగరాల్లో 450ఎక్స్ సిరీస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది.

హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఏథర్ 450ఎక్స్ సిరీస్1 డెలివరీలు

ఏథర్ ఎనర్జీ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇటీవల చేసిన ట్వీట్‌లో, ఈ స్కూటర్‌ను ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులు స్కూటర్ డెలివరీ తీసుకోవటానికి ముందుగా మిగిలిన చెల్లింపు మరియు ఇతర ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి వారికి ఇమెయిల్‌ని పంపినట్లు తెలిపింది.

MOST READ:ఎంజి హెక్టర్ ప్లస్ యొక్క టాప్ 5 ఫీచర్స్ : పూర్తి వివరాలు

హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఏథర్ 450ఎక్స్ సిరీస్1 డెలివరీలు

అంతేకాకుండా, ఈ నగరాల్లో ఇంకా కొన్ని యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ ఏథర్ 450ఎక్స్ సిరీస్1 స్కూటర్‌లు కస్టమర్ల కోసం అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. స్టాండర్డ్ ఏథర్ 450ఎక్స్ స్కూటర్‌కి స్పెషల్ ఎడిషన్‌గా వచ్చిన ఈ 450ఎక్స్ సిరీస్1 ప్రత్యేకమైన ఫీచర్లతో లభిస్తుంది. మార్కెట్లో స్టాండర్డ్ 450ఎక్స్ ధర రూ.1.59 లక్షలు, ఎక్స్ షోరూమ్ (బెంగళూరు)గా ఉంది.

హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఏథర్ 450ఎక్స్ సిరీస్1 డెలివరీలు

స్టాండర్డ్ మోడల్ ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో 450ఎక్స్ సిరీస్1 పేరిట కొత్త కలెక్టర్స్ ఎడిషన్ మోడల్‌ను తయారు చేశారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను రెడ్ యాక్సెంట్స్‌తో మరింత స్పోర్టీగా కనిపించే గ్లోస్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది.

MOST READ:ప్రపంచవ్యాప్తంగా ఈ కారు 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది ; అది ఏ కారో తెలుసా ?

హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఏథర్ 450ఎక్స్ సిరీస్1 డెలివరీలు

ప్రస్తుతం డెలివరీ చేయబోయే మోడళ్లలోని గ్లోస్-బ్లాక్ సైడ్ ప్యానెళ్లను త్వరలో అపారదర్శక ప్యానెల్స్‌తో రీప్లేస్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. మార్చి 2021 నుండి ఈ ప్యానెళ్లను ఉచితంగా వినియోగదారులకు అందించనున్నారు.

కలెక్టర్స్ ఎడిషన్ ఏథర్ 450ఎక్స్ సిరీస్1 స్కూటర్‌ను ప్రత్యేకమైన బ్లాక్ అండ్ రెడ్ కలర్ స్కీమ్‌తో పాటుగా, కొద్దిగా అప్‌గ్రేడే చేశారు. ఇందులో అప్‌డేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ యూఐ కూడా ఉంటుంది. అయితే, యాంత్రికంగా స్టాండర్డ్ వెర్షన్‌కు మరియు స్పెషల్ ఎడిషన్‌కు ఎలాంటి మార్పులు లేవు.

హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఏథర్ 450ఎక్స్ సిరీస్1 డెలివరీలు

స్టాండర్డ్ 450ఎక్స్‌లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్‌లనే సిరీస్1 లోనూ ఉపయోగించారు. ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పవర్‌ట్రైన్ 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 26 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఐపి67 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ బ్యాటరీపై 3 ఏళ్ల సమగ్ర వారంటీని ఆఫర్ చేస్తోంది.

MOST READ:మీకు తెలుసా.. లంబోర్ఘిని ఉరుస్ డ్రైవింగ్ చేస్తూ కనిపించిన తమిళ్ తలైవా రజినీకాంత్

హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఏథర్ 450ఎక్స్ సిరీస్1 డెలివరీలు

ఈ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 85 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్‌లోని బ్యాటరీని చార్జ్ చేసే ప్రతి నిమిషం 1.45 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 - 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఈ గణాంకాలతో ఇది ఈ విభాగంలోనే వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలుస్తుంది.

హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఏథర్ 450ఎక్స్ సిరీస్1 డెలివరీలు

ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫుల్లీ లోడెడ్ స్మార్ట్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది, ఇది సంగీతం మరియు వాయిస్ అసిస్టెంట్‌ను కంట్రోల్ చేయటానికి ఉపయోగపడుతుంది.

కస్టమర్లు ఏథర్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను ఉపయోగించి కూడా తమ స్కూటర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. ఇది రైడర్‌కు అనేక రకాల సమాచారాన్ని అందిస్తుంది మరియు స్కూటర్‌ యొక్క వివిధ విధులను నియంత్రించడానికి కూడా సహకరిస్తుంది. ఇంకా ఆన్‌లైన్ సర్వీస్ బుకింగ్, రైడ్ స్టాటిస్టిక్స్, ఏథర్ గ్రిడ్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను కనుగొనడం, స్కూటర్ ఛార్జ్ స్థితిని తెలుసుకోవటం వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

MOST READ:ఈ సైకిళ్ల ప్రారంభ ధర రూ.30,000; వీటిలో అంత స్పెషల్ ఏంటంటే..

హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఏథర్ 450ఎక్స్ సిరీస్1 డెలివరీలు

కొత్త నగరాల్లో ఏథర్ ఎనర్జీ 450ఎక్స్ సిరీస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీల ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఏథర్ ఎనర్జీ తమ వ్యాపారాన్ని మరిన్ని కొత్త నగరాలకు విస్తరించే లక్ష్యంలో భాగంగా, తమ కొత్త 450ఎక్స్ సిరీస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూనే, హైదరాబాద్ మరియు అహ్మదాబ్ నగరాలలో డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. దేశంలోని వినియోగదారులు ఈవి లను ఆశ్రయించేందుకు ఇది సహకరిస్తుంది. భారత మార్కెట్లో ఏథర్ 450ఎక్స్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మరియు టివిఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Ather Energy to commence 450X Series1 electric scooter deliveries in Pune, Hyderabad and Ahemdabad soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X