27 నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

బెంగుళూరుకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, అందిస్తున్న భారతదేశపు మొట్టమొదటి ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ "ఏథర్ 450ఎక్స్"ను వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నాటికి దేశంలోని 27 నగరాల్లో ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కంపెనీ తమ రెండవ దశ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

27 నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

ఏథర్ ఎనర్జీ తమ మొదటి దశ విస్తరణ ప్రణాళికలో భాగంగా, దేశవ్యాప్తంగా 16 కొత్త నగరాల్లో ఏథర్ 450 ఎక్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందులో మైసూర్, హుబ్లి, జైపూర్, ఇండోర్, పనాజీ, భువనేశ్వర్, నాసిక్, సూరత్, చండీగడ్, విజయవాడ, విశాఖపట్నం, గౌహతి, నాగ్‌పూర్, నోయిడా, లక్నో మరియు సిలిగురి నగరాలు ఉన్నాయి.

27 నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

ఏథర్ ఎనర్జీ ఇప్పటికే బెంగళూరు మరియు చెన్నై నగరాల్లో పూర్తి స్థాయి కార్యకలాపాలను కలిగి ఉంది. మరోవైపు ఈ బ్రాండ్ బ్రాండ్ ఇటీవలే ఢిల్లీ ఎన్‌సిఆర్, ముంబై, పూణే మరియు హైదరాబాద్ వంటి ఇతర నగరాల్లో కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించింది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, డీలర్‌షిప్ ఎంక్వైరీ మరియు టెస్ట్ రైడ్‌ల కోసం భారీ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చాయని, వీటి ఫలితంగా దేశంలో 2వ దశ విస్తరణ ప్రణాళిక చేపట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపింది.

MOST READ: భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

27 నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్తగా ప్రారంభిస్తున్న ఈ నగరాల్లో కూడా లిమిటెడ్ ఎడిషన్ ఏథర్ 450ఎక్స్ సిరీస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులో ఉంచుతామని ఏథర్ ఎనర్జీ తెలిపింది. కొత్త నగరాల్లో స్కూటర్ విడుదలతో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్, ఏథర్ గ్రిడ్‌లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ వివిధ రీటైల్ భాగస్వాములతో కూడా చర్చలు జరుపుతోంది. ఏథర్ ఎనర్జీకి ప్రస్తుతం 11 వేర్వేరు నగరాల్లో 60కి పైగా పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి.

27 నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

ఇక ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, మార్కెట్లో దీని ధర రూ.1.59 లక్షలు, ఎక్స్ షోరూమ్ (బెంగళూరు)గా ఉంది. ఇది గ్రే, వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 26 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఐపి67 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ బ్యాటరీపై 3 ఏళ్ల సమగ్ర వారంటీని ఆఫర్ చేస్తోంది.

MOST READ: టోల్ ప్లాజాల వద్ద ఇకపై క్యాష్ ట్రాన్సాక్షన్లు ఉండవ్.. 100 శాతం నగదు రహితం!

27 నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

పూర్తి బ్యాటరీ ఛార్జ్‌పై 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 85 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్‌లోని బ్యాటరీని చార్జ్ చేసే ప్రతి నిమిషం 1.45 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 - 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

27 నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక స్మార్ట్ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది, ఇది సంగీతం మరియు వాయిస్ అసిస్టెంట్‌ను కంట్రోల్ చేయటానికి సహకరిస్తుంది. ఏథర్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను ఉపయోగించి కూడా తమ స్కూటర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.

MOST READ: భారత్‌లో కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

27 నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

ఈ యాప్ రైడర్‌కు అనేక రకాల సమాచారాన్ని అందిస్తుంది మరియు స్కూటర్‌‌ని వివిధ ఫంక్షన్లను కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఆన్‌లైన్ సర్వీస్ బుకింగ్, రైడ్ స్టాటిస్టిక్స్, దగ్గర్లోని ఏథర్ గ్రిడ్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను కనుగొనడం, స్కూటర్ ఛార్జ్ స్థితిని తెలుసుకోవటం వంటి మరెన్నో ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

27 నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

కొత్త నగరాల్లో ఏథర్ ఎనర్జీ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఏథర్ ఎనర్జీ అందిస్తున్న 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఉంచబడుతుంది. అతికొద్ది సమయంలోనే ఈ స్కూటర్ మంచి ప్రజాదరణ పొందింది. దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, ఏథర్ ఎనర్జీ కూడా తమ విస్తరణ ప్రణాళికలపై దృష్టి సారించి, కొత్త నగరాల్లో ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది.

Most Read Articles

English summary
Ather Energy To Launch 450X Electric Scooter In 27 Cities By Early 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X