బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ బైక్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో అందిస్తున్న పాపులర్ బైక్ 'పల్సర్'లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. రైడర్, పిలియన్ రైడర్ సీట్లను వేరు చేస్తూ బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ పేరుతో కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది.

బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ బైక్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్‌లో రెగ్యులర్ వెర్షన్ కన్నా మరిన్ని ఫీచర్లు అదనంగా లభిస్తాయి. ఇందులో ట్విన్ పైలట్ ల్యాంప్స్‌తో కూడిన సరికొత్త వోల్ఫ్-ఐడ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ మరియు వెనుక వైపు ట్విన్ స్ట్రిప్ ఎల్ఈడి టెయిల్ లైట్స్ ఉంటాయి.

బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ బైక్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ట్యాంక్‌పై 3డి లోగో, కొత్తగా డిజైన్ చేసిన నలుపు రంగు అల్లాయ్ వీల్స్, స్పోర్టీ స్ప్లిట్ గ్రాబ్ రెయిల్స్ ఉంటాయి. ఈ బైక్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. ఇంకా క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్స్, స్ప్లిట్ సీట్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కొత్త బైక్ నియాన్ గ్రీన్/మ్యాట్ బ్లాక్, బ్లాక్/సిల్వర్ మరియు బ్లాక్/రెడ్ మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

MOST READ: జులైలో విడుదల కానున్న కొత్త హోండా సిటీ బిఎస్6; వివరాలు

బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ బైక్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని బిఎస్6 వెర్షన్ 124సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 11 బిహెచ్‌పిల శక్తిని, 10.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ బైక్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు ట్విన్ గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జార్వర్స్‌ను ఉపయోగించారు. ఇక బ్రేక్స్ విషయానికి వస్తే ఇందులో ముందు వైపు 240 ఎమ్.ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు 130 ఎమ్.ఎమ్ డ్రమ్ బ్రేక్‌ని ఉపయోగించారు. ఇందులో సింగిల్ ఛానెల్ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

MOST READ: హ్యార్లీ డేవిడ్‌సన్ ఐరన్ 883 ధర పెంపు, వివరాలు

బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ బైక్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

భారత మార్కెట్లో కొత్త 125సీసీ స్ప్లిట్ సీట్ బజాజ్ పల్సర్ 125 వేరియంట్ ధర రూ.79,091 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ బైక్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ కొత్త బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్ ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే మరింత స్పోర్టీగా అనిపిస్తుంది. ఇది బజాజ్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న పల్సర్ బ్రాండ్‌లో ఎంట్రీ లెవల్ వేరియంట్. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న పల్సర్ 125సీసీ విభాగంలో కొత్త రేంజ్-టాపింగ్ ట్రిమ్‌గా ఈ కొత్త స్ప్లిట్ సీట్ వేరియంట్‌ను విడుదల చేశారు.

Most Read Articles

English summary
Bajaj Auto has launched a new 'split-seat' variant to its Pulsar 125 model lineup in India. The new Bajaj Pulsar 125 split seat variant is priced at Rs 79,091, ex-showroom (Delhi). The split-seat variant of the 125cc motorcycle is positioned as the new range-topping trim for the motorcycle in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X