సుజుకి హయబుసా లాగ ఉన్న మాడిఫైడ్ బజాజ్ పల్సర్

ఇటీవల కాలంలో చాల మంది వాహన వినియోగదారులు మాడిఫైడ్ చేయబడిన వాహనాలపై ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇదివరకే మాడిఫైడ్ చేయబడిన వాహనాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మాడిఫైడ్ చేయబడిన బజాజ్ పల్సర్ 200 బైక్ గురించి తెలుసుకుందా!

సుజుకి హయబుసా లాగ ఉన్న మాడిఫైడ్ బజాజ్ పల్సర్

దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఒక బజాజ్ పల్సర్ 200 ఎన్ఎస్ ను మాడిఫైడ్ చేయడం జరిగింది. మాడిఫైడ్ చేయబడిన ఈ బజాజ్ మోటార్ సైకిల్ చూడటానికి హయబుసా లాగా ఉంటుంది.

సుజుకి హయబుసా లాగ ఉన్న మాడిఫైడ్ బజాజ్ పల్సర్

హయబుసా మోటార్ సైకిల్ యొక్క ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. కానీ కొంతమంది ఔత్సాహితుల వల్ల ఈ విధంగా మాడిఫైడ్ చేయబడింది. సవరించిన పల్సర్ 200 ఎన్ఎస్ యొక్క వెలుపలి భాగం హయాబుసాతో సమానంగా కనిపిస్తుంది.

సుజుకి హయబుసా లాగ ఉన్న మాడిఫైడ్ బజాజ్ పల్సర్

సవరించిన ఈ మోటార్ సైకిల్ అదే 200 సిసి ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది 23.2 బిహెచ్‌పి మరియు 18.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు హయాబుసా 1340-సిసి ఇన్లైన్-ఫోర్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది, ఇది 197 బిహెచ్‌పి మరియు 155 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి హయబుసా లాగ ఉన్న మాడిఫైడ్ బజాజ్ పల్సర్

మాడిఫైడ్ చేసిన ఈ బైక్ ని గమనించినట్లయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బాడీ ప్యానెల్లు వంటి అంశాలు అసలు మోటార్‌సైకిల్‌ను పోలి ఉంటాయి. బాడీవర్క్ చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇది చూడటానికి అసలైన హయబుసా లాగే ఉంటుంది.

సుజుకి హయబుసా లాగ ఉన్న మాడిఫైడ్ బజాజ్ పల్సర్

సుజుకి హయాబుసా తక్కువ బరువుతో ఉంటుందని ఆశించవచ్చు. దీని ధర దాదాపుగా రూ. 2.5 లక్షలు ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, డ్రైవింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

సుజుకి హయబుసా లాగ ఉన్న మాడిఫైడ్ బజాజ్ పల్సర్

హసన్ రోడ్‌స్టర్స్ యూట్యూబ్ ఛానల్ మాడిఫైడ్ చేసిన ఈ బైక్ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. పల్సర్ ఎన్ఎస్ 200 బైక్‌లో చేసిన అన్ని మార్పులను ఈ వీడియోలో గమనించవచ్చు.

ఢిల్లీకి చెందిన జిఎస్ కస్టమ్స్ సంస్థ ఈ పల్సర్ 200 ఎన్ఎస్ ని మాడిఫైడ్ చేసింది. ఈ కంపెనీ ఇప్పటికే ఇలాంటి బైక్‌లను ఖరీదైన బైకులుగా రూపొందించింది.

సుజుకి హయబుసా లాగ ఉన్న మాడిఫైడ్ బజాజ్ పల్సర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మాడిఫైడ్ చేయబడిన బజాజ్ పల్సర్ చూడటానికి చాల ఆకర్షణీయంగా, మంచి డిజైన్ ని కలిగి ఉంటుంది. ఇది మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. ఇది చూడటానికి సుజుకి హయబుసా వలే స్టైల్ గా ఉంటుంది.

Image Courtesy: The HASSAN ROADSTERS/YouTube

Most Read Articles

English summary
This Bajaj Pulsar 200 NS Modified to Suzuki Hayabusa Can be All Yours For Just Rs 2.5 Lakh. Read in Telugu.
Story first published: Sunday, February 23, 2020, 10:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X