Just In
Don't Miss
- News
నిమ్మగడ్డ టీమ్‌లో మరో కొత్త అధికారి- ఐజీ సంజయ్ పాత్ర ఏంటి ? ఏకగ్రీవాల్ని అడ్డుకోగలరా ?
- Sports
India vs England: చెన్నై చేరుకున్న రోహిత్, రహానే, శార్దూల్
- Finance
పరిహారం చెల్లించకపోతే ఆ ఆస్తులు జఫ్తు చేస్తాం: భారత్‌కు కెయిర్న్ తీవ్ర హెచ్చరిక
- Lifestyle
గోధుమ రవ్వ పాయసం
- Movies
డిజిటల్ రిలీజ్ కు సిద్దమైన మాస్టర్.. ఇక బాక్సాఫీస్ రికార్డులకు బ్రేక్ పడినట్లే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త కలర్స్‌లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ NS & RS బైక్స్ ; ఇప్పుడు వీటి రేటెంతో తెలుసా ?
ప్రముఖ బైక్ తయారీదారు బజాజ్ ఆటో తన ప్రసిద్ధ పల్సర్ ఎన్ఎస్ & ఆర్ఎస్ రేంజ్ మోటార్ సైకిళ్ళను కొత్త కలర్ ఆప్షన్లను విడుదల చేసింది. కొత్త కలర్ స్కీమ్ మరింత బాడీ గ్రాఫిక్‌లను స్వీకరించేటప్పుడు మరింత సమకాలీన రూపాన్ని అందిస్తాయి.

ఎన్ఎస్160, ఎన్ఎస్200 మరియు ఆర్ఎస్200 లను కలిగి ఉన్న ఈ రేంజ్ 160 సిసి మోడల్స్ ప్రారంభ ధర రూ. 1.08 లక్షలు. ఎన్‌ఎస్ 200, ఆర్‌ఎస్ 200 ధరలు వరుసగా రూ .1.31 లక్షలు, రూ .1.52 లక్షలు [ఎక్స్-షోరూమ్,ఢిల్లీ].

కొత్త మోటార్‌సైకిళ్లను ఇప్పుడు రెండు కొత్త పెయింట్ స్కీమ్‌లలో అందిస్తున్నారు. అవి బర్న్ట్ రెడ్ (మాట్టే ఫినిష్) మరియు ప్లాస్మా బ్లూ (శాటిన్ ఫినిష్). ఈ రెండు కొత్త పెయింట్ స్కీమ్‌లు వైట్ అల్లాయ్ వీల్స్ తో వస్తాయి, ముందు మరియు వెనుక ఫెండర్లు ఇప్పుడు కార్బన్-ఫైబర్ ఆకృతిలో పూర్తయ్యాయి. కొత్త మోటారు సైకిళ్ళు సీట్లపై హాట్ స్టాంపింగ్ ప్యాట్రన్ ని కూడా అందిస్తాయి. ఇది దీని విలక్షణమైన రూపాన్ని పెంచుతాయి.
MOST READ:ఈ స్టార్ కపుల్స్ పెళ్లి రోజు కొన్న కారు ధర రూ. 2.65 కోట్లు.. ఇంతకీ వారు ఎవరో తెలుసా ?

దీని గురించి బజాజ్ ఆటో హెడ్ మార్కెటింగ్ నారాయణ్ సుందరరామన్ మాట్లాడుతూ, పల్సర్ ఆర్‌ఎస్200 మరియు ఎన్ఎస్200 మంచి పనితీరుని కలిగి ఉండటం వల్ల ఇప్పటికి అంతర్జాతీయ మార్కెట్లో నిలబడి ఉన్నాయి. ఈ పండుగ సీజన్‌లో, పల్సర్ మార్కెట్ మరింత ఎక్కువగా ఉండటానికి మరియు వాహనప్రియుల కోసం కొత్త పెయింట్ స్కీమ్‌లతో అందిస్తున్నాము, అన్నారు.

ఈ బైక్స్ కొత్త పెయింట్ స్కీమ్ కాకుండా, మరే ఇతర మార్పులు ఉండవు. బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, 200 ఎన్ఎస్ మరియు ఆర్ఎస్ 200 యొక్క నవీనీకరణ సౌందర్య నవీకరణలకు మాత్రమే పరిమితం చేయబడింది.
MOST READ:ట్రక్ దొంగలించిన కొంత సమయానికే పట్టుబడ్డ దొంగల ముఠా.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా ?

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 బైక్ 150 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 17 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మరియు ఆర్ఎస్ 200 బైక్స్ 199 సిసి సింగిల్ సిలిండర్ యూనిట్‌ను ఉపయోగిస్తాయి. ఈ ఇంజన్ 23 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది మరియు 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

బజాజ్ యొక్క ఈ మూడు మోటారు సైకిళ్ళు ఆయా విభాగాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ మోటార్ సైకిళ్ళు మంచి పనితీరు, ఆకట్టుకునే మైలేజ్ అందించడమే కాకుండా వాహనదారునికి అద్భుతమైన సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ కారణాల వల్ల ఈ బైక్ మార్కెట్లో మంచి అమ్మకాలను సాగిస్తున్నాయి.
MOST READ:ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ మరియు ఆర్ఎస్ రేంజ్ లోని కొత్త కలర్స్ ఎక్కువ మంది వినియోగదారుణకు ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్లో బజాజ్ బ్రాండ్ అమ్మకాలను మరింత మెరుగుపరుస్తాయి. భారతీయ మార్కెట్లో టివిఎస్ అపాచీ ఆర్టిఆర్ సిరీస్ మరియు కెటిఎమ్ 200 ట్విన్ మోటారు సైకిళ్ళకు ఈ బైక్స్ ప్రత్యర్థిగా ఉంటుంది.