డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో కొత్త బిఎస్ 6 బజాజ్ పల్సర్ RS 200

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీదారులలో బజాజ్ ఒకటి. బజాజ్ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ఇప్పటికే చాల వాహనాలను విడుదల చేసింది. ఇప్పడు బజాజ్ దేశీయ మార్కెట్లో అప్‌గ్రేడ్‌ చేసిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 బైకును విడుదల చేసింది. ఈ కొత్త బిఎస్ 6 బజాజ్ ఆర్ఎస్ 200 గురించి మరింత సమాచార తెలుసుకుందాం.. !

డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో కొత్త బిఎస్ 6 బజాజ్ పల్సర్ RS 200

ఇటీవల కాలంలో బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 బైకును బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా నవీకరించారు. ఈ మోటార్ సైకిల్‌లో నవీకరించబడిన ఇంజిన్ తప్ప మరే ఇతర మార్పులు జరగలేదు. ఈ కొత్త బజాజ్ బిఎస్ 6 ఆర్ఎస్ 200 ధర మునుపటికంటే సుమారు రూ. 3 వేలు పెరిగాయి. కాబట్టి ఇప్పుడు దీని ధర రూ. 1.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో కొత్త బిఎస్ 6 బజాజ్ పల్సర్ RS 200

బైక్ కి సంబంధించిన కొత్త డీలర్షిప్ జాబితా ఇక్కడ గమనించవచ్చు. దీనిని బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 ట్విన్ ఎబిఎస్ అని పిలుస్తారు. కొత్త వేరియంట్ సాధారణ సింగిల్-ఛానల్ ఎబిఎస్ ఒకటి కంటే కొంచెం ఖరీదైనది. అయినప్పటికీ సంస్థ యొక్క వెబ్‌సైట్ ఇప్పటికీ సింగిల్ ఛానల్ ఒకటి అమ్మకానికి చూపిస్తుంది.

డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో కొత్త బిఎస్ 6 బజాజ్ పల్సర్ RS 200

బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 బిఎస్ 6 మోడల్ అదే 199.5 సిసి లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 9,750 ఆర్‌పిఎమ్ వద్ద 24.1 బిహెచ్‌పి గరిష్ట శక్తిని, 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో కొత్త బిఎస్ 6 బజాజ్ పల్సర్ RS 200

ఈ కొత్త బిఎస్ 6 మోటారుసైకిల్లో డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ సెటప్, పార్ట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, పల్సర్ ఆర్ఎస్ 200 యొక్క సస్పెన్షన్ విధులను గమనించినట్లయితే ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ వంటివి ఉంటాయి.

డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో కొత్త బిఎస్ 6 బజాజ్ పల్సర్ RS 200

మోటారుసైకిల్‌లో బ్రేకింగ్ సిస్టం గమనించినట్లయితే దీని ముందు భాగంలో 300 ఎంఎం డిస్క్‌లు మరియు వెనుక వైపు 230 ఎంఎం డిస్క్‌ ఉంటాయి. అంతే కాకుండా ఇప్పుడు రెండు చివర్లలో ఎబిఎస్‌ను కలిగి ఉంది. ఆర్ఎస్ 200 రెండు చివర్లలో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఎంఆర్ఎఫ్ టైర్లను కలియోగి కొంటుంది.

డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో కొత్త బిఎస్ 6 బజాజ్ పల్సర్ RS 200

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 బిఎస్ 6 మోడల్ భారత మార్కెట్లో కెటిఎమ్ ఆర్‌సి 200 లో ఉన్న మరో 200 సిసి మోటారుసైకిల్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది.

డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో కొత్త బిఎస్ 6 బజాజ్ పల్సర్ RS 200

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

బజాజ్ ఆర్ఎస్ 200 మోటార్ సైకిల్ ని బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేశారు. అంతే కాకుండా ఇప్పుడు డీలర్షిప్ జాబితాలో కనిపించే విధంగా డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ ను కూడా పొందుతుంది. కొత్త ఎబిఎస్ నవీకరణతో బజాజ్ ఆర్ఎస్ 200 కొన్ని కఠినమైన పరిస్థితుల్లో ప్రయాణించడానికి కూడా చాలా సురక్షితంగా ఉపయోగపడుతుంది.

Most Read Articles

English summary
Bajaj Pulsar RS200 Gets Dual-Channel ABS Along With The BS6 Upgrade. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X