బెనెల్లీ నుంచి కొత్త బైక్ విడుదల; వివరాలు

ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ ఓ సరికొత్త మోటార్‌సైకిల్‌ను గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. బెనెల్లీ క్యూజే ఎస్ఆర్‌కే 600 (Benelli QJ SRK 600) పేరుతో ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదలైన ఈ సరికొత్త సూపర్‌బైక్ వచ్చే ఏడాది నాటికి ఇండియన్ మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. భారత విపణిలో ఇది కొత్త తరం టిఎన్‌టి 600 పేరుతో విడుదల కానుంది.

బెనెల్లీ నుంచి కొత్త బైక్ విడుదల; వివరాలు

బెనెల్లీ అనుబంధ బ్రాండ్ క్యూజే మోటార్ అందిస్తున్న ఎస్ఆర్‌కే 600 మోటార్‌సైకిల్‌నే ఇతర మార్కెట్లలో టిఎన్‌టి 600 పేరుతో విక్రయిస్తున్నారు. క్యూజే ఎస్ఆర్‌కే 600 బైక్‌ను 2020 మోడల్ ఇయర్ కోసం అనేక రకాల మార్పులు చేర్పులతో తీర్చిదిద్దారు. ఈ బైక్ డిజైన్‌ను చాలా వరకూ మార్చారు, అలాగే ఇందులో సెగ్మెంట్లో కెల్లా తొలుతగా, ఇగ్నిషన్‌లో తాళం ఉంచాల్సిన అవసరం లేకుండా బైక్‌ను స్టార్ట్ చేసేలా కీలెస్ స్టార్ట్ ఫీచర్‌ను జోడించారు. ఇంకా ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం బ్యాక్‌లిట్ స్విచెస్‌ను కూడా అమర్చారు.

బెనెల్లీ నుంచి కొత్త బైక్ విడుదల; వివరాలు

అంతర్జాతీయ మార్కెట్ల కోసం విడుదలైన బెనెల్లీ క్యూజే ఎస్ఆర్‌కే 600 మోటార్‌సైకిల్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో (స్టాండర్డ్, మీడియం, హై) లభిస్తుంది. ఇది రెడ్, బ్లాక్, వైట్ మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన అదే పాత ఇంజన్‌నే ఈ కొత్త బైక్‌లో కూడా ఉపయోగించనున్నారు. అయితే, ఇండియన్ మార్కెట్ కోసం ఈ ఇంజన్‌లో కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉంది.

MOST READ: బిఎస్ 6 ఇంజిన్‌తో విడుదల కానున్న బెనెల్లి ఇంపీరియర్ 400 బైక్

బెనెల్లీ నుంచి కొత్త బైక్ విడుదల; వివరాలు

కొత్త తరం బెనెల్లీ టిఎన్‌టి 600లో ఉపయోగించే 600-సీసీ ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 81 బిహెచ్‌పిల శక్తిని మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 55 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ స్టాండర్డ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో బిఎస్6 ఇంజన్ విషయానికి వస్తే.. అప్‌గ్రేడ్ అనంతరం బిఎస్4 వెర్షన్ కన్నా ఇది 3 బిహెచ్‌పిల తక్కువ శక్తిని, 0.4 ఎన్ఎమ్‌ల తక్కువ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

బెనెల్లీ నుంచి కొత్త బైక్ విడుదల; వివరాలు

మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా 2020 వెర్షన్ బెనెల్లీ టిఎన్‌టి 600 బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఎంట్రీ-లెవల్ మోడల్ అయిన 'స్టాండర్డ్'లో సస్పెన్షన్ మరియు బ్రేక్ సెటప్‌ను బెనెల్లీ బ్రాండ్ అందిస్తుంది. అలాగే 'మీడియం' వేరియంట్‌లో ఈ సెటప్‌ను కెవైబి మరియు జిహు బ్రాండ్‌లు అందిస్తున్నాయి. ఇకపోతే టాప్-ఎండ్ వేరియంట్ అయిన 'హై'లో మాత్రం ముందు వైపు మార్జూఖీ యూఎస్‌డి ఫోర్క్, వెనుక వైపు కెవైబి మోనో-షాక్ సస్పెన్షన్లను అమర్చారు. బ్రేక్ సెటప్‌ను మాత్రం పాపులర్ బ్రాండ్ అయిన బ్రెమ్బూ నుంచి సేకరించారు.

MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ పుట్టించిన బెనెల్లీ ఇంపీరియాలే 400

బెనెల్లీ నుంచి కొత్త బైక్ విడుదల; వివరాలు

ఇక ఈ కొత్త తరం మోటార్‌సైకిల్ విషయానికి వస్తే.. మునుపటి దాని కన్నా ఇది 10 మి.మీ సన్నగా ఉండంతో పాటుగా 20 మి.మీ తక్కువ వీల్‌బేస్ (మొత్తం 1,460 మి.మీ)ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడల్ కన్నా 33 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ మార్పుల వలన కొత్త బెనెల్లీ టిఎన్‌టి 600 హ్యాండ్లింగ్ మరింత స్మూత్‌గా, సులువుగా అనిపిస్తుంది.

బెనెల్లీ నుంచి కొత్త బైక్ విడుదల; వివరాలు

ఈ కొత్త బైక్‌లో డిజైన్ మార్పులను గమనిస్తే, 2020 వెర్షన్ క్యూజే ఎస్ఆర్‌కే 600 బైక్‌లో మరింత షార్ప్‌గా ఉండే ఫ్రంట్ డిజైన్, రీడిజైన్ చేయబడిన ఫ్యూయెల్ ట్యాంక్ మరియు సైడ్ కవర్స్, ఆకర్షనీయమైన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ డిజైన్, గోల్డెన్ కలర్‌లో పెయింట్ చేయబడిన ఫ్రంట్ ఫోర్క్ మరియు ఇంజన్ క్రింది భాగపు సైలెన్సర్ పైప్స్, ట్విన్ ఎగ్జాస్ట్ (రెండు సైలెన్సర్ల) డిజైన్ వంటి మార్పులను మనం ఇందులో గమనించవచ్చు.

MOST READ: బెనెల్లీ లియాన్సినో 250 ప్రీమియం బైక్ విడుదల: ధర మరియు స్పెసిఫికేషన్స్

బెనెల్లీ నుంచి కొత్త బైక్ విడుదల; వివరాలు

కొత్త తరం బెనెల్లీ టిఎన్‌టి 600 బైక్‌లో సరికొత్తగా 5-ఇంచ్ ఫుల్ కలర్ టిఎఫ్‌టి డిస్‌ప్లేతో కూడిన కన్సోల్‌ను జోడించారు. ఇది బైక్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రైడర్‌కు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మోడల్‌లో అనలాగ్ డిజిటల్ డిస్‌ప్లే మాత్రమే ఉండేది. భారత్‌లో విడుదలయ్యే మోటార్‌సైకిల్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉండొచ్చని అంచనా.

బెనెల్లీ నుంచి కొత్త బైక్ విడుదల; వివరాలు

బెనెల్లీ క్యూజే ఎస్ఆర్‌కే 600 (2020 టిఎన్‌టి 600)పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బెనెల్లీ ఇప్పటికే టిఎన్‌టి 600 బైక్‌ను ఇండియన్ మార్కెట్లో ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ వచ్చే ఏడాది నాటికి ఈ సరికొత్త 2020 వెర్షన్‌ను కూడా ఇక్కడి మార్కెట్‌కు పరిచయం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్లో లభిస్తున్న కవాసకి జీ650, సిఎఫ్‌మోటో 600ఎన్‌కె వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనున్న బెనెల్లీ టిఎన్‌టి 600 బైక్‌ను మంచి కాంపిటీటివ్ ధరకే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుత మోడల్‌తో పోల్చుకుంటే ఈ కొత్త వెర్షన్ మరింత ఫ్యూచరిస్టిక్‌గా అనిపిస్తుంది.

Most Read Articles

English summary
Benelli has launched a new 600cc motorcycle called the QJ SRK 600 in the Chinese market. The same motorcycle is expected to arrive in India as the new-generation TNT 600 sometime during the next year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X