బెనెల్లీ కొత్త 'స్టేట్ ఆఫ్ ఆర్ట్' డీలర్‌షిప్ ప్రారంభం; ఎక్కడో తెలుసా?

ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈసారి మహావీర్ గ్రూప్ అనుబంధ సంస్థ హైదరాబాద్‌కు చెందిన ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇంటర్నేషనల్ (ఏఏఆర్ఐ) భాగస్వామ్యంతో బెనెల్లీ భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది.

బెనెల్లీ కొత్త 'స్టేట్ ఆఫ్ ఆర్ట్' డీలర్‌షిప్ ప్రారంభం; ఎక్కడో తెలుసా?

ఈ కంపెనీ ఇటీవలే భారత్‌లో తమ 29వ ప్రత్యేక షోరూమ్‌ను ప్రారంభించింది. తాజాగా ఓపెన్ చేసిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బెనెల్లీ షోరూమ్‌ను ఉదయపూర్‌లోని శోభగ్‌పురాలో ఉంది.

ఈ అత్యాధునిక షోరూమ్‌లో బెనెల్లీ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన ఇంపీరియల్ 400 బిఎస్6తో మరిన్ని మోడళ్లను ప్రదర్శనకు ఉంచారు. దేశీయ విపణిలో కొత్త బిఎస్6 కంప్లైంట్ బెనెల్లీ ఇంపీరియల్ 400 ప్రారంభ ధర రూ.1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

బెనెల్లీ కొత్త 'స్టేట్ ఆఫ్ ఆర్ట్' డీలర్‌షిప్ ప్రారంభం; ఎక్కడో తెలుసా?

ఈ మోటార్‌సైకిల్ ధర మునుపటి బిఎస్4 వెర్షన్ కంటే ధర కంటే రూ.20,000 అధికంగా ఉంటుంది. కొత్త బెనెల్లీ ఇంపీరియల్ 400 బిఎస్6 మోడల్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌లో లేదా భారతదేశంలోని ఏదైనా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా రూ.6,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

MOST READ:అరుదైన పాతకాలపు కారు కొన్న M.S ధోని : దీని రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు

బెనెల్లీ కొత్త 'స్టేట్ ఆఫ్ ఆర్ట్' డీలర్‌షిప్ ప్రారంభం; ఎక్కడో తెలుసా?

కొత్త ఇంపీరియల్ 400 బిఎస్6 ఇదివరకటి 374సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 20 బిహెచ్‌పి శక్తిని మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 29 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

బెనెల్లీ కొత్త 'స్టేట్ ఆఫ్ ఆర్ట్' డీలర్‌షిప్ ప్రారంభం; ఎక్కడో తెలుసా?

బెనెల్లీ నుండి భారత మార్కెట్ కోసం రానున్న బిఎస్6 మోడళ్లలో టిఆర్‌కె 502, టిఆర్‌కె 502ఎక్స్, లియోన్సినో 500, 302ఎస్ మరియు 302ఆర్, లియోన్సినో 250 మరియు టిఎన్‌టి 600ఐ మోటార్‌సైకిళ్లు ఉన్నాయి.

MOST READ:ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన కొత్త ఎస్‌యూవీ, ఇదే

బెనెల్లీ కొత్త 'స్టేట్ ఆఫ్ ఆర్ట్' డీలర్‌షిప్ ప్రారంభం; ఎక్కడో తెలుసా?

ఉదయ్‌పూర్‌లో కొత్త స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ షోరూమ్‌ను ప్రారంభించిన సందర్భంగా బెనెల్లీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జాబఖ్ మాట్లాడుతూ, 'ప్రిజ్మ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్'తో భాగస్వామ్యం కుదుర్చుకోవటం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, మా కస్టమర్ సేవల ఫిలాసఫీ మా ఉదయపూర్ డీలర్ భాగస్వామి యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది. బెనెల్లీలోని ఉద్యోగులు కూడా సేల్స్, సర్వీస్ మరియు కస్టమర్ అనుభవాల పరంగా ఉత్తమమైన వాటిని అందించడంలో బాగా నైపుణ్యం కలిగిన వారు. వీరు కస్టమర్లకు బెస్ట్ ఇన్ క్లాస్ సేవలను మరియు ఒత్తిడి లేని యాజమాన్యాన్ని అందిస్తారని" అన్నారు.

బెనెల్లీ కొత్త 'స్టేట్ ఆఫ్ ఆర్ట్' డీలర్‌షిప్ ప్రారంభం; ఎక్కడో తెలుసా?

బెనెల్లీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ షోరూమ్ ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బెనెల్లీ ప్రారంభించిన ఈ కొత్త స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ షోరూమ్ కస్టమర్‌ల యొక్క ప్రతి అవసరాన్ని నెరవేరుస్తుంది మరియు ఇబ్బందులు లేని కొనుగోలు అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక కొత్తగా వచ్చిన ఇంపీరియేల్ 400 విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో విడుదలైనప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఈ విభాగంలో జావా మోటార్‌సైకిల్స్ మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:ఇప్పుడు పియుసిసి లేని వాహనాలకు భారీ జరిమానా : ఎంతో తెలుసా ?

Most Read Articles

English summary
Benelli re-entered the Indian market under the partnership with Hyderabad-based Adishwar Auto Ride International (AARI), a subsidiary of Mahavir Group. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X