ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త బిఎండబ్ల్యు ఆర్18 క్రూయిజర్

బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఇటీవల తన బ్రాండ్ అయిన కొత్త ఆర్ 18 క్రూయిజర్ ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఆర్ 18 క్రూయిజర్ బైక్ కోసం వినియోగదారులనుంచి అనధికారికంగా బుకింగ్ ప్రారంభించింది. ఈ కొత్త బిఎండబ్ల్యూ బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. !

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త బిఎండబ్ల్యు ఆర్18 క్రూయిజర్

బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ తన కొత్త ఆర్ 18 క్రూయిజర్‌ భారత్‌లో విడుదల కానుంది.ఈ కొత్త బైక్స్ యొక్క డెలివరీలు అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది. కొత్త ఆర్ 18 క్రూయిజర్ బైక్‌ను లక్ష రూపాయలకు బుక్ చేసుకోవచ్చు. ఈ జర్మన్ బ్రాండ్ యొక్క కొత్త బిఎండబ్ల్యు R18 క్రూయిజర్ గత సంవత్సరం కాన్సెప్ట్ మోడల్‌గా ఆవిష్కరించబడింది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త బిఎండబ్ల్యు ఆర్18 క్రూయిజర్

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్రూయిజర్ డోడో టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ రెట్రో-మోడరన్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ అనేక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. ఈ కొత్త బైక్‌లో 1800 సిసి బాక్సర్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త బిఎండబ్ల్యు ఆర్18 క్రూయిజర్

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్రూయిజర్‌ను ఫస్ట్ ఎడిషన్ బైక్ ఆర్ 5 క్లాసిక్ మాదిరిగానే స్టాండర్డ్ మరియు ఫస్ట్ ఎడిషన్ అనే రెండు వేరియంట్‌లలో అందిస్తున్నారు. ఈ బైక్‌లో స్ట్రిప్పింగ్, లెదర్ బెల్ట్ మరియు స్లాటెడ్ స్క్రూలు ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్రూయిజర్‌లో 1,731 ఎంఎం వీల్‌బేస్ ఉంది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త బిఎండబ్ల్యు ఆర్18 క్రూయిజర్

కొత్త బిఎండబ్ల్యు ఆర్ 18 క్రూయిజర్ బైక్ దాని ప్రత్యర్థి హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ కంటే 23 కిలోల ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్రూయిజర్ బైక్‌లో రెట్రో లుక్ మినహా అన్ని మర్డాన్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఈ బైక్‌లో ఎలక్ట్రానిక్స్ ఫీచర్లు, మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ కొత్త బైక్ ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్, మోటార్ స్లిప్ రెగ్యులేషన్ మరియు ఎబిఎస్.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త బిఎండబ్ల్యు ఆర్18 క్రూయిజర్

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్రూయిజర్ బైక్‌లో హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్ మరియు డిఆర్‌ఎల్‌తో సహా ఎల్‌ఇడి లైటింగ్ ఉంటుంది. ఈ బైక్ పెద్ద అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో చిన్న డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త బిఎండబ్ల్యు ఆర్18 క్రూయిజర్

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్రూయిజర్‌లో 1802 సిసి బాక్సర్ ఇంజన్ ఉంది. ఇంజిన్ 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 91 బిహెచ్‌పి శక్తిని మరియు 2000 మరియు 4000 ఆర్‌పిఎమ్ మధ్య 149 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త బిఎండబ్ల్యు ఆర్18 క్రూయిజర్

ఈ కొత్త బిఎండబ్ల్యు బైక్ త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. ఇది విడుదలైన తరువాత పరిమితి సంఖ్యలో విక్రయాలు జరిపే అవకాశం ఉంటుంది. బిఎండబ్ల్యు R18 అనేది జర్మన్ బ్రాండ్ యొక్క పూర్తి స్థాయి హెవీవెయిట్ క్రూయిజర్.

Most Read Articles

English summary
BMW R18 cruiser bookings open. Read in Telugu.
Story first published: Wednesday, April 8, 2020, 19:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X