ఇండియన్ బైక్స్‌లో ఎండలో చల్లగా, చలిలో వేడిగా ఉండే బైక్ సీట్స్

అమెరికన్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఇండియన్ మోటార్‌సైకిల్ తమ మోటార్‌సైకిళ్లలో ఓ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటి వరకూ కార్లకు మాత్రమే పరిమితమైన హీట్/కూల్ సీట్లను ఇప్పుడు తమ మోటార్‌సైకిళ్లలో కూడా అందించనుంది. క్లైమాకమాండ్ క్లాసిక్ సీట్‌గా పిలిచే కొత్త బై-ఫంక్షనల్ సీటును ఇండియన్ మోటార్‌సైకిల్ విడుదల చేసింది.

ఇండియన్ బైక్స్‌లో ఎండలో చల్లగా, చలిలో వేడిగా ఉండే బైక్ సీట్స్

ఈ అధునాతన సీట్‌ను ఇండియన్ మోటార్‌సైకిల్ అందిస్తున్న చీఫ్, చీఫ్‌టైన్ మరియు రోడ్‌మాస్టర్ మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త హాట్ అండ్ కోల్డ్ సీటును థర్మోఎలెక్ట్రిక్ మాడ్యూల్ గ్రాఫేన్ నిర్మాణంతో చేయబడి ఉంటాయి, ఇది ఒక్క కమాండ్‌తో రైడర్ మరియు పిలియన్ రైడర్ సీట్లను వేడిగా లేదా చల్లగా చేస్తాయి. ప్రతి సీటుకు ఉష్ణోగ్రతను స్వతంత్రంగా నియంత్రించుకునే సౌకర్యం కూడా ఉంటుంది.

ఇండియన్ బైక్స్‌లో ఎండలో చల్లగా, చలిలో వేడిగా ఉండే బైక్ సీట్స్

ఆఫ్టర్ మార్కెట్‌లో దొరికే ఇలాంటి సీటింగ్ యూనిట్లలో సీటులో ఉండే రంధ్రాల గుండా వేడి గాలి లేదా చల్లగాలి బ్లో అవుతుంది. అయితే, ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ తయారు చేసిన సీట్ అలా కాకుండా, సీటు నిర్మాణంలోనే థర్మోఎలెక్ట్రిక్ మాడ్యూల్ గ్రాఫేన్ ఉండటం వలన ఇది సీటు మొత్తాన్ని సమర్ధవంతంగా చల్లగా లేదా వేడిగా మారుస్తుంది.

MOST READ: భారత్‌లో ఇప్పుడు డీజిల్, పెట్రోల్ కంటే కాస్ట్లీ, ఎక్కడో తెలుసా..!

ఇండియన్ బైక్స్‌లో ఎండలో చల్లగా, చలిలో వేడిగా ఉండే బైక్ సీట్స్

సీట్ క్రింది భాగంలో ఉన్న థర్మోఎలెక్ట్రిక్ మాడ్యూల్ గ్రాఫేన్ గుండా విద్యుత్తు ప్రసరింపచేసి ఉష్ణోగ్రతలను అదుపు చేస్తుంది. ప్రస్తుతానికి ఈ సీట్లు అమెరికా మార్కెట్లలో మాత్రమే లభ్యం కానున్నాయి, అందులోనూ ఇండియన్ చీఫ్, ఇండియన్ చీఫ్‌టైన్ మరియు ఇండియన్ రోడ్‌మాస్టర్ మోడళ్లలో మాత్రేమ అందుబాటులో ఉన్నాయి. అక్కడి మార్కెట్లో కేవలం ఈ సీటు ధర మాత్రమే 1,200 డాలర్లు (సుమారు రూ. 91,000 ప్లస్ టాక్స్)గా ఉంది.

ఇండియన్ బైక్స్‌లో ఎండలో చల్లగా, చలిలో వేడిగా ఉండే బైక్ సీట్స్

కాగా.. ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ భారత మార్కెట్లో తమ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. పైన పేర్కొన్న మూడు మోడళ్లు కూడా మన దేశంలో అమ్మకానికి ఉన్నాయి. అయితే, ఇక్కడి మార్కెట్లో తమ అధునాత హాట్/కూల్ సీట్లను విడుదల చేసే విషయంపై కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

భారతదేశానికి వెళ్ళే సీట్ల గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేనప్పటికీ, భారతీయ మోటార్ సైకిల్ దేశంలోని చీఫ్, చీఫ్టైన్ మరియు రోడ్ మాస్టర్ మోడళ్లను విక్రయిస్తుందని పరిగణనలోకి తీసుకుంటాము.

MOST READ: ఇండియన్ మార్కెట్లో 73,336 రూపాయలకే హోండా గ్రాజియా

ఇండియన్ బైక్స్‌లో ఎండలో చల్లగా, చలిలో వేడిగా ఉండే బైక్ సీట్స్

కార్బిన్, కోన్‌టూర్ వంటి పాపులర్ ఆఫ్టర్ మార్కెట్ కంపెనీలు ఈ తరహా హాట్/కూల్ సీట్లను తయారు చేస్తుంటాయి. అయితే, ఇవి ప్రధానంగా హార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్ల కోసం వీటిని ఎక్కువగా తయారు చేస్తాయి.

ఇండియన్ బైక్స్‌లో ఎండలో చల్లగా, చలిలో వేడిగా ఉండే బైక్ సీట్స్

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌కి సంబంధిత ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఇండియన్ ఎఫ్‌టిఆర్ కార్బన్, ఇండియన్ ఎఫ్‌టిఆర్ ర్యాలీ అనే రెండు కొత్త మోడళ్లను చేర్చింది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ రెండు మోడళ్లు త్వరలోనే భారత మార్కెట్లో విడుదలవుతాయన్న ఊహాగానాలు నిజం కానున్నట్లు తెలుస్తోంది.

MOST READ: కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

ఇండియన్ బైక్స్‌లో ఎండలో చల్లగా, చలిలో వేడిగా ఉండే బైక్ సీట్స్

ఈ మోటార్‌సైకిళ్ల హైలైట్స్ ఏంటంటే.. ఫ్రంట్ ఫెండర్, ఫ్యూయల్ ట్యాంక్, ఎయిర్ బాక్స్ కవర్స్ మరియు ప్యాసింజర్ సీట్ కౌల్ అన్నీ కూడా కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడ్డాయి. ఫలితంగా ఈ బైక్ లైట్ వెయిట్‌ని కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిళ్లలో కొత్త షాట్‌గన్ స్టైల్ ఎగ్జాస్ట్ కవర్ కూడా ఉంటుంది.

ఇండియన్ బైక్స్‌లో ఎండలో చల్లగా, చలిలో వేడిగా ఉండే బైక్ సీట్స్

ఇండియన్ మోటార్‌సైకిల్ హాట్/కూల్ సీట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఆఫ్టర్ మార్కెట్లో ఇప్పటికే మోటార్‌సైకిళ్ల కోసం హాట్/కూల్ సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇండియన్ మోటార్‌సైకిల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని స్వతహాగా తయారు చేయటం విశేషం. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో అన్ని మోటార్‌సైకిళ్లలో అందుబాటులోకి వస్తుందని మేము ఆశిస్తున్నాము. మండు వేసవిలో చల్లటి సీటుకు మించింది మరొకటి లేదు!

Most Read Articles

English summary
American two-wheeler manufacturer, Indian Motorcycle, has launched a new bi-functional seat. Called the ClimaCommand Classic Seat, it is available for the brand's Chief, Chieftain, and Roadmaster models only. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X