డీలర్ల వద్దకు డ్యుకాటి పానిగేల్ వి2; త్వరలోనే డెలివరీలు - ధర, వివరాలు
ఇటాలియన్ సూపర్‌బైక్ కంపెనీ డ్యుకాటి గడచిన నెలాఖరులో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త 2020 'పానిగేల్ వి2' మోడల్ ఇప్పుడిప్పుడే డీలర్లను చేరుకుంటోంది. దేశీయ విపణిలో కొత్త డ్యుకాటి పానిగేల్ వి2 ధర రూ.16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

బైక్‌వాలే నుండి వచ్చిన తాజా నివేదికల ప్రకారం, పానిగేల్ వి2 దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌ల వద్దకు రావడాన్ని మనం చూడొచ్చు. డీలర్‌షిప్‌ల వద్దకు డిస్‌ప్లే మోడళ్లు రావడాన్ని చూస్తుంటే, అతి త్వరలోనే ఈ మోటారుసైకిల్ డెలివరీలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

డ్యుకాటి బ్రాండ్‌కు భారత్‌లో ఇది మొట్టమొదటి బిఎస్6 కంప్లైంట్ సూపర్‌బైక్ కావటం విశేషం. ఇప్పటి వరకూ డ్యుకాటి విక్రయించిన ఐకానిక్ 959 పానిగేల్ మోడల్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ కంపెనీ ఈ కొత్త 2020 డ్యుకాటి పానిగేల్ వి2 మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

డ్యుకాటి పానిగేల్ వి2 బిఎస్6 మోటార్‌సైకిల్‌లో 955 సిసి సూపర్‌క్వాడ్రో 90-డిగ్రీ వి2 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 155 బిహెచ్‌పి శక్తిని మరియు 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మునుపటి బిఎస్4 మోడల్ పవర్ టార్క్ గణాంకాలతో పోల్చుకుంటే కొత్త బిఎస్6 మోడల్ 5 బిహెచ్‌పిల శక్తిని మరియు 2 ఎన్ఎమ్‌ల టార్క్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది.

ఈ మోటార్‌సైకిల్‌లో 4.3 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే ఉంటుంది. ఇది రైడర్‌కు కావల్సిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. డ్యుకాటి పానిగేల్ వి2లో రైడర్ సహాయం కోసం అనేక ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో కార్నరింగ్ ఏబిఎస్, ఫుల్ రైడ్-బై-వైర్ సిస్టమ్, ఆటో టైర్ కాలిబ్రేషన్, ఇంజన్ బ్రేకింగ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, స్లిప్పర్-క్లచ్, డ్యూయెల్-వే క్విక్-షిఫ్టర్ మరియు మూడు రైడింగ్ మోడ్స్ (రేస్, స్పోర్ట్ మరియు స్ట్రీట్) ఉన్నాయి.

డ్యుకాటి పానిగేల్ వి2లో ముందువైపు షోవా నుండి సేకరించిన పూర్తిగా సర్దుబాటు చేయగల 43 ఎంఎం ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు సాచ్స్ నుండి గ్రహించిన సర్దుబాటు చేయగల వన్-సైడెడ్ అల్యూమినియం స్వింగ్-ఆర్మ్ ఉన్నాయి. బ్రేక్స్ విషయానికి వస్తే, ముందు భాగంలో బ్రెంబో నుండి సేకరించిన 4-పిస్టన్ కాలిపర్‌లతో డ్యూయెల్ 320 ఎంఎం ఫ్లోటింగ్ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో ఒకే ఒక 245 ఎంఎం డిస్క్ బ్రేక్స్ ఉంటుంది.

డ్యుకాటి పానిగేల్ వి2లో పిరెల్లి డయాబ్లో రోసో కోర్సా II టైర్లను ఉపయోగించారు. ఈ టైర్లను 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై అమర్చారు. బెటర్ సీటింగ్ కంఫర్ట్ కోసం సీట్లను 5 మి.మీ అదనపు ఫోమ్‌తో తయారు చేశారు. దీని ఫలితంగా ముందు వైపు 2 మి.మీ మరియు వెనుక వైపు 5 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ పెరుగుతుంది. డ్యుకాటి పానిగేల్ వి2 చాలా చురుకైన, సహజమైన మరియు సరదాగా నడపడానికి వీలుండే ఓ గొప్ప సూపర్‌బైక్.

డ్యుకాటి పానిగేల్ వి2మోటార్‌సైకిల్ మొత్తం బరువు 200 కిలోలు (కెర్బ్ వెయిట్) మరియు ఇంధన ట్యాంక్ సామర్ధ్యం 17 లీటర్లు. పానిగేల్ వి2 100 కిలోమీటర్లకు 6 లీటర్ల ఇంధనాన్ని ఖాళీ చేస్తుంది. అంటే సగటున ఇది లీటరుకు సుమారు 16 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఇది భారత మార్కెట్లో ఒకే ఒక్క కలర్ ఆప్షన్ (రెడ్ పెయింట్ స్కీమ్)తో లభిస్తుంది.

డ్యుకాటి పానిగేల్ వి2 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
కొత్త డ్యుకాటి పానిగేల్ వి2 బిఎస్6 మోడల్‌లో చేసిన మార్పుల చేర్పుల కారణంగా ఇది మునుపటి కన్నా మరింత స్టయిలిష్‌గా కనిపిస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోని సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 1000ఎఫ్, ఆప్రిలియా ఆర్‌ఎస్‌వి4 ఆర్‌ఆర్, ఆప్రిలియా ఆర్‌ఎస్‌వి4 ఆర్‌ఎఫ్ మరియు కవాసకి నింజా హెచ్2 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








