డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఆవిష్కరణ; వివరాలు

ఇటాలియన్ సూపర్ బైక్ కంపెనీ డ్యుకాటి అందిస్తున్న పానిగల్ సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి అనే పేరుతో కంపెనీ ఓ కొత్త మోటార్‌సైకిల్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. కొత్త 2021 డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి డిజైన్, ఫీచర్స్ మరియు ఎలక్ట్రానిక్స్ పరంగా అనేక అప్‌గ్రేడ్స్‌ను కలిగి ఉంది.

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఆవిష్కరణ; వివరాలు

డ్యుకాటి 851 ద్వారా మొట్టమొదట సారిగా కంపెనీ ప్రవేశపెట్టిన స్పోర్ట్ ప్రొడక్షన్ (ఎస్‌పి) పేరును కంపెనీ తిరిగి పానిగల్ వి4 ద్వారా తీసుకువచ్చింది. ‘ఎస్‌పి' బ్యాడ్జింగ్‌ను ఈ సూపర్‌ బైక్ ఫెయిరింగ్‌పై ప్రత్యేకంగా ఉంచబడుతుంది. "ఎస్పి" అనే ఎక్రోనిం నిర్దిష్ట సాంకేతిక పరికరాలతో ప్రొడక్షన్ బైక్ మధ్య తేడాను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది, ఇవి ట్రాక్‌ను ఉద్దేశించి తయారు చేయబడినవి.

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఆవిష్కరణ; వివరాలు

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పిలో "వింటర్ టెస్ట్" లివరీ ఉంటుంది, ఇది మోటోజిపి మరియు ఎస్‌బికె ఛాంపియన్‌షిప్‌ల ప్రీ-సీజన్ పరీక్షలలో ఉపయోగించే డ్యుకాటి కోర్స్ బైక్‌ల నుండి ప్రేరణ పొంది తయారు చేయబడినవి. ఈ మోటార్‌సైకిల్‌లో కార్బన్-ఫైబర్ వింగ్లెట్లు కూడా అమర్చబడి ఉంటాయి, ఇవి మెరుగైన ఏరోడైనమిక్స్‌ను అందిస్తాయి.

MOST READ:టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌లో మరో అడుగు ముందుకేసిన డ్రైవ్‌స్పార్క్ ; వివరాలు

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఆవిష్కరణ; వివరాలు

పానిగల్ వి4 ఎస్‌పి అగ్రెసివ్‌గా మరియు అంతే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దీని ఫ్రంట్ ప్రొఫైల్ చాలా స్టైలిష్‌గా అనిపిస్తుంది. ఈ మోటారుసైకిల్‌లో ఎయిర్-ఇన్‌లెట్‌లతో పాటు ఏర్పాటు చేసిన ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. హెడ్‌ల్యాంప్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు కూడా కనిపిస్తాయి.

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఆవిష్కరణ; వివరాలు

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి లో 1103 సిసి లిక్విడ్-కూల్డ్ వి4 డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 13,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 213 బిహెచ్‌పి పవర్‌ను మరియు 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 124 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో పాటు (డిక్యూఎస్) డ్యుకాటి క్విక్ షిఫ్ట్ ఇవో 2 బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ టెక్నాలజీతో జతచేయబడుతుంది. వి4 ఎస్‌పి రేసింగ్ పరిస్థితులకు అనుగుణంగా డ్రై క్లచ్‌ను కూడా కలిగి ఉంటుంది.

MOST READ:కొత్త ఫీచర్స్‌తో రానున్న 2021 రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ.. చూసారా!

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఆవిష్కరణ; వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌లోని ఇతర డిజైన్ ఫీచర్లలో పొడవైన విండ్‌స్క్రీన్, ఫ్రేమ్ ప్రొటెక్టర్లు, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం పూర్తి డిజిటల్ 5-ఇంచ్ టిఎఫ్‌టి కలర్ డిస్ప్లే, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్ మరియు సింగిల్-సైడెడ్ స్వింగార్మ్ మొదలైనవి ఉన్నాయి.

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఆవిష్కరణ; వివరాలు

పానిగల్ వి4 ఎస్‌పి సస్పెన్షన్‌ను గమనిస్తే, దీని ముందు భాగంలో ఓహ్లిన్స్ ఎన్ఐఎక్స్30 43మిమీ ఫుల్లీ అడ్జస్టబల్ అప్ సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ఓహ్లిన్స్ టిటిఎక్స్36 మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇవి పూర్తిగా సర్దుబాటు చేయగల యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి. ఈ రెండు యూనిట్లలో ఓహ్లిన్స్ స్మార్ట్ ఇసి 2.0 ఎలక్ట్రానిక్ డ్యాంపర్స్ ఉన్నాయి.

MOST READ:హార్లే డేవిడ్సన్‌కు వ్యతిరేకంగా బైక్ ఓనర్స్ ర్యాలీ.. ఎందుకో తెలుసా ?

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఆవిష్కరణ; వివరాలు

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో బ్రెంబో నుండి గ్రహించిన డ్యూయెల్ 330 మిమీ డిస్క్ మోనోబ్లోక్ స్టైల్మా ఆర్ 4-పిస్టన్ కాలిపర్స్ మరియు వెనుక భాగంలో, బ్రెంబో టూ-పిస్టన్ కాలిపర్ సెటప్‌తో పాటు 245 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇవి రెండూ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఆవిష్కరణ; వివరాలు

కంపెనీ పానిగల్ వి4 ఎస్‌పికి కార్బన్-ఫైబర్ వీల్ అప్‌గ్రేడ్‌ను ఇచ్చింది. ఫలితంగా, ఈ మోటారుసైకిల్ 173 కిలోగ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్ రెండు చివర్లలో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి, వాటిపై ముందు మరియు వెనుక వరుసగా పిరెల్లి డయాబ్లో సూపర్‌కోర్సా టైర్లతో సెక్షన్ 120/70 మరియు 200/60 టైర్లు అమర్చబడి ఉంటాయి.

MOST READ:ఇకపై ట్రాఫిక్ ఫైన్ చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా !

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఆవిష్కరణ; వివరాలు

మోటారుసైకిల్ ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో రైడింగ్ మోడ్‌లు, పవర్ మోడ్‌లు, కార్నరింగ్ ఎబిఎస్ ఇవో, డ్యుకాటి ట్రాక్షన్ కంట్రోల్ (డిటిసి) ఇవిఓ 3, డ్యుకాటి వీలీ కంట్రోల్ (డిడబ్ల్యుసి) ఇవిఓ, డ్యుకాటి స్లైడ్ కంట్రోల్ (డిఎస్‌సి), ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ (ఇబిసి) ఇవిఓ, ఆటో టైర్ కాలిబ్రేషన్ ఉన్నాయి. వీటన్నింటినీ స్విచ్ గేర్ మరియు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ సాయంతో కంట్రోల్ చేయవచ్చు.

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఆవిష్కరణ; వివరాలు

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి కోసం కంపెనీ అనేక యాక్ససరీస్‌ను కూడా అందిస్తోంది. ఇందులో మెషిన్డ్ మిర్రర్ బ్లాక్-ఆఫ్ ప్లేట్లు, లైసెన్స్ ప్లేట్ మౌంట్ రిమూవల్ ప్లగ్, కార్బన్ ఫైబర్ క్లచ్ కవర్, జిపిఎస్ మాడ్యూల్‌తో డ్యుకాటి డేటా ఎనలైజర్ మొదలైనవి ఉన్నాయి.

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఆవిష్కరణ; వివరాలు

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

డ్యుకాటి అందిస్తున్న పానిగల్ వి4 ఎస్ ఇప్పటికే కంపెనీ నుండి లభిస్తున్న ఫుల్లీ లోడెడ్ సూపర్ స్పోర్ట్ మోటార్‌సైకిల్ కాగా, కంపెనీ ఇందులో కొత్తగా ఓ ట్రాక్ వెర్షన్ మోడల్‌ను ఎస్‌పి బ్యాడ్జింగ్‌తో తయారు చేసింది. కొత్త డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ప్రత్యేకించి రేస్ ట్రాక్‌ల ఉపయోగార్థం తయారు చేశారు.

Most Read Articles

English summary
Italian superbike maker Ducati has unveiled yet another motorcycle in the international market called the Panigale V4 SP. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X