డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950, 950ఎస్ ఆవిష్కరణ - ఫుల్ డీటేల్స్

ఇటాలియన్ సూపర్‌బైక్ కంపెనీ డ్యుకాటి రెండు కొత్త మోటార్‌సైకిళ్లను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950 మరియు సూపర్‌స్పోర్ట్ 950 ఎస్ అనే మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది. ఈ రెండు మోడళ్లను డ్యుకాటి ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ పానిగల్ వి4 నుండి ప్రేరణ పొందిన డిజైన్ చేశారు.

డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950, 950ఎస్ ఆవిష్కరణ - ఫుల్ డీటేల్స్

సూపర్‌స్పోర్ట్ 950 మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టి దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత కంపెనీ వీటి డిజైన్‌ను మార్చింది. ఈ కొత్త 2021 మోడల్‌లో డ్యుకాటి స్టైల్ సెంటర్ రూపొందించిన కొత్త ఫెయిరింగ్‌లు ఉన్నాయి, ఇవి బైక్‌కు మరింత స్పోర్ట్‌నెస్, డైనమిజం మరియు ఫ్లూయిడిటీలను అందిస్తాయి.

డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950, 950ఎస్ ఆవిష్కరణ - ఫుల్ డీటేల్స్

డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950ని సైడ్ నుంచి చూసినట్లయితే, ఇది పానిగల్ వి4 మోడల్ యొక్క డబుల్ ఎక్స్‌ట్రాక్టర్‌ను గుర్తుచేస్తుంది. దీని ముందు భాగంలోని ఫెయిరింగ్స్‌లో ఒక జత ఫిన్స్ ఉంటాయి, ఇవి హెడ్‌లైట్ పక్కన రెండు వైపుల ఉన్న ఓపెనింగ్‌ల ద్వారా గాలిని ప్రవేశించేలా చేస్తాయి.

MOST READ:సాధారణ ట్రక్కులకంటే మరింత శక్తివంతమైన ఇన్‌ఫ్రా ప్రైమ్ ఎలక్ట్రిక్ ట్రక్కులు.. చూసారా !

డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950, 950ఎస్ ఆవిష్కరణ - ఫుల్ డీటేల్స్

కొత్త 2021 సూపర్‌స్పోర్ట్ 950 మోడళ్లు పానిగల్ వి4 నుండి ప్రేరణ పొందిన డేటైమ్ రన్నింగ్ లైట్లతో కొత్త పూర్తి-ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ యొక్క మరొక విలక్షణమైన ఫీచర్ ఏంటంటే, దాని సైడ్-మౌంటెడ్ ట్విన్-బారెల్ ఎగ్జాస్ట్ (సైలెన్సర్). ఈ రెండు మోటార్‌సైకిళ్ళు కూడా సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటాయి.

డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950, 950ఎస్ ఆవిష్కరణ - ఫుల్ డీటేల్స్

సూపర్‌స్పోర్ట్ 950లో లిక్విడ్ కూల్డ్ 937 సిసి ఎల్-ట్విన్ సిలిండర్ టెస్టాస్ట్రెట్టా 11 ° ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ యూరో 5 (బిఎస్-6కి సమానమైన) ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 9000 ఆర్‌పిఎమ్ వద్ద 109 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 93 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్ అసిస్ట్ క్లచ్ మరియు బై-డైరెక్షనల్ (డిక్యూఎస్) డ్యుకాటి క్విక్ షిఫ్ట్ టెక్నాలజీతో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఇది కారా లేకా 'మినీ' బారా? - మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్

డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950, 950ఎస్ ఆవిష్కరణ - ఫుల్ డీటేల్స్

డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950లోని ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో బాష్ కార్నరింగ్ ఏబిఎస్, డ్యుకాటి ట్రాక్షన్ కంట్రోల్ (డిటిసి) మరియు డ్యుకాటి వీలీ కంట్రోల్ (డిడబ్ల్యూసి) ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు మోటార్‌సైకిళ్ళు బాష్ 6-యాక్సిస్ ఇనెర్షియల్ ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉంటాయి, ఇవి బైక్ యొక్క రోల్, యా, మరియు పిచ్ కోణాలను తక్షణమే గుర్తించగలవు.

డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950, 950ఎస్ ఆవిష్కరణ - ఫుల్ డీటేల్స్

సూపర్‌స్పోర్ట్ 950 మోడళ్లలోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇతర పానిగల్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే గ్రాఫిక్స్ ఇంటర్‌ఫేస్‌తో 4.3 ఫుల్-టిఎఫ్‌టి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్ సహాయంతో రైడర్స్ ఎలక్ట్రానిక్ అసిస్టెన్స్‌లో మార్పులు చేయవచ్చు మరియు హ్యాండిల్‌బార్ స్విచ్‌లలో కూడా మార్పులు చేయవచ్చు.

MOST READ:నిస్సాన్ మ్యాగ్నైట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ; కాంపాక్ట్ విభాగంలో బెస్ట్ ఎస్‌యూవీ కానుందా ?

డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950, 950ఎస్ ఆవిష్కరణ - ఫుల్ డీటేల్స్

సూపర్‌స్పోర్ట్ 950 సస్పెన్షన్ హార్డ్‌వేర్‌ను గమనిస్తే, ముందు భాగంలో మార్జోచి నుండి గ్రహించిన 43 మిమీ ఫుల్లీ అడ్జస్టబల్ యుఎస్‌డి ఫోర్కులు మరియు వెనుక భాగంలో సాచ్స్ నుండి గ్రహించిన సెమీ అడ్జస్టబల్ మోనో-షాక్ యూనిట్ ఉంటాయి. మరోవైపు, 950 ఎస్ వేరియంట్‌లో ఓహ్లిన్స్‌కు భిన్నమైన సెటప్ ఉంటుంది. దీని ముందు భాగంలో టిఎన్ ట్రీట్‌మెంట్‌తో కూడిన 48 మిమీ ఫుల్లీ అడ్జస్టబల్ యుఎస్‌డి ఫోర్కులు మరియు వెనుక భాగంలో ఫుల్లీ అడ్జస్టబల్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది.

డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950, 950ఎస్ ఆవిష్కరణ - ఫుల్ డీటేల్స్

కాగా, ఈ రెండు వేరియంట్లలో బ్రేకింగ్ హార్డ్‌వేర్ మాత్రం ఒకేలా ఉంటుంది. వీటి ముందు భాగంలో ఎమ్4-32 మోనోబ్లోక్ రేడియల్ కాలిపర్‌లతో ట్విన్ 320 మిమీ డిస్క్ రోటర్లను కలిగి ఉంటాయి. వెనుక భాగంలో, సూపర్ స్పోర్ట్ 950లో 245 మిమీ రేడియస్ కలిగిన డిస్క్, బ్రెంబో టూ-పిస్టన్ కాలిపర్ ఉన్నాయి. సూపర్‌స్పోర్ట్ 950 రెండు చివర్లలో పిరెల్లి డయాబ్లో రోసో III టైర్లతో త్రీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

MOST READ:నుజ్జు నుజ్జయిన 25 కోట్ల విలువైన పగని కార్.. ఎలాగో తెలుసా

డ్యుకాటి సూపర్‌స్పోర్ట్ 950, 950ఎస్ ఆవిష్కరణ - ఫుల్ డీటేల్స్

డ్యుకాటి సూపర్ స్పోర్ట్ 950, 950 ఎస్ మోడళ్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

డ్యుకాటి సూపర్ స్పోర్ట్ 950 మరియు 950 ఎస్ ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యంత శక్తివంతమైన మిడిల్-వెయిట్ మోటార్‌సైకిళ్ళలో ఒకటిగా నిలుస్తాయి. స్ట్రీట్ రైడింగ్‌కు తగినట్లుగా కంపెనీ ఈ మోటార్‌సైకిళ్లను రీడిజైన్ చేసింది.

Most Read Articles

English summary
Ducati SuperSport 950 and 950 S Middle-Weight Motorcycles Unveiled. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X