భారత్‌లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు

భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజు రోజుకి పెరుగుతోంది, ఈ క్రమంలో వాహన తయారీ సంస్థలు కూడా కొత్త అవాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టాయి. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు

భారత అధీకృత సంస్థ అయిన ఈవీ కంపెనీ రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. అవి అట్రియో మరియు అహావా ఎలక్ట్రిక్ స్కూటర్లు. అట్రియో స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 90 నుంచి 100 కి.మీ వరకు ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు

అహావా స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయిన తరువాత 60 నుండి 70 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దేశీయ మార్కెట్లో అట్రియో స్కూటర్ ధర రూ. 64,900 కాగా, అహావా స్కూటర్ ధర రూ. 55,900. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ అనేక ఆధునిక ఫీచర్లతో విడుదల చేసింది.

భారత్‌లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు

ఈ రెండు స్కూటర్లలోని బ్యాటరీపై కంపెనీ 1 సంవత్సరాల వారంటీ మరియు కస్టమర్ సర్వీస్ కోసం 5 సంవత్సరాల వారంటీని అందించింది. అట్రియో స్కూటర్‌లో జియో ట్యాగింగ్, ఫెన్సింగ్, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్, రిమోట్ లాకింగ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు

కంపెనీ అందించిన నివేదికల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక కిలోమీటరు ప్రయాణించడానికి కేవలం 15 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఈ స్కూటర్ పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు, ఇంధనం కోసం ఖర్చు చేసిన డబ్బును కూడా ఆదా చేస్తుంది.

భారత్‌లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు

ఈ స్కూటర్ల కొనుగోలు కోసం సంస్థ సులభమైన ఫైనాన్సింగ్ అప్సన్స్ కూడా ప్రవేశపెట్టింది. అట్రియో మోడల్ డ్యూయల్ టోన్ బ్లాక్, రెడ్ మరియు మోనోటోన్ గ్రే అనే రెండు రంగులలో అమ్ముడవుతోంది.

భారత్‌లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు

250 వాట్ల ఎలక్ట్రిక్ మోటారును అహావా స్కూటర్లో అమర్చారు. ఈ మోడల్‌లో కంపెనీ అన్ని రకాల స్మార్ట్ ఫీచర్లను అమలు చేసింది. అహావా స్కూటర్ బ్లూ డ్యూయల్ మరియు రెడ్ బ్లాక్ అనే రెండు డ్యూయల్ టోన్ కలర్స్ లో అమ్ముడవుతోంది.

భారత్‌లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు

ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 52 డీలర్లు ఉన్నారు మరియు వచ్చే ఏడాది ఈ సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలును సులభతరం చేయడానికి, ఈవీ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఆధారిత ఇఎంఐ ఫైనాన్స్ సంస్థ గెస్ట్ మనీ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

భారత్‌లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు

ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులు సరసమైన ఇఎంఐ అప్సన్స్ ద్వారా సంస్థ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫైనాన్సియల్ సర్వీస్ పొందే విధానం ఇప్పుడు కాగిత రహితమైనది, కావున ఇప్పుడు ఆన్‌లైన్‌లో లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా పూర్తి చేయవచ్చు. వినియోగదారులు కెవైసి యొక్క ఫార్మాలిటీని ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు.

భారత్‌లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు

మీరు 3 నెలలు 6 నెలలు లేదా 12 నెలల ఇఎంఐ మధ్య ఎంచుకోవచ్చు. ఈవీ ఇండియా తూర్పు భారతదేశంలో మొదటి ఆటో సంస్థ. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఒడిశాలో ఉంది. ఈవీ ఇండియాకు దేశవ్యాప్తంగా 63 డీలర్ల నెట్‌వర్క్ ఉంది. వచ్చే ఏడాది 200 వేర్వేరు ప్రదేశాల్లో ఎక్కువ మంది డీలర్లను ఓపెన్ చేయాలనుకుంటుంది.

భారత్‌లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు

ఈవీ ఇండియా దేశంలో సరికొత్త టెక్నాలజీతో ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తుంది. ఈ స్కూటర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ప్లగ్ అంగో బ్రాండ్ కింద ఛార్జింగ్ స్టేషన్లను కూడా నిర్మిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 16, 2020, 12:55 [IST]
English summary
EeVe Atreo & Ahava Electric Scooters Launched In India At Rs 55,000. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+