ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేయనున్న ఎవర్వ్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఇండియన్ మార్కెట్లో ఇప్పటిదాకా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేశాయి. ఇప్పుడు పూణెకి చెందిన ఎవర్వ్ మోటార్స్ సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ని రాబోయే ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేయనున్న ఎవర్వ్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఎవర్వ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రాబోతున్న ఫ్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ట్రాన్స్‌ఫార్మర్స్ డిజైన్ ని కలిగిఉండటమే కాకుండా అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేయనున్న ఎవర్వ్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చేయడమే ఎవర్వ్ మోటార్స్ యొక్క లక్ష్యం. ఈ స్కూటర్ పనితీరుకి సంబంధించినంతవరకు సరైన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఎలెక్రిక్ స్కూటర్ లోని బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడానికి కేవలం ఐదు గంటల సమయం మాత్రమే పడుతుంది. దీనికి 5 Amp ఛార్జింగ్ సాకేట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు.

ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేయనున్న ఎవర్వ్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఎవర్వ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకి 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో రైడర్ సమాచారం మాత్రమే కాకుండా బ్యాటరీ యొక్క స్టేటస్, మ్యాప్ మరియు లొకేషన్, ఎర్రర్ కోడ్స్ వంటి వాటిని తెలుసుకోగల టెక్నాలజీ ఇందులో ఉంటుంది. రాబోయే ఎవర్వ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ రెండు కాన్సెప్ట్ టీజర్ చిత్రాలను కంపెనీ మనతో పంచుకుంది. ఎవర్వ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పెద్ద హైలైట్ ఏమిటంటే ముందు భాగంలో వున్న హెడ్లైట్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్కూటర్లో రౌండ్ హెడ్‌ల్యాంప్ పైన ఉంచిన బుల్-హార్న్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌ల మాదిరిగా ఉంటుంది.

ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేయనున్న ఎవర్వ్ ఎలక్ట్రిక్ స్కూటర్

ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాని పరిశోధన మరియు అభివృద్ధి దశలో ఉంది. కానీ ఆటో ఎక్స్‌పోలో ఈ వెహికల్ యొక్క ఒక నమూనాను ఆవిష్కరించనుంది. ఈ సంవత్సరం అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నది. రాబోయే ఎవర్వ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ని కలిగి ఉంది. ఇంక డ్రైవింగ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్టీవో రిజిస్ట్రేషన్ మాత్రమే అవసరం.

ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేయనున్న ఎవర్వ్ ఎలక్ట్రిక్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

ఆటో ఎక్స్‌పోలో మనం చూడాలనుకుంటున్న చాల ఎలక్ట్రిక్ వాహనాలలో ఎవర్వ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఒకటి. ఈ కంపెనీ వారు విడుదల చేసిన టీసర్ చిత్రాలు డిజైన్ పరంగా చూసినప్పుడు ఇది ఎలెక్ట్రి స్కూటర్ అనే భావన మనకు కలుగుతుంది. రాబోయే ఆటో ఎక్స్‌పోలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని చూడటానికి వేచి చూద్దాం.

Most Read Articles

English summary
Everve Electric Scooter To Debut At Auto Expo: Will Offer Futuristic Design And Top Performance. Read in Telugu.
Story first published: Wednesday, January 29, 2020, 12:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X