హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైకులపై భారీ డిస్కౌంట్

అమెరికన్ మోటారుసైకిల్ తయారీదారు అయిన హార్లే డేవిడ్సన్ తన బ్రాండ్ స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ ని ఇప్పుడు భారతదేశంలో భారీ డిస్కౌంట్ తో అందిస్తున్నారు. డీలర్‌షిప్‌లు ఈ ఎడిషన్ స్ట్రీట్ 750 బైక్ పై దాదాపు 72,000 రూపాయల తగ్గింపుతో అందిస్తున్నాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ మీ కోసం..

హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైకులపై భారీ డిస్కౌంట్

హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 750 లిమిటెడ్ ఎడిషన్ బిఎస్ 6 కంప్లైంట్ మోటారుసైకిల్ యొక్క ధర రూ. 5.47 లక్షలు. కానీ ముంబైలోని సెవెన్ ఐలాండ్స్ లో హార్లే-డేవిడ్సన్ బిఎస్ 6 క్రూయిజర్‌పై భారీ తగ్గింపుతో అందిస్తున్నారు. ఈ మోటార్ సైకిల్ ధర ఇప్పుడు రూ. 4.75 (ఎక్స్-షోరూమ్, ముంబై) లక్షలకు రిటైల్ అవుతుంది.

హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైకులపై భారీ డిస్కౌంట్

హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైక్ 2019 ఆగస్టులో ప్రారంభించబడింది. పరిమిత ఎడిషన్ క్రూయిజర్ ప్రారంభించినప్పుడు బిఎస్ 4 స్పెక్ స్ట్రీట్ 750 కన్నా 13,000 రూపాయలు ఖరీదైనది. హార్లే డేవిడ్సన్ 10 సంవత్సరాల వేడుకలు జరుపున్నప్పుడు భారతదేశంలో ఈ ప్రత్యేక ఎడిషన్ ప్రారంభించబడింది.

MOST READ:కరోనా రోగుల కోసం డ్రైవ్-త్రూ టెస్టింగ్ సౌకర్యం, ఎక్కడో తెలుసా..?

హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైకులపై భారీ డిస్కౌంట్

హార్లే-డేవిడ్సన్ ఎడిషన్ స్ట్రీట్ 750 ఉత్పత్తి కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ మోడల్ ప్రత్యేకమైన రంగును కలిగి ఉంటుంది. ఇది దేశంలో 10 సంవత్సరాలు ఉనికిని సూచిస్తున్నాయి. ఈ మోటార్ సైకిల్లో పెయింట్ స్కీమ్ తప్ప ఇతర మార్పులు జరగలేదు. ఈ మోటారుసైకిల్ స్టాండర్డ్ స్ట్రీట్ 750 మోడల్ మాదిరిగానే ఉంటుంది.

హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైకులపై భారీ డిస్కౌంట్

బిఎస్ 6 హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైక్ 749 సిసి, వి-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 60 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైకులపై భారీ డిస్కౌంట్

క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్ యూనిట్ ఉంటాయి. మోటారుసైకిల్ యొక్క బ్రేకింగ్ వ్యవస్థను గమనించినట్లయితే రెండు చివర్లలోని డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి. భారతీయ మార్కెట్లో కవాసాకి వల్కాన్ ఎస్ మోటార్ సైకిల్ కి హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 ప్రత్యర్థిగా ఉంటుంది.

హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైకులపై భారీ డిస్కౌంట్

హార్లే-డేవిడ్సన్ ఎంట్రీ లెవల్ మోటారుసైకిల్ స్ట్రీట్ 750 మరియు స్ట్రీట్ రాడ్ మోటార్‌సైకిల్ దేశవ్యాప్తంగా సాయుధ దళాల సిబ్బంది కోసం క్యాంటీన్ స్టోర్స్ (సిఎస్‌డి) ద్వారా ప్రత్యేక ధరలకు రిటైల్ చేయబడతాయి.

MOST READ:కవాసకి వినియోగదారులకు గుడ్ న్యూస్, ఏమిటో తెలుసా..?

Most Read Articles

English summary
Harley Davidson Street 750 Limited Edition Offer: Rs 72,000 Discount On BS6 Model. Read in Telugu.
Story first published: Friday, April 17, 2020, 16:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X