Just In
Don't Miss
- Sports
ICC T20 Rankings: రాహుల్ ర్యాంక్ పదిలం.. దూసుకెళ్లిన కాన్వే
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై దీపావళి ఆఫర్లు - వివరాలు
ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుత పండుగ సీజన్‌లో తమ ఎలక్ట్రిక్ స్కూటర్లపై నగదు తగ్గింపులు మరియు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. లిమిటెడ్ టైమ్ ఆఫర్‌గా కంపెనీ తమ స్కూటర్లపై 5000 రూపాయల నగదు తగ్గింపును అందిస్తోంది. దీనితో పాటుగా కంపెనీ రూ.5000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్‌ను ఆఫర్ చేస్తోంది.

వీటితో పాటు, ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో వడ్డీ లేని రుణ సదుపాయాన్ని కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. హీరో మోటోకార్ప్ అందిస్తున్న లిథియం అయాన్ మరియు లీడ్ యాసిడ్ స్కూటర్లపై ఈ ఆఫర్లను పొందవచ్చు. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్లు నవంబర్ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

హీరో ఎలక్ట్రిక్ కంపెనీకి దేశవ్యాప్తంగా 500కి పైగా డీలర్‌షిప్‌లు ఉన్నాయి. హీరో ఎలక్ట్రిక్ యొక్క లీడ్ యాసిడ్ మోడల్‌పై 3000 రూపాయల నగదు తగ్గింపు మరియు ఎంపిక చేసిన మోడళ్లపై 5,000 రూపాయల వరకూ నగదు తగ్గింపు కంపెనీ అందిస్తోంది.
MOST READ:భారత మార్కెట్లో టాటా హారియర్ క్యామో ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

అంతే కాకుండా, హీరో ఎలక్ట్రిక్ యొక్క తమ రిఫెరల్ పథకాన్ని సద్వినియోగం చేసుకునే వినియోగదారులకు రూ.1000 వరకు అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. ఇవన్నీ కలుపుకుంటే, ఎలక్ట్రిక్ స్కూటర్లపై గరిష్టంగా రూ .6000 వరకూ తగ్గింపును పొందవచ్చు. అయితే, కంపెనీ ఇటీవలే విడుదల చేసిన ఆప్టిమా హెచ్ఎక్స్ సిటీ స్పీడ్ మరియు నైక్స్ హెచ్ఎక్స్ సిటీ స్పీడ్ మోడళ్లపై మాత్రం ఎలాంటి తగ్గింపులను ఇవ్వటం లేదు.

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా హెచ్ఎక్స్ సిటీ స్పీడ్ మరియు నైక్స్ హెచ్ఎక్స్ సిటీ స్పీడ్ లను వరుసగా 57,560 రూపాయలు మరియు 63,990 రూపాయల ధరతో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మోడళ్లపై ఎటువంటి తగ్గింపులు ఇవ్వడం లేదు.
MOST READ:మళ్ళీ పుంజుకున్న జావా పెరాక్ బైక్ అమ్మకాలు.. కారణం ఏంటో తెలుసా ?

ఈ పండుగ సీజన్‌లో తమ కస్టమర్ల ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ఈ కొత్త ఆఫర్లను ప్రకటించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ల ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగి, కాలుష్యం కొంతైనా తగ్గుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

హీరో ఎలక్ట్రిక్ తమ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లపై మూడు రోజుల రిటర్న్ పాలసీని, కొత్త కస్టమర్ల కాన్ఫరెన్స్‌పై రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త ప్రణాళిక ద్వారా ప్రస్తుత పండుగ సీజన్లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
MOST READ:కొత్త బైక్‌ను వెంబడించిన ట్రక్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందో చూడండి

లాక్‌డౌన్ అనంతరం, హీరో ఎలక్ట్రిక్ దేశంలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకుంది. ఇటీవలి కాలంలో కంపెనీ మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను (ఆప్టిమా-హెచ్ఎక్స్, ఎన్వైఎక్స్-హెచ్ఎక్స్ మరియు ఫోటాన్-హెచ్ఎక్స్) కూడా మార్కెట్లో విడుదల చేసింది.