30 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్; హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త బ్యాటరీలు

ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ హీరో ఎలక్ట్రిక్ మరియు బ్యాటరీ తయారీ కంపెనీ ఈవీ మోటార్స్ (ఈవీఎమ్)లు భాగస్వామ్యంగా ఏర్పడి భారత మార్కెట్లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఇ-బైక్‌లను విడుదల చేయనున్నాయి. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించేలా ఈవీఎస్ తమ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ప్యాక్‌లను అందించనుంది. ఈ బ్యాటరీలు కేవలం 30 నిమిషాల్లోపు 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవుతాయని ఈవీఎమ్ పేర్కొంది.

30 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్; హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త బ్యాటరీలు

బ్యాటరీలను వేగంగా ఛార్జింగ్ చేయడంలో సహకరించేందుకు ఈ కంపెనీ "ప్లగ్‌ అండ్ గో" అనే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా అందిస్తోంది. ఈ క్విక్ ఛార్జింగ్ ఫీచర్‌తో రోజువారీగా 130 కిమీ నుండి 140 కిమీ వరకు సులువుగా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

30 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్; హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త బ్యాటరీలు

ఇది మెయింటినెన్స్ మరియు రన్నింగ్ కాస్ట్ లను తగ్గించి, తద్వారా వ్యాపారాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వేగవంతమైన ఛార్జింగ్ స్టేషన్లను హీరో డీలర్‌షిప్‌లతో సహా పబ్లిక్ ఛార్జింగ్ కోసం కూడా అందుబాటులో ఉండేలా వ్యూహాత్మక ప్రదేశాలలో ఏర్పాటు చేయనున్నట్లు ఈవీఎమ్ తెలిపింది.

MOST READ:162 అడుగుల జీప్ ఎస్‌యూవీలతో తయారైన గణేష్ మహారాజ్ [వీడియో]

30 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్; హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త బ్యాటరీలు

లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఆపరేషన్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ ఇరు కంపెనీలు ప్రధానంగా ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. రానున్న 12 నెలల్లో సుమారు 10,000 ఇ-బైక్‌ల పైలట్ ప్రాజెక్ట్‌లను దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రధాన నగరాల్లో ప్రారంభించనున్నట్లు ఇరు కంపెనీలు తెలిపాయి.

30 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్; హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త బ్యాటరీలు

ఈ ప్రత్యేకమైన సేవలు లాస్ట్ మైల్ట్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి మరియు ఇ-కామర్స్, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, ఫ్లీట్ ఆపరేటర్స్ మరియు కొరియర్ డెలివరీ వ్యాపారాలు వంటి అనేక రంగాలలోని డెలివరీ ఆపరేటర్ల అవసరాలను తీర్చగలవు.

MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

30 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్; హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త బ్యాటరీలు

ఈ విషయంపై హీరో ఎలక్ట్రిక్ సిఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ, '30 నిమిషాల ఛార్జింగ్ యొక్క ఈ ప్రత్యేకమైన పరిష్కారం మరియు సులభమైన యాజమాన్య నమూనాలతో ఇది భారత ఈవి పరిశ్రమలో గేమ్-ఛేంజర్ కావచ్చు, ఎందుకంటే ఇది మూడు ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తుంది- అవి రేంజ్ ఆందోళన, బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చులు మరియు అధిక సముపార్జన ధర. "

30 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్; హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త బ్యాటరీలు

"ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్‌గా, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ లేదా తేలికపాటి పోర్టబుల్ బ్యాటరీలతో హోమ్ ఛార్జింగ్ వంటి పలు రకాల ఈవి అడాప్షన్ ఆప్షన్లను మేము మా కస్టమర్లకు అందిస్తూనే ఉంటాము. మా అప్‌గ్రేడ్ చేసిన బైక్‌లు ఇప్పుడు ఈవీఎమ్ నుండి వచ్చిన హైటెక్ బ్యాటరీలతో సిద్ధంగా ఉన్నాయి, ఇవి డబ్బుకు తగిన ఉత్తమ విలువను అందిస్తాయని" ఆయన అన్నారు.

MOST READ:త్వరలో భారత్‌కి రానున్న రూ. 6.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సెడాన్.. మీరు చూసారా

30 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్; హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త బ్యాటరీలు

ఈవీ మోటార్స్ ఎక్కువ సమయం పనిచేసేలా, లాస్ట్ మైల్ డెలివరీ ఆపరేషన్ల కోసం స్మార్ట్ మరియు కనెక్టెడ్ పరిష్కారాలను అందిస్తుంది. ఇందులో వెహికల్ డయాగ్నోస్టిక్స్, రైడ్ గణాంకాలు, స్మార్ట్ బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ (బ్యాటరీ స్థితి, పనితీరు మరియు సామర్థ్యం యొక్క నిజ-సమయ ట్రాకింగ్) వంటి ఏఐ-ఆధారిత ఫీచర్లను కూడా అందిస్తుంది.

30 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్; హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త బ్యాటరీలు

అంతేకాకుండా, యాంటీ-తెఫ్ట్, జియో-ఫెన్సింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ షెడ్యూల్ అలర్ట్ మరియు అలారం వంటి ఇతర అధునాతన ఫీచర్లను కూడా ఈవీఎమ్ ఆఫర్ చేస్తోంది.

హీరో ఎలక్ట్రిక్‌తో ఒప్పందం గురించి ఈవీ మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వినిత్ బన్సాల్ మాట్లాడుతూ, "హీరో ఎలక్ట్రిక్‌తో మా భాగస్వామ్యం గురించి మేము సంతోషిస్తున్నాము, ఎందుకంటే ఈ-మొబిలిటీని ప్రోత్సహించడానికి మరియు సమగ్రమైన ఈవీ మౌలిక సదుపాయాలను అందించడానికి మా నిబద్ధత వైపు ఇది మరో అడుగు" అని ఆయన అన్నారు.

MOST READ:ఇప్పుడే చూడండి.. ఎంజి గ్లోస్టర్ యొక్క కొత్త టీజర్ వీడియో

30 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్; హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త బ్యాటరీలు

హీరో-ఈవీఎమ్ ఒప్పందంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత్‌లో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఈవీఎమ్ ఆఫర్ చేయనున్న క్విక్ ర్యాపిడ్ చార్జింగ్ సదుపాయంతో బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లోనే 100 శాతం చార్జ్ అవుతుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ప్యాక్ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను సులువుగా స్వీకరించడానికి దోహదపడే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Hero Electric and EV Motors (EVM) India partner to launch rapid charging e-bike in the Indian market. EVM will provide its fast-charging battery pack to power the Hero Electric scooters, which is claimed to charge from 0 to 100 per cent in less than 30 minutes. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X