హీరో ఎలక్ట్రిక్ నైక్స్-హెచ్ఎక్స్ కమర్షియల్ ఈ-స్కూటర్ విడుదల; ధర

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్, భారత మార్కెట్లో మరో సరికొత్త ఉత్పత్తిని విడుదల చేసింది. ఈసారి కమ్యూటర్ సెగ్మెంట్లో కాకుండా కమర్షియల్ సెగ్మెంట్లో కంపెనీ తమ కొత్త నైక్స్-హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

హీరో ఎలక్ట్రిక్ నైక్స్-హెచ్ఎక్స్ కమర్షియల్ ఈ-స్కూటర్ విడుదల; ధర

కొత్త హీరో నైక్స్-హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ యొక్క కొత్త మరియు మెరుగైన 'హెచ్ఎక్స్' సిరీస్‌లో భాగంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాస్ట్ మైల్ డెలివరీలు మరియు ఇతర వాణిజ్య ఉపయోగాల కోసం బి 2 బి కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టినట్లు హీరో ఎలక్ట్రిక్ వివరించింది.

హీరో ఎలక్ట్రిక్ నైక్స్-హెచ్ఎక్స్ కమర్షియల్ ఈ-స్కూటర్ విడుదల; ధర

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 0.6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఇది 1.53 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ స్కూటర్ గంటకు గరిష్టంగా 42 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం కొత్త హీరో నైక్స్-హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జీపై 82 కిలోమీటర్ల నుండి 210 కిలోమీటర్ల మధ్యలో రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని తెలిపింది.

హీరో ఎలక్ట్రిక్ నైక్స్-హెచ్ఎక్స్ కమర్షియల్ ఈ-స్కూటర్ విడుదల; ధర

హీరో నైక్స్-హెచ్ఎక్స్ ఇ-స్కూటర్‌లో 210 కిలోమీటర్ల ఎక్స్‌టెండెడ్ రేంజ్‌ను ఇందులో అమర్చిన మాడ్యులర్ బ్యాటరీ సిస్టమ్‌తో పాటుగా, దాని స్వాప్ చేయగల సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది.

హీరో నైక్స్-హెచ్ఎక్స్ ఇ-స్కూటర్‌ను అన్ని రకాల వ్యాపార అవసరాలకు అనుగుణంగా మొత్తం 10 రకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చని హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వివిధ పేలోడ్ సామర్థ్యాలతో కూడా లభిస్తుంది. ఇందులో 4-స్థాయిల స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సిస్టమ్ కూడా ఉంటుంది.

హీరో ఎలక్ట్రిక్ నైక్స్-హెచ్ఎక్స్ కమర్షియల్ ఈ-స్కూటర్ విడుదల; ధర

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓ హై-టార్క్ మోడల్ అని కంపెనీ చెబుతోంది. ఫలితంగా, ఇది మంచి సమతుల్యమైన మరియు సమర్థవంతమైన పవర్‌ట్రైన్‌లను అందిస్తుందని హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది. హీరో నైక్స్-హెచ్ఎక్స్‌లో బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్‌తో పాటుగా కాంబి-బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా ఉంటుంది. ఈ టెక్నాలజీ వలన భారీ భారాలతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా సున్నితమైన ప్రయాణ అనుభూతి కలుగుతుంది.

హీరో ఎలక్ట్రిక్ నైక్స్-హెచ్ఎక్స్ కమర్షియల్ ఈ-స్కూటర్ విడుదల; ధర

భారత మార్కెట్లో కొత్త హీరో ఎలక్ట్రిక్ నైక్స్-హెచ్ఎక్స్ ఇ-స్కూటర్ ప్రారంభ ధర రూ.64,640, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.

ఈ విషంపై హీరో ఎలక్ట్రిక్ సిఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ, "ప్రతి వ్యాపారానికి ఒక నిర్దిష్ట మొబిలిటీ సొల్యూషన్ అవసరం మరియు ఇవి "ఒక పరిమాణం అందరికీ సరిపోతుంది" అనేలా ఉండకూడదు. కొత్త నైక్స్-హెచ్ఎక్స్ సిరీస్ అనువైనది, మారుతున్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడినది. ఇది లో రన్నింగ్ కాస్ట్, అధిక పేలోడ్ కెపాసిటీ, ఇంటర్‌సిటీ రేంజ్, రిమోట్ బైక్ డిసేబ్లర్స్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీఛర్లను కలిగి ఉంది."

హీరో ఎలక్ట్రిక్ నైక్స్-హెచ్ఎక్స్ కమర్షియల్ ఈ-స్కూటర్ విడుదల; ధర

"భారతదేశం అంతటా ఉన్న మా 500కి పైగా పటిష్టమైన నెట్‌వర్క్ ద్వారా 90 శాతానికి పైగా అప్‌టైమ్, డోర్‌స్టెప్ సర్వీసెస్, క్యాప్టివ్ ఛార్జింగ్ / మౌలిక సదుపాయాలను భరోసా ఇచ్చే బి 2 బి కస్టమర్‌కు పూర్తి పరిష్కారాలను అందించడానికి మేము ప్రయత్నిస్తాము. బి 2 బి కస్టమర్ ఎలక్ట్రిక్‌ను స్వీకరించే ప్రత్యక్ష ప్రయోజనాన్ని కూడా సులభంగా గ్రహించగలడు. ఇ-మొబిలిటీ పొదుపు పరంగానే కాకుండా పరిశుభ్రమైన వాతావరణానికి దోహదపడేందుకు కూడా సహకరిస్తుందని" ఆయన అన్నారు.

కొత్త హీరో ఎలక్ట్రిక్ నైక్స్-హెచ్ఎక్స్ ఇ-స్కూటర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త హీరో ఎలక్ట్రిక్ నైక్స్-హెచ్ఎక్స్ ఇ-స్కూటర్ బ్రాండ్ యొక్క కొత్త మరియు మెరుగైన ఉత్పత్తి శ్రేణిలో భాగంగా విడుదలైంది. ఇది కమర్షియల్ ఉపయోగం కోసం అనువుగా ఉంటుంది. కంపెనీ పేర్కొన్నట్లుగా దీని రేంజ్ 210 కిలోమీటర్లు ఉంటే, సిటీ ప్రయాణాలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 22, 2020, 15:37 [IST]
English summary
Hero Electric has introduced the new Nyx-HX electric scooter in the Indian market. The new Hero Electric Nyx-HX e-scooter is offered with a starting price of Rs 64,640, ex-showroom (Delhi). Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+