Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంటి వద్దకే వెహికల్ వాషింగ్ సేవలు; హీరో ఎలక్ట్రిక్ కొత్త సర్వీస్ ప్రారంభం
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ హీరో ఎలక్ట్రిక్ నాగ్‌పూర్‌కి చెందిన 'గోవాష్' కంపెనీతో చేతులు కలిపింది. ఈ ఇరు కంపెనీల భాగస్వామ్యంతో హీరో ఎలక్ట్రిక్ కస్టమర్లు ఇకపై ఇంటి వద్దనే వెహికల్ వాషింగ్ సేవలను పొందవచ్చు. అతి తక్కువ ధరకే ఈ సేవలను అందిస్తామని గోవాష్ కంపెనీ పేర్కొంది.

స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ మరియు టెక్నిక్స్‌ను ఉపయోగించి గోవాష్ కంపెనీ సరసమైన ధరలకే అద్భుతమైన సేవలను అందించనుంది. గోవాష్ కంపెనీకి చెందిన వాషింగ్ నిపుణులు హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్500 ఈఆర్ స్కూటర్లను నడుపుతారు. ఈ స్కూటర్లలో అవసరమైన అన్ని వస్తువులను తీసుకువెళ్ళడానికి ప్రత్యేకమైన కంపార్ట్మెంట్ బాక్స్ అమర్చబడి ఉంటుంది.

గోవాష్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు ఈ సేవలను బుక్ చేసుకోవచ్చు. వాహన వాషింగ్ సేవలతో పాటు, గోవాష్ ఆల్ ఇన్ వన్ ఆఫర్‌ను కూడా అందిస్తుంది, ఇందులో భాగంగా వినియోగదారులు సిరామిక్ మరియు పియు కోటింగ్ సేవలను కూడా నామమాత్రపు ధరకు పొందవచ్చు.
MOST READ:మరోసారి అమెరికన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న మహీంద్రా రోక్సర్

ఈ కంపెనీ సెప్టెంబర్ 2020లో 12 వాషింగ్ వాహనాలతో ప్రారంభించి 1500 మందికి పైగా సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తరువాతి దశలో, కంపెనీ 50 వాషింగ్ వాహనాలను సమీకరించి, ఈ సంవత్సరం నవంబర్ నాటికి 6000 మంది వినియోగదారులకు సేవలు అందించాలని ప్లాన్ చేస్తోంది.

హీరో మోటోకార్ప్‌కు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ ఈవీ మోటార్స్ (ఈవీఎమ్)లతో భాగస్వామ్యంగా ఏర్పడి భారత మార్కెట్లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఇ-బైక్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
MOST READ:మీకు తెలుసా.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగం మార్గం, ఇదే

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించేలా ఈవీఎస్ తమ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ప్యాక్‌లను అందించనుంది. ఈ బ్యాటరీలు కేవలం 30 నిమిషాల్లోపు 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవుతాయని ఈవీఎమ్ పేర్కొంది.

బ్యాటరీలను వేగంగా ఛార్జింగ్ చేయడంలో సహకరించేందుకు ఈ కంపెనీ "ప్లగ్ అండ్ గో" అనే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా అందిస్తోంది. ఈ క్విక్ ఛార్జింగ్ ఫీచర్‌తో రోజువారీగా 130 కిమీ నుండి 140 కిమీ వరకు సులువుగా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:గురువే విద్యార్థులు దగ్గరకు వెళ్లి పాటలు చెప్పడం ఎక్కడైనా చూసారా.. అయితే ఇది చూడండి

హీరో మోటోకార్ప్ - గోవాష్ ఒప్పందంపై డ్రైవ్‌స్పార్క్ అభప్రాయం.
ఈ భాగస్వామ్యం ద్వారా, హీరో ఎలక్ట్రిక్ కస్టమర్లు గోవాష్ నుండి నామమాత్రపు రేటుకే వెహికల్ వాషింగ్ సేవలను పొందవచ్చు. అది కూడా వారి ఇంటి వద్దకే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. కరోనా మహమ్మారి సమయంలో వైరప్ వ్యాప్తి నివారణ కోసం ఇదొక అద్భుతమైన చర్యగా చెప్పుకోవచ్చు.