హీరో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈఎమ్ఐ లీజింగ్ ఆప్షన్ - వివరాలు

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ తమ వాహనాలను లీజ్ ఆప్షన్ ద్వారా కస్టమర్లకు అందించేందుకు గానూ ఓటిఓ క్యాపిటల్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, హీరో ఎలక్ట్రిక్ కస్టమర్లు ఇప్పుడు తమ అభిమాన హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను పొందవచ్చని కంపెనీ తెలిపింది.

హీరో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈఎమ్ఐ లీజింగ్ ఆప్షన్ - వివరాలు

అంతేకాకుండా, ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఓటిఓ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ల ద్వారా చెల్లింపులు చేసే కస్టమర్లు తమ ఈ-స్కూటర్‌పై 30 శాతం వరకు ఆదా చేసుకోవడానికి వీలవుతుందని కంపెనీ పేర్కొంది.

హీరో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈఎమ్ఐ లీజింగ్ ఆప్షన్ - వివరాలు

బెంగళూరు మరియు పూణేలోని 16 హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ ఫైనాన్సింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. రాబోయే కొద్ది నెలల్లో ఈ ఆఫర్‌ను భారతదేశంలోని మరిన్ని ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.

MOST READ:ల్యాండ్ రోవర్ ని కాపాడిన మహీంద్రా థార్, ఎలాగో వీడియో చూడండి

హీరో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈఎమ్ఐ లీజింగ్ ఆప్షన్ - వివరాలు

ఇరు కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఓటిఓ తమ ఫ్లెక్సిబల్ ఓనర్‌షిప్ మోడల్ ద్వారా కస్టమర్లకు హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కనీసం 12 నెలల వరకూ లీజుకు ఇవ్వడానికి అనుమతిస్తుంది, ఆ తర్వాత కస్టమర్ కావాలనుకుంటే వేరే కంపెనీ లేదా మోడల్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ లీజింగ్ వ్యవధి 12 నెలల నుండి 36 నెలల వరకు ఉంటుంది.

హీరో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈఎమ్ఐ లీజింగ్ ఆప్షన్ - వివరాలు

ఓటిఓ ఫ్లెక్సిబల్ మోడల్ ద్వారా కస్టమర్‌కు ఎంత డబ్బు ఆదా అవుతుందో ఈ ఉదాహరణలో తెలుసుకుందాం. ఉదాహరణకు, ఒక కస్టమర్ హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ ఎల్‌ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒటిఓ ద్వారా లీజుకు తీసుకోవాలనుకుంటే నెలకు రూ.2,478 ఖర్చు అవుతుంది. అదే సాంప్రదాయ బ్యాంక్ ఈఎమ్ఐ ప్రకారం అయితే, కనీసం 2 సంవత్సరాలకు నెలకు రూ.3,520 చొప్పున ఖర్చు అవుతుంది.

MOST READ:కారులో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లండి

హీరో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈఎమ్ఐ లీజింగ్ ఆప్షన్ - వివరాలు

వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని ఓటిఓ ఓ ప్రత్యేక లక్కీ డ్రా ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఓటిఓ ద్వారా హీరో ఎలక్ట్రిక్ వాహనాలను లీజుకు తీసుకునే కస్టమర్లు ఈ పండుగ సీజన్ లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశాన్ని పొందవచ్చు. ఈ లక్కీ డ్రాలో గెలిచిన వారికి తమ నెలవారి చెల్లింపులపై 3 నెలల వాయిదా మినహాయింపును గెలుచుకోవచ్చు.

హీరో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈఎమ్ఐ లీజింగ్ ఆప్షన్ - వివరాలు

ఈ ఒప్పందం గురించి హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ, "ఓటిఓ క్యాపిటల్‌తో భాగస్వామ్యం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వారి ఫ్లెక్సిబల్ లీజింగ్ మోడల్ ద్వారా వినియోగదారులు ఐసిఇ వాహనాల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు సౌకర్యవంతంగా మారడానికి వీలు కల్పిస్తుంది, అదే సమయంలో మొత్తం యాజమాన్య అనుభవాన్ని కొనుగోలుదారులకు మరింత సులభతరం చేస్తుంద"ని అన్నారు.

MOST READ:పవిత్రమైన కాబాపై విమానాలు ప్రయాణించవు, ఎందుకో తెలుసా ?

హీరో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈఎమ్ఐ లీజింగ్ ఆప్షన్ - వివరాలు

ఓటిఓ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ చాజెద్ మాట్లాడుతూ.. "భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను స్వీకరించడానికి మద్దతు ఇవ్వడానికి హీరో ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము. రాబోయే నెలల్లో కనీసం 1000 బైక్‌లను లీజుకు తీసుకుంటామని మేము ఆశిస్తున్నాము. వ్యక్తిగతీకరించిన సేవలను వెతుకుతున్న కస్టమర్లతో అన్ని విభాగాలలోని ద్విచక్ర వాహనాల కోసం సరసమైన ప్రత్యామ్నాయ ఫైనాన్సింగ్ ఎంపికలను అందించడమే మా లక్ష్యమ"ని ఆయన అన్నారు.

హీరో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈఎమ్ఐ లీజింగ్ ఆప్షన్ - వివరాలు

హీరో ఎలక్ట్రిక్-ఓటిఓ క్యాపిటల్ డీల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హీరో ఎలక్ట్రిక్ మరియు ఒటిఓ క్యాపిటల్ మధ్య కుదిరిన ఈ భాగస్వామ్యం ద్వారా, వినియోగదారులు ఇప్పుడు తమ అభిమాన హీరో ఈ-స్కూటర్‌ను నిజంగా సరసమైన ధరలకే లీజుకు తీసుకునే అవకాశం కలుగుతుంది. ఓటిఓ క్యాపిటల్ క్యాపిటల్ ప్రకటించిన లక్కీ డ్రాలో కస్టమర్ గెలిస్తే, వారు దీనిపై మరింత తగ్గింపులను పొందే అవకాశం ఉంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్ ; కార్ ఓనర్ టీ అమ్ముకునేలాగా చేసింది, ఎలాగో చూడండి

Most Read Articles

English summary
Hero Electric has announced its partnership with OTO Capital. Through this partnership, customers will now be able to afford flexible financing options on their favourite Hero electric two-wheelers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X