2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

ప్రపంచదేశాలల్ని ఇప్పుడు ప్రగతి మార్గం వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో వాహనాలు రోజు రోజుకి అప్డేట్ అవుతూనే ఉన్నాయి. మొదట్లో డీజిల్ వెహికల్స్, తరువాత పెట్రోల్ వెహికల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు వాహనాదారులందరూ ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపిస్తున్నారు. ఈ కారణాంగా అన్ని సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు హీరో కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

హీరో కంపెనీ 2020 ఆటో ఎక్స్‌పోలో తమ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని ఆవిష్కరించనుంది. ఆటో ఎక్స్‌పోలో ప్రారంభం కానున్న హీరో స్కూటర్ యొక్క టీసర్ మనం ఇక్కడ చూడవచ్చు.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఇందులో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు మరియు ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉంటాయి. ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు అందుబాటులో లేదు.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది స్వాప్ చేయగల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందా, ట్రిపుల్ డిజిట్ రేంజ్ మరియు వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలను క్లెయిమ్ చేస్తుందా..? అనే సందేహాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇది వినియోగదారుని అనుకూలమైన లక్షణాలను కలిగి ఉంటుందని మాత్రం ఆశించవచ్చు.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

హీరో సంస్థ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఇండియాలోనే అతి పెద్ద సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పటికి భారతదేశం మొత్తం 325 నగరాల్లో దాదాపు 601 డీలర్షిప్ లను ఈ కంపెనీ కలిగి ఉంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

హీరో కంపెనీకి మార్కెట్లో మంచి పేరు ఉంది. కాబట్టి ఈ సంస్థ నుండి ఇప్పుడు 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించే ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మంచి ఆదరణను పొందుతుందని ఆశించవచ్చు.

Most Read Articles

English summary
Hero Electric Scooter To Be Unveiled At 2020 Auto Expo. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X