Just In
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- News
వ్యవసాయ చట్టాల రద్దు తప్ప.. ఏదైనా అడగండి: కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
- Movies
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్‌దేనా విజయం..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎథర్ ఎనర్జీలో హీరో పెట్టుబడులు; మరిన్ని నగరాలకు రానున్న 450ఎక్స్ స్కూటర్
దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తాజాగా 84 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించింది. హీరో మోటోకార్ప్ మద్దతుతో సచిన్ బన్సాల్ నేతృత్వంలోని సిరీస్ సి రౌండ్‌కు పొడిగింపుగా తాజా పెట్టుబడికి ఉంటుందని కంపెనీ తెలిపింది.

గత 2016 నుండి ఏథర్ యొక్క వృద్ధిలో హీరో మోటోకార్ప్ భాగంగా ఉంది, సిరీస్ బిలో భాగంగా కూడా హీరో తమ పెట్టుబడులను వెచ్చించింది. కొత్తగా సేకరించిన నిధులను భారత మార్కెట్లో తమ వ్యాపార విస్తరణ కోసం వినియోగించుకోనున్నట్లు కంపెనీకి తెలిపింది.

ఈ విస్తరణ ప్రణాళికతో, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి అనుగుణంగా కంపెనీ కొత్త ఉత్పత్తి విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఏథర్ హోసూర్‌లో ఓ కొత్త ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. ఈ ప్లాంట్‌లో ఏటా 1,00,000 యూనిట్లను ఉత్పత్తి చేయడానికి అనువుగా రూపొందించనున్నారు.
MOST READ:దొంగిలించిన ఎటిఎం కార్డు పాస్‌వర్డ్ అడగడానికి వచ్చిన దొంగ ; తర్వాత ఎం జరిగిందో తెలుసా !

దీనికి అదనంగా, ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా దశల వారీగా అమ్మకాల విస్తరణను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 2021 చివరి నాటికి 20 ప్రధాన నగరాలలో కార్యకలాపాలు ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. ఏథర్ ఇటీవల విడుదల చేసిన ఫ్లాగ్‌షిప్ స్కూటర్, 450ఎక్స్ ఆటోమొబైల్ మరియు టెక్ ఔత్సాహికుల దృష్టిని ఆకర్షించింది. త్వరలోనే ఇది హైదరాబాద్, పూణే, ఢిల్లీ మరియు ముంబై వంటి నగరాల్లో అందుబాటులోకి రానుంది. రానున్న అక్టోబర్ 2020 నుండి దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

దశల వారీగా వ్యాపార విస్తరణ మరియు ఉత్పత్తిని పెంచడంతో పాటుగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది. ఏథర్ ఎనర్జీ రాబోయే ఐదేళ్ళలో దేశవ్యాప్తంగా ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల పబ్లిక్ ఛార్జింగ్ మరింత సులభతరం కానుంది మరియు ఇది అన్ని ఎలక్ట్రిక్ వాహన యజమానులకు అందుబాటులోకి రానుంది.
MOST READ:ఎలక్ట్రిక్ కారుకి పెట్రోల్ నింపాడని ట్రై చేసిన వ్యక్తి : ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

ఈ విషయంపై ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ తరుణ్ మెహతా మాట్లాడుతూ, "మేము ఈ ప్రయాణంలో అధిక వృద్ధి దశలో ఉన్నాము, గత కొన్ని నెలలు సవాలుగా ఉన్నప్పటికీ, మేము మా విస్తరణ ప్రణాళికలను మార్చలేదు. మా భౌగోళిక విస్తరణ మరియు ఏథర్ 450ఎక్స్ అయాన్ విడుదల కోసం సర్వం సిద్ధం చేసుకున్నాం. దేశవ్యాప్తంగా ఏథర్ 450ఎక్స్ స్కూటర్ కోసం ఏర్పడుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మా ప్లాంట్‌లో పెట్టుబడులు పెట్టడానికి మేము ఈ నిధులను ఉపయోగిస్తామ"ని అన్నారు.

ఏథర్ అందిస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకోవడానికి కంపెనీ ఆకర్షణీయమైన మార్గాలను కూడా ప్రకటించింది. ఇందులో అనేక ఫైనాన్సింగ్ మరియు ఓనర్‌షిప్ మోడల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను సులభంగా స్వీకరించడానికి మరియు వినియోగదారులకు ఇది మరింత అందుబాటులోకి తీసుకురావటానికి ఇవి సహకరిస్తాయి.
MOST READ:వర్షపు నీటిలో పడవపై ప్రయాణించిన వ్యక్తిపై కేసు బుక్ చేసిన పోలీసులు : ఎందుకో తెలుసా

ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ విషయానికి వస్తే, ఏథర్ ఈ విభాగంలో కూడా ముందంజలో ఉంది. ఇందులో ఏథర్ వన్, పిక్ అప్ అండ్ సర్వీస్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంట్లో మరియు పబ్లిక్‌లో ఉచిత ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

ఈ పెట్టుబడి అంశంపై హీరో మోటోకార్ప్, గ్లోబల్ బిజినెస్ అండ్ స్ట్రాటజీ, ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ రజత్ భార్గవ మాట్లాడుతూ, "ఇటీవలి సంవత్సరాలలో ఏథర్ ఎనర్జీ వృద్ధిని చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. వారి మార్కెట్‌ను మరింత విస్తరించడానికి వారికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని మేము చూస్తున్నాము, ముఖ్యంగా త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవి) విభాగం వృద్ధిని చూపనుంద"ని అన్నారు.
MOST READ:చివరకు పట్టుబడ్డ దేశంలోనే అతిపెద్ద దొంగల ముఠా

"ఈవిల కోసం బలమైన బాహ్య పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసే మా ప్రయత్నాలతో పాటు, మేము మా అంతర్గత ఈవి ప్రోగ్రామ్‌లో కూడా చురుకుగా పని చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు విద్యుత్‌తో నడిచే వాహనాలను అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఇవి సుస్థిరమైనవి మరియు శుభ్రమైనవి మరియు పర్యావరణానికి హాని కలిగించనవి" అని చెప్పారు.

ఏథర్ ఎనర్జీ పెట్టుబడులపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా తమ వ్యాపార కలాపాలను విస్తరించుకునేందుకు దశల వారీగా విస్తరణ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. పూర్తయిన రౌండ్ నిధులకు కొత్త పెట్టుబడులు జోడించడంతో, విస్తరణ ప్రణాళికల కోసం సంస్థ తన ప్రధాన పెట్టుబడిదారులలో ఒకరి నుండి విశ్వాసం పొందినట్లుగా తెలుస్తోంది. ఈ సంస్థలో హీరో మోటోకార్ప్ పెట్టుబలు పెట్టడం వలన ఈ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరిగినట్లు అవుతుంది.