Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాలుగు మోడళ్ల ధరలను పెంచిన హీరో మోటోకార్ప్, ఏయే మోడళ్లో తెలుసా?
దేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ఇటీవలే తమ మొత్తం బిఎస్6 పోర్ట్‌ఫోలియో ధరలను పెంచింది. ఈ జాబితాలో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, ఎక్స్‌పల్స్ 200 బిఎస్6, గ్లామర్ 125 బిఎస్6 మరియు పాషన్ ప్రో బిఎస్6 మోడళ్లు ఉన్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల కారణంగా కంపెనీ ఈ మోడళ్లను ధరలను పెంచింది. కాగా, పెరిగిన ధరలు చాలా స్వల్పంగానే ఉన్నాయి. మోడల్ వారీగా పెరిగిన ధరల వివరాలు ఉలా ఉన్నాయి:
Model | Variant | New Price | Old Price | Premium |
Xtreme 160R | Drum | ₹1,02,000 | ₹99,950 | ₹2,050 |
Disc | ₹1,05,050 | ₹1,03,500 | ₹1,550 | |
Xpulse 200 BS6 | ₹1,13,730 | ₹1,11,790 | ₹1,940 | |
Glamour 125 BS6 | Drum | ₹71,000 | ₹69,750 | ₹1,250 |
Disc | ₹74,500 | ₹73,250 | ||
Passion Pro BS6 | Drum | ₹66,500 | ₹65,740 | ₹760 |
Disc | ₹68,700 | ₹67,940 |

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్
హీరో మోటోకార్ప్ ఇటీవలే భారత మార్కెట్లో తమ కొత్త బిఎస్6 ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోడల్‌ను విడుదల చేసింది. ఇది నేక్డ్ స్ట్రీట్ మోటార్‌సైకిల్ మరియు ఇది ఫ్రంట్ డిస్క్, డబుల్ డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇంజన్ పరంగా, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్‌లో 160సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 15 బిహెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 14 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200
హీరో ఎక్స్‌పల్స్ 200 విషయానికి వస్తే, ఇది ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌గా కొనసాగుతోంది. హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 99సిసి ఫ్యూయెల్-ఇంజెక్ట్ సింగిల్ సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 17.8 బిహెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 16.45 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

హీరో గ్లామర్ 125
మునుపటి వేరియంట్‌తో పోలిస్తే కొత్త బిఎస్6 హీరో గ్లామర్ 125లో ఇంజన్ అప్‌డేట్స్‌తో పాటుగా కొత్త ఫీచర్లు కూడా లభిస్తాయి. ఈ మోటార్‌సైకిల్ ఇంధన-ఇంజెక్ట్, బిఎస్6-కంప్లైంట్ 125సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 10.8 బిహెచ్‌పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

హీరో ప్యాషన్ ప్రో బిఎస్6
కొత్త బిఎస్6 హీరో పాషన్ ప్రోలో బిఎస్4 వేరియంట్‌తో పోల్చితే కొత్త అప్‌డేట్స్ మరియు డిజైన్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. అలాగే, ఇందులో కొత్త ఫీచర్లు మరియు ఎక్విప్‌మెంట్‌లు కూడా చేర్చబడ్డాయి. ఇందులో 110 సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.79 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !

హీరో మోటోకార్ప్ ధరల పెరుగదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా సప్లయ్ చైన్ దెబ్బతిని, ఇప్పటికే దేశంలో అనేక తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ కూడా తమపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎంపిక చేసిన మోడళ్ల ధరలను స్వల్పంగా పెంచింది.