బ్లూటూత్ హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

హీరో మోటోకార్ప్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటి. సరసమైన మరియు విశ్వసనీయమైన స్కూటర్ మరియు మోటారుసైకిళ్ల ఉత్పత్తులకు ఈ బ్రాండ్ చాలా ప్రసిద్ది చెందింది. కాగా, హీరో మోటోకార్ప్ ఇప్పుడు దేశంలోని తమ అభిమానులు మరియు వినియోగదారుల కోసం కొత్త ఉపకరణాల జాబితాను విడుదల చేసింది.

బ్లూటూత్ హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

అందులో ఒకటి ఈ లేటెస్ట్‘స్మార్ట్ సన్‌గ్లాసెస్'. ఇవి ఆషామాషీ సన్‌గ్లాసెస్ కావు. బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ సన్‌గ్లాసెస్ ఇప్పుడు అనేక మంది ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ బ్లూటూత్ ఎనేబల్డ్ స్మార్ట్ సన్‌గ్లాసెస్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ టెక్నాలజీ, హ్యాండ్స్‌ఫ్రీ కాలింగ్ కోసం మైక్‌తో పాటుగా అంతర్గత స్పీకర్లు ఉన్నాయి. అంతేకాకుకండా ఈ స్మార్ట్ సన్‌గ్లాసెస్ బిజీగా ఉన్న నగర వీధుల్లో ఇబ్బంది లేని ప్రయాణాల కోసం టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను కూడా అందిస్తుంది.

బ్లూటూత్ హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్ రైడర్ కళ్ళను సూర్యకిరణాల నుండి రక్షించేందుకు 100 శాతం యూవీ రక్షణతో కూడిన పోలారైజ్డ్ లెన్స్‌తో తయారు చేయబడింది. ఈ సన్‌గ్లాసెస్ రైడర్ కళ్ళను సైడ్స్ నుండి కవర్ చేసి మంచి విండ్ బ్లాస్ట్ రక్షణను కూడా అందిస్తుంది. ఇది మెరుగైన రైడర్ దృశ్యమానత (విజిబిలిటీ)ని కలిగి ఉండి సులభంగా ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

బ్లూటూత్ హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇదివరకు చెప్పుకున్నట్లుగా, ఈ స్మార్ట్ సన్‌గ్లాసెస్ బ్లూటూత్ వెర్షన్ 4.1 అధిక-నాణ్యత కలిగిన సిఎస్ఆర్ చిప్‌తో పనిచేస్తుంది. ఇది రైడర్లు తమ సన్ గ్లాసెస్‌ను స్మార్ట్‌ఫోన్‌కు జత చేయడానికి సహాయపడుతుంది. వీటిని ఒక్కసారి స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్న తర్వాత రైడర్ ఫోన్‌ను బయటకు తీయాల్సిన అవసరం లేకుండానే కాల్‌లను స్వీకరించడం లేదా తిరస్కరించడం చేయవచ్చు.

బ్లూటూత్ హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్ ఫ్రేమ్‌లో చిన్న స్పీకర్లు మరియు మైక్‌లను చెవికి దగ్గరగా అమర్చారు. వీటి సాయంతో రైడర్ స్పష్టమైన ఆడియోను వినటానికి మాట్లాడటానికి అనువుగా ఉంటుంది. స్పీకర్లు చెవి దగ్గర ఉంచడం వలన ఇవి బాహ్య శబ్దానికి అంతరాయాన్ని కలిగించవు, కాబట్టి ఇవి ఉపయోగం కోసం కూడా సురక్షితంగా ఉంటాయి.

రైడర్ స్మార్ట్ సన్‌గ్లాసెస్‌తో ప్రయాణంలో ఉన్నప్పుడు సంగీతాన్ని (మ్యూజిక్) కూడా వినవచ్చు. వాల్యూమ్ పెంచడం లేదా తగ్గించడం, పవర్ ఆన్ లేదా ఆఫ్ చేయడం మరియు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కోసం ఇందులో రెండు బటన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రేమ్‌కి వెలుపలి వైపు అమర్చబడి ఉంటాయి.

MOST READ:భారీస్థాయిలో వాహన రద్దీ ఏర్పడటానికి కారణం ఇదే

బ్లూటూత్ హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం, ఈ స్మార్ట్ సన్‌గ్లాసెస్ రైడర్‌కు అందించే టర్న్-బై-టర్న్ నావిగేషన్. స్మార్ట్‌ఫోన్‌తో సన్‌గ్లాసెస్‌ను జత చేసిన తర్వాత, రైడర్ గూగుల్ మ్యాప్స్‌లో గమ్యాన్ని ఎంచుకుని నావిగేషన్‌ను సెట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత, కళ్ల అద్దాలు గూగుల్ యొక్క ఆన్-బోర్డ్ వాయిస్ అసిస్ట్ సహాయంతో టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను రైడర్‌కు వినిపిస్తాయి.

హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్ దాని డిజైన్ కారణంగా, ఇది ఎక్కువగా ఓపెన్ ఫేస్ హెల్మెట్లకు సూట్ అవుతుంది. మార్కెట్లో హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్ ధర రూ.2,999గా ఉంది. కస్టమర్లు వీటిని బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌లో కానీ లేదా దేశవ్యాప్తంగా అధీకృత హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌లలో కానీ కొనుగోలు చేయవచ్చు.

బ్లూటూత్ హీరో స్మార్ట్ సన్‌గ్లాసెస్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

హీరో మోటోకార్ప్ కొత్త స్మార్ట్ సన్ గ్లాసెస్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హీరో మోటోకార్ప్ కొత్త స్మార్ట్ సన్‌గ్లాసెస్‌ను భారత మార్కెట్ కోసం ప్రత్యేకించి డిజైన్ చేశారు. ప్రయాణించేటప్పుడు రైడర్ దృష్టి కేంద్రీకరించడానికి ఇది సహాయపడుతుంది మరియు ఇబ్బంది లేకుండా నావిగేషన్‌ను తెలుసుకోవటానికి సహకరిస్తుంది. అదనంగా, ఇది దాని స్నాగ్-ఫిట్ డిజైన్ కారణంగా యూవీ మరియు దుమ్ము, ధూళి నుండి రక్షణ కల్పిస్తుంది.

MOST READ:చేయని తప్పుకు అమాయక వ్యక్తిని నడిరోడ్డులో చితకబాదిన పోలీస్ [వీడియో]

Most Read Articles

English summary
Hero MotoCorp has just released unique accessorie called ‘Smart Sunglasses' for its fans and customers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X