హోండా యాక్టివా 5G కాదు ఇప్పుడు 6G: హైలెట్స్ ఇవే!

హోండా టూ వీలర్స్ తమ పాపులర్ యాక్టివా స్కూటర్‌ను ఇప్పుడు కొత్త వెర్షన్‌లో లాంచ్ చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. కొత్త తరం హోండా యాక్టివా స్కూటర్ 6G వెర్షన్‌లో వస్తోంది. గతంలో ఉన్న యాక్టివా 4G మరియు 5G తరహాలోనే ఇప్పుడు పలు మార్పులు చేర్పులతో 6G పేరుతో మార్కెట్లో సందడి చేయనుంది.

హోండా యాక్టివా 6G స్కూటర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం..

హోండా యాక్టివా 5G కాదు ఇప్పుడు 6G: హైలెట్స్ ఇవే!

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ కంపెనీ సరికొత్త హోండా యాక్టివా 6G స్కూటర్‌ను జనవరి 15, 2020 న అధికారికంగా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. వీటి బుకింగ్స్ కూడా అతి త్వరలో ప్రారంభం కానున్నాయి.

హోండా యాక్టివా 5G కాదు ఇప్పుడు 6G: హైలెట్స్ ఇవే!

ఈ స్కూటర్‌కు టెక్నికల్ వివరాలు రహస్యంగా లీక్ అయ్యాయి. హోండా యాక్టివా 6G స్కూటర్ సాంకేతిక వివరాలున్న పేపర్లు ఆన్‌లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే 1.09.51సీసీ సామర్థ్యం గల అదే మునుపటి సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ వస్తోంది.

హోండా యాక్టివా 5G కాదు ఇప్పుడు 6G: హైలెట్స్ ఇవే!

హోండా ప్రస్తుతం విక్రయిస్తున్న యాక్టివా 5G స్కూటర్‌లో కూడా ఇదే ఇంజన్ ఉంది. అయితే లేటెస్ట్ బిఎస్-6 ప్రమాణాలను పాటించే ఇంజన్ 7.6బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ యాక్టివా 5Gలో ఉన్న ఇంజన్ 8బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా యాక్టివా 5G కాదు ఇప్పుడు 6G: హైలెట్స్ ఇవే!

పాత మోడల్‌తో పోలిస్తే కాస్త తక్కువ పవర్ ఇచ్చే హోండా యాక్టివా 6Gలో కొత్తగా ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ మరియు హోండాకు చెందిన హోండా ఇకో టెక్నాలజీ (HET) సిస్టమ్‌ అదనంగా వస్తున్నాయి.

హోండా యాక్టివా 5G కాదు ఇప్పుడు 6G: హైలెట్స్ ఇవే!

హోండా యాక్టివా 6G బిఎస్-6 వెర్షన్ స్కూటర్ కావడంతో ఇందులో మెరుగైన స్మార్ట్ పవర్ కోసం eSP మరియు సైలంట్ స్టార్ట్ సిస్టమ్ కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. కొత్త తరం యాక్టివాలో అత్యాధునిక టెక్నాలజీ పరిచయం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హోండా యాక్టివా 5G కాదు ఇప్పుడు 6G: హైలెట్స్ ఇవే!

యాక్టివా 5G స్కూటర్‌‌తో పోలిస్తే, యాక్టివా 6G కొలతల పరంగా కాస్త పెద్దగా ఉంది. రహస్యంగా లీకైన డాక్యుమెంట్ల ప్రకారం, యాక్టివా 6G స్కూటర్ పొడవు, 1833మీమీ, వెడల్పు 697మిమీ, ఎత్తు 1156మిమీ మరియు వీల్‌బేస్ 1260మీమీగా ఉంది.

హోండా యాక్టివా 5G కాదు ఇప్పుడు 6G: హైలెట్స్ ఇవే!

హోండా యాక్టివా 6G ఫీచర్ల విషయానికి వస్తే, సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ లైటింగ్, పాస్-లైట్ బటన్, బయటి వైపున్న ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఇంకా ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఇందులో వస్తున్నాయి.

హోండా యాక్టివా 5G కాదు ఇప్పుడు 6G: హైలెట్స్ ఇవే!

హోండా యాక్టివా 5G ధర ప్రస్తుతం రూ. 57,094 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. కొత్త తరం హోండా యాక్టివా 6G ధర కాస్త ఎక్కువగా ఉండవచ్చు. యాక్టివా 6G ప్రారంభ ఎక్స్-షోరూమ్‌ ధర రూ. 60,000 వరకూ ఉండొచ్చు.

హోండా యాక్టివా 5G కాదు ఇప్పుడు 6G: హైలెట్స్ ఇవే!

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా యాక్టివా ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్. సుమారు 10 సంవత్సరాలకు పైగా హోండా యాక్టివా మార్కెట్లో ఉంది. ఇప్పటి వరకు పలు రకాల అప్‌డేట్స్‌తో వచ్చింది. తాజాగా వస్తోన్న బిఎస్-6 వెర్షన్ హోండా యాక్టివా 6G కూడా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. పూర్తి స్థాయిలో మార్కెట్లోకి లాంచ్ అయితే, విపణిలో ఉన్న టీవీఎస్ జూపిటర్ మరియు హీరో ప్రెజర్ 110 స్కూటర్లకు గట్టి పోటీనిస్తుంది.

Source: IAB

Most Read Articles

English summary
Honda Activa 6G Specs Leaked Ahead Of Launch: Here Are All The Details! Read in Telugu.
Story first published: Sunday, January 5, 2020, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X