న్యూ ఎప్రిలియా SXR 160 స్కూటర్, డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్

పియాజియో కంపెనీ తన కొత్త అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్దమైంది. ఇప్పుడు కొత్త అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డీలర్లకు చేరడం ప్రారంభించింది. ముంబైలోని ఒక డీలర్ వద్దకు కొత్త అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ వచ్చిందని యూట్యూబ్ ఛానల్ వెల్లడించింది.

న్యూ ఎప్రిలియా SXR 160 స్కూటర్, డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్

పియాజియో ఇప్పటికే తన ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ కోసం ప్రీ-బుకింగ్ ను భారతీయ మార్కెట్లో ప్రారంభించింది. ఈ కొత్త ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ కొనాలనుకునే వినియోగదారులు రూ. 5 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బారామతిలోని పియాజియో ఇండియా ప్లాంట్‌లో ఎప్రిలియా ఎస్‌ఎక్స్ఆర్ 160 స్కూటర్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది.

న్యూ ఎప్రిలియా SXR 160 స్కూటర్, డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్

ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎప్రిలియా మొదటసారి 2020 లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కొత్త ఎస్‌ఎక్స్ఆర్ 160 స్కూటర్‌ను ఆవిష్కరించింది. అయితే దేశంలో ఎక్కువగా వ్యాపించిన కరోనా మహమ్మరి వల్ల కొత్త ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ విడుదల ఆలస్యం అయింది.

MOST READ:మీకు తెలుసా.. అమెరికాలో 2021 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఒక టీవీ షో హోస్ట్

న్యూ ఎప్రిలియా SXR 160 స్కూటర్, డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్

కొత్త ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ త్వరలో విడుదల కానుంది. ఈ కొత్త స్కూటర్ డెలివరీ జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో ఇటీవల కాలంలో ఆటోమేటిక్ స్కూటర్లకు అధిక డిమాండ్ ఉంది. కావున భారత మార్కెట్లో బైకులకు ఉన్నత ఆదరణ స్కూటర్లకు కూడా ఉంది. ఈ కారణంగా స్కూటర్ మార్కెట్ కూడా మంచి అమ్మకాలను సాధిస్తోంది.

న్యూ ఎప్రిలియా SXR 160 స్కూటర్, డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్

వినియోగదారులు మరింత సామర్థ్యం గల డిజైన్ స్కూటర్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఈ కారణంగా ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎప్రిలియా తన మ్యాక్సీ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.

MOST READ:ఎక్స్‌యూవీ 500 ని కాపాడిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ, ఎలాగో చూసారా ?

న్యూ ఎప్రిలియా SXR 160 స్కూటర్, డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్

ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ స్టైలిష్ లుక్, బాడీ గ్రాఫిక్స్ మరియు డిజైన్ ఈ స్కూటర్లకు స్పోర్టి లుక్ ఇస్తాయి. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మాక్సి-స్కూటర్ యూరోపియన్ మరియు ఆగ్నేయాసియా మార్కెట్లలో ప్రసిద్ధ మోడల్. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ భారతదేశంలో లాంచ్ అవ్వడం ఆలస్యం అయింది.

న్యూ ఎప్రిలియా SXR 160 స్కూటర్, డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్

ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ క్రాస్ఓవర్ స్కూటర్ లాగా రూపొందించబడింది. స్కూటర్‌లో డ్యూయల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, డ్యూయల్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్ క్లస్టర్‌లు ఉన్నాయి. పుల్ సైజు విండ్‌స్క్రీన్ సిస్టం, పుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉంటుంది. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టంను అమలు చేస్తారు.

MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

న్యూ ఎప్రిలియా SXR 160 స్కూటర్, డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్

ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ప్రీమియం స్కూటర్ ధర సుమారు రూ. 1.27 లక్షలు. కొత్త ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ప్రీమియం స్కూటర్ త్వరలో విడుదల కానుంది. ఈ స్కూటర్ స్థానికంగా అభివృద్ధి చేయబడింది. ఈ స్కూటర్లో అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది.

న్యూ ఎప్రిలియా SXR 160 స్కూటర్, డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్

స్కూటర్ రైడర్ మరియు వెనుక ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీట్లు అందించబడ్డాయి. బాడీ గ్రాఫిక్స్ మరియు స్కూటర్ వైపు మరియు వెనుక వైపున ఉన్న స్టైలిష్ లుక్ డిజైన్ కూడా ఈ మ్యాక్సీ స్కూటర్‌కు స్పోర్టి లుక్ ఇస్తుంది.

MOST READ:టైటానిక్ షిప్‌ను తలపిస్తున్న ఫెర్రీ షిప్ : పూర్తి వివరాలు

న్యూ ఎప్రిలియా SXR 160 స్కూటర్, డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్

ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ప్రీమియం స్కూటర్ యువకులను ఎక్కువగా ఆకర్శించేవిధంగా డిజైన్ చేయబడింది. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రీమియం స్కూటర్లలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ కూడా ఒకటి. ఇది చూడటానికి చాల ఆకర్షణీయంగా ఉంటుంది, మరియు వాహనదారులకు మంచి రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

Image Courtesy: VJNS vlogs

Most Read Articles

English summary
Aprilia SXR 160 Scooter Spied At Dealer Yard Ahead Of Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X