హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లో తమ బిఎస్6 వెర్షన్ 'హీరో ఎక్స్‌పల్స్ 200' మోటార్‌సైకిల్‌ను నేడు మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో ఈ కొత్త బిఎస్6 కంప్లైంట్ హీరో ఎక్స్‌పల్స్ 200 ధర రూ.1.12 లక్షలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది. బిఎస్4 వెర్షన్ ధర కంటే ఇది రూ.6,800 అధికంగా ఉంది. అయినప్పటికీ, హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 మార్కెట్లో అత్యంత సరసమైన అడ్వెంచర్ బైక్‌గా కొనసాగుతోంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ మోటారుసైకిల్‌లో ఇదివరటి ఇంజన్‌నే బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించారు. ఈ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన 199 సిసి ఇంజన్‌ ఇప్పుడు ఎయిర్/ఆయిల్ కూల్డ్ మరియు ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌లను స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది. ఈ బిఎస్6 ఇంజన్ ఇప్పుడు గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.8 బిహెచ్‌పి శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 16.45 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 మోటార్‌సైకిల్‌లోని సస్పెన్షన్ కూడా పాత మోడల్ నుండే తీసుకున్నారు. ముందు భాగంలో 37 మి.మీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు 10 రకాలుగా సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్షన్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు వైపున 276 మి.మీ మరియు వెనుక వైపున 220 మి.మీ పెటల్ డిస్క్ బ్రేకులను అమర్చారు. ఇందులో సింగిల్ ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్ ఫీచర్‌గా ఉంటుంది. ఈ ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 220 మి.మీల గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:ఇప్పుడే చూడండి.. కైలాష్ యాత్రకు కొత్త రహదారి ఇదే

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ మోటార్‌సైకిల్ 90/90 ప్రొఫైల్‌తో ముందు 21 ఇంచ్‌ల పెద్ద టైరును కలిగి ఉంటుంది. అలాగే వెనుక భాగంలో 120/80 టైర్ ప్రొఫైల్‌తో 18 ఇంచ్‌ల వీల్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ దాని కాంపిటీటర్లతో పోలిస్తే చాలా తేలికగా ఉంటుంది, దీని బరువు 157 కిలోలు మరియు ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు.

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 దాని మునుపటి బిఎస్4 మోడల్ మాదిరిగానే అన్ని ఫీచర్లు, పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నకల్ గార్డ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. హీరో మోటోకార్ప్ ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 మోడల్ కోసం అడ్వెంచర్ స్పెసిఫిక్ ‘ర్యాలీ కిట్‌ను' కూడా ఆఫర్ చేస్తోంది, ఇందు కోసం కస్టమర్లు అదనంగా రూ.40,000 చెల్లించాల్సి ఉంటుంది.

MOST READ:టాటా సుమో గురించి మీకు తెలియని కొన్ని నిజాలు !

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 మోటార్‌సైకిల్ వైట్, మ్యాట్ గ్రీన్, మ్యాట్ గ్రే, స్పోర్ట్స్ రెడ్ మరియు పాంథర్ బ్లాక్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. బిఎస్6 మోడళ్లలోని ఎగ్జాస్ట్ పైపు యొక్క స్థానాన్ని కూడా మార్చారు. హెడర్ పైప్ ఇప్పుడు ఇంజన్ క్రింది వైపు నుండి వెనుక సీట్ మడ్‌గార్డ్ వరకూ పొడగించబడి ఉంటుంది. ఈ కొత్త ఎగ్జాస్ట్ పైపింగ్ కోసం స్థలం ఉండేలా ఇంజన్ బెల్లీ-పాన్ కూడా రీడిజైన్ చేశారు.

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 దేశంలో అత్యంత సరసమైన, అధిక సామర్థ్యం గల అడ్వెంచర్ మోటార్‌సైకిల్. భారత మార్కెట్లోని రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 వంటి మోడళ్లతో హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 పోటీ పడుతుంది. దేశంలోని ఉత్తమమైన ఎంట్రీ లెవల్ ఆఫ్-రోడర్‌లలో ఇది ఒకటిగా ఉంటుంది.

MOST READ:సినిమా స్టైల్ లో సింగం స్టంట్‌ చేసిన పోలీసుకు రూ. 5000 జరిమానా

Most Read Articles

English summary
Hero Xpulse 200 BS6 Motorcycle Launched In India: Prices Start At Rs 1.12 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X