ఫిబ్రవరి నెలలో హస్క్ వర్నా బైక్స్ అమ్మకాలు ఎంతో తెలుసా.. ?

హస్క్ వర్నా మోటార్ సైకిల్స్ ఫిబ్రవరి 25 న స్వర్ట్‌పిలీన్ 250, విట్‌పిలీన్ 250 బైక్‌లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో విడుదలైనప్పటినుంచి ఫిబ్రవరిలో ఎన్ని హస్క్ వర్నా బైక్‌లు అమ్ముడయ్యాయనే విషయాన్నీ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.. ?

ఫిబ్రవరి నెలలో హస్క్ వర్నా బైక్స్ అమ్మకాలు ఎంతో తెలుసా.. ?

బైక్ వాలే నివేదికల ప్రకారం హస్క్ వర్నా మోటార్ బైక్స్ దాదాపు 163 యూనిట్లు ఫిబ్రవరిలో అమ్ముడయ్యాయని తెలిపింది. హస్క్ వర్నా బైక్‌లను లాంచ్ చేయడానికి ఒక నెల ముందే బైక్‌లను ప్రీ-బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీని ఫలితంగా ఫిబ్రవరిలో 163 ​​యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఫిబ్రవరి నెలలో హస్క్ వర్నా బైక్స్ అమ్మకాలు ఎంతో తెలుసా.. ?

హస్క్ వర్నా స్వర్ట్‌పిలీన్ 250, విట్‌పిలీన్ 250 బైక్‌ల ధరలను గమనించినట్లయితే దాదాపు రూ. 1.80 లక్షలు (ఎక్స్ షోరూం). హస్క్ వెర్నా ఈ బైక్‌లను భారతదేశంలోని కెటిఎం షోరూమ్‌ల ద్వారా విక్రయిస్తుంది.

ఫిబ్రవరి నెలలో హస్క్ వర్నా బైక్స్ అమ్మకాలు ఎంతో తెలుసా.. ?

కరోనా వైరస్ కారణంగా ఈ బైకుల అమ్మకాలు ప్రస్తుతం ఆగిపోయాయి. రాబోయే నెలల్లో ఈ బైక్‌ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

ఫిబ్రవరి నెలలో హస్క్ వర్నా బైక్స్ అమ్మకాలు ఎంతో తెలుసా.. ?

కొత్తగా లాంచ్ అయినప్పటికీ ఈ బైక్‌లకు ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. హస్క్ వర్నా విట్‌పిలీన్ 250 మరియు స్వర్ట్‌పిలీన్ 250 బైక్ లలో 248.8 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 27 బిహెచ్‌పి శక్తి వద్ద 24 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఫిబ్రవరి నెలలో హస్క్ వర్నా బైక్స్ అమ్మకాలు ఎంతో తెలుసా.. ?

ఈ ఇంజన్లలో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటాయి. విట్‌పిలీన్ 250 మరియు స్వర్ట్‌పిలీన్ 250 బైక్‌ల రూపకల్పన 401 బైక్‌ల మాదిరిగానే ఉంటుంది.

ఫిబ్రవరి నెలలో హస్క్ వర్నా బైక్స్ అమ్మకాలు ఎంతో తెలుసా.. ?

ఈ బైక్‌లోని చాలా ఉపకరణాలు కెటిఎమ్ డ్యూక్ 250 బైక్ నుండి తీసుకోబడ్డాయి. హస్క్ వర్నా దేశీయ మార్కెట్లో 250 సిసి బైక్ విభాగంలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. ఇది విజయవంతమవుతుందా లేదా అనేది రాబోయే నెలల్లో తెలుస్తుంది.

ఫిబ్రవరి నెలలో హస్క్ వర్నా బైక్స్ అమ్మకాలు ఎంతో తెలుసా.. ?

ఏది ఏమైనా ఇటీవల కాలంలో విడుదలైన హస్క్ వర్నా ఇండియన్ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది. ఇది చూడటానికి మంచి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా వాహనదారునికి మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

Most Read Articles

English summary
Husqvarna Bike Sales In February: Registers 163 Units Sold Report. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X