మాడిఫైడ్ చేసిన కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్ చూసారా.. !

భారతదేశంలో ఇటీవల కాలంలో వాహనప్రియులు ఎక్కువగా మాడిఫై బైకులపై ఆసక్తిని కనపరుస్తున్నారు. ఇప్పటికే చాల వరకు మాడిఫైడ్ వాహనాల గురించి తెలుసుకున్నాం. ఈ నేపద్యంలో వెలువడిన ఈ కెటిఎమ్ 390 మాడిఫై బైక్ గురించి తెలుసుకుందాం.. !

మాడిఫైడ్ చేసిన కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్ చూసారా.. !

ఇండియన్ మార్కెట్లో మంచి ఆధరణను పొందుతున్న ద్విచక్ర వాహనాలలో కెటిఎమ్ బైక్ ఒకటి. ఈ కెటిఎమ్ 390 బైక్ ధర ఇండియన్ మార్కెట్లో 2.99 లక్షలు. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో పాటు, వినియోగదారునికి మంచి రైడింగ్ అనుభూతిని కూడా ఇస్తుంది. ఇది భారతదేశంలో మాడిఫై చేయబడిన మొట్టమొదట కెటిఎమ్ బైక్.

మాడిఫైడ్ చేసిన కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్ చూసారా.. !

ఈ కెటిఎమ్ 390 బైక్ లో ఎలాంటి మార్పులు చేశారనే వీడియోను అభినవ్ బాత్ అనే యు ట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసారు. అంతే కాకుండా ఈ బైక్ నడుపుతున్న దృశ్యాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు.

మాడిఫైడ్ చేసిన కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్ చూసారా.. !

అతను 390 అడ్వెంచర్ బైక్‌లో ఉపయోగించిన మినరల్ ఆయిల్‌కు బదులుగా సింథటిక్ ఆయిల్‌ను ఉపయోగించాడు. ఈ మార్పుతో విండ్‌షీల్డ్ మినహా అన్ని భాగాల కొంతవరకు నిరోధించబడతాయి. అంతే కాకుండా ఇందులో 14 టూత్ యూనిట్‌తో దాని 15 టూత్ ఫ్రంట్ స్ప్రాకెట్‌ను కూడా మార్చడం జరిగింది.

మాడిఫై చేసిన ఈ కెటిఎమ్ బైక్ పలుమార్లు పరీక్షించబడింది. ఇది ఎలాంటి రోడ్డులో అయిన రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఉన్న చిన్న స్ప్రాకెట్ ద్వారా తక్కువ వేగంతో వెళ్ళడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది మంచి ఇంధన సామర్త్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

మాడిఫై చేసిన కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్ చూసారా.. !

కెటిఎమ్ 390 అడ్వెంచర్ లో 373 సిసి లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 43 బిహెచ్‌పి మరియు 37 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్ ద్వారా 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడి ఉంటుంది. ఇందులో స్విచబుల్ డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, త్రి యాక్సిస్ ఇఎంయు, బై డైరెక్షనల్ -షిఫ్టర్ , లీన్-యాంగిల్ ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా ఇందులో ఉంటాయి.

Source: Abhinav Bhatt/YouTube

Most Read Articles

English summary
KTM 390 Adventure low-end performance improved for just Rs 195 – Video. Read in Telugu.
Story first published: Monday, March 16, 2020, 12:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X