2021 మోటోజిపి కోసం డ్యుకాటితో జట్టు కట్టిన 'జాక్ మిల్లర్'

మోటోజిపి రేసింగ్ దిగ్గజం జాక్ మిల్లర్ ఇప్పుడు డ్యూకాటి టీమ్‌లో చేరాడు. రాబోయే 2021 మోటో జిపి వరల్డ్ చాంపియన్‌షిప్ సీజన్‌లో డ్యుకాటి కోర్స్ జట్టు తరఫున జాక్ మిల్లర్ పోటీలో పాల్గొంటాడని డ్యుకాటి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

2021 మోటోజిపి కోసం డ్యుకాటితో జట్టు కట్టిన 'జాక్ మిల్లర్'

ఇటలీలోని బోర్గో పనిగేల్ ప్రాంతానికి చెంది ఈ డ్యుకాటి రేసింగ్ బ్రాండ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ జిపి రైడర్ అయిన జాక్ మిల్లర్‌తో ఈ మేరకు నెక్స్ట్ సీజన్ కోసం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బహుశా 2022 సీజన్‌లో కూడా ఇతనే డ్యుకాటి టీమ్ తరఫున పోటీ చేసే ఆస్కారం ఉంది.

2021 మోటోజిపి కోసం డ్యుకాటితో జట్టు కట్టిన 'జాక్ మిల్లర్'

జాక్ మిల్లర్‌కు 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు 2015లో మోటోజిపిలోకి ప్రవేశించాడు. స్వతహాగా బైక్స్ అంటే ఎంతో ఇష్టం ఉన్న జాక్ మిల్లర్ టీఎమ్ ఎల్‌సిఆర్, మార్క్ విడిఎస్ రేసింగ్ వంటి పాపులర్ రేసింగ్ జట్ల తరఫున పోటీలో పాల్గొన్నాడు. ఆ తర్వాత 2018లో ప్రమాక్ రేసింగ్ టీమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

MOST READ: దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

2021 మోటోజిపి కోసం డ్యుకాటితో జట్టు కట్టిన 'జాక్ మిల్లర్'

గడచిన సీజన్‌లో 8వ స్థానంలో నిలిచి, ఐదు పోడియం‌లను ఫినిష్ చేశాడు. గడచిన రెండేళ్లుగా ప్రమాక్ రేసింగ్ టీమ్ తరఫను పోటీ చేస్తూ వచ్చిన జాక్ మిల్లర్ ప్రస్తుతం 43వ రేసర్ ర్యాంకింగ్ స్థానంలో ఉన్నాడు.

2021 మోటోజిపి కోసం డ్యుకాటితో జట్టు కట్టిన 'జాక్ మిల్లర్'

డ్యుకాటి సంస్థతో తన మోటోజిపి కేరీర్‌ను పంచుకోవటం చాలా ఆనందంగా ఉందని, తనపై విశ్వాసం ఉంచి, తనకి ఈ అవకాశం ఇచ్చిన డ్యుకాటి యాజమాన్యంలోని క్లాడియో, గిగి, పావ్లో, డేవిడ్ తదితరులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాని జాక్ మిల్లర్ చెప్పారు. 2021 సీజన్‌కి అఫీషియల్ డ్యుకాటి రైడర్‌గా చేరడం పట్ల తాను పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాని అన్నారు.

MOST READ: కరోనా ఎఫెక్ట్ : విమానాశ్రయాలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఉబర్, ఎందుకంటే ?

2021 మోటోజిపి కోసం డ్యుకాటితో జట్టు కట్టిన 'జాక్ మిల్లర్'

ఈ సందర్భంగా డ్యుకాటి మోటార్ మోల్డింగ్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్లాడియో డామెనికలి మాట్లాడుతూ.. జాక్ మిల్లర్ ప్రమాక్ రేసింగ్ టీమ్‌లో చేరినప్పటి నుండి క్రమక్రమంగా తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటూ వచ్చాడని, చాంపియన్‌షిప్‌లో అత్యంత వేగవంతమైన మరియు నైపుణ్యమైన రైడర్‌గా తనని తాను నిరూపించుకున్నాడని అన్నారు.

2021 మోటోజిపి కోసం డ్యుకాటితో జట్టు కట్టిన 'జాక్ మిల్లర్'

వచ్చే ఏడాది జరగబోయే మోటోజిపిలో డ్యుకాటి టీమ్ తరఫున తమ అధికారిక డెస్మోసెడిసి జిపి బైక్‌ని నడిపేందుకు జాక్ మిల్లర్ ఒప్పుకున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందని డామెనికలి అన్నారు. నెక్స్ట్ సీజన్ మోటోజిపిలో తమ జట్టు తరఫున పాల్గొనడానికి జాక్ మిల్లర్ సరైన వ్యక్తి అని డ్యుకాటి భావిస్తోంది.

MOST READ: ఆర్ఆర్ గ్లోబల్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్స్!

2021 మోటోజిపి కోసం డ్యుకాటితో జట్టు కట్టిన 'జాక్ మిల్లర్'

జాక్ మిల్లర్ డ్యుకాటి రేసింగ్ జట్టులో చేరడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

డ్యుకాటి ఫ్యాక్టరీ జట్టులో మిల్లర్ ఒకరిగా చేరటం నిజంగా ఆ జట్టుకు మరింత బలం చేకూర్చనుంది. జాక్ మిల్లర్ తన మోటోజిపి కెరీర్‌లో చాలా వేగంగా మంచి పేరును తెచ్చుకున్నాడు. ఈసారి సీజన్‌లో డ్యుకాటి చాంపియన్‌షిప్ కొట్టాలని మనం కూడా కోరుకుందాం.

Most Read Articles

English summary
Ducati Corse has announced that Jack Miller will be one of their two official Ducati Team riders for the 2021 MotoGP World Championship season. The brand based at Borgo Panigale and the 25-year-old Australian GP rider have signed an agreement for next season, with a possibility to extend the contract for the 2022 season as well. Read in Telugu.
Story first published: Sunday, June 14, 2020, 12:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X