జావా లవర్స్‌కి షాక్; జనవరి నుండి పెరగనున్న ధరలు

ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'జావా మోటార్‌సైకిల్స్' కొత్త సంవత్సరం నుండి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో జావా మోటార్‌సైకిల్స్ విక్రయిస్తున్న మూడు మోడళ్ల (క్లాసిక్, ఫోర్టీ-టూ, పెరాక్) ధరలను పెంచాలని కంపెనీ యోచిస్తోంది.

జావా లవర్స్‌కి షాక్; జనవరి నుండి పెరగనున్న ధరలు

కార్ అండ్ బైక్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ధరల పెరుగుదల వచ్చే నెల ప్రారంభం నుండి అమలులోకి రానుంది. అయితే, ఏయే మోడల్‌పై ఖచ్చితంగా ఎంత మేర ధరలు పెరుగుతాయనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

జావా లవర్స్‌కి షాక్; జనవరి నుండి పెరగనున్న ధరలు

దేశంలోని ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే, జావా మోటార్‌సైకిల్స్ కూడా ప్రస్తుత సంవత్సరంలో ఎదుర్కున్న సవాళ్లు, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు మరియు ఉత్పాదక వ్యయాల కారణంగానే కంపెనీ ధరల పెంపుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

జావా లవర్స్‌కి షాక్; జనవరి నుండి పెరగనున్న ధరలు

జావా మోటార్‌సైకిల్స్ ప్రోడక్ట్ లైనప్ పోర్టీ-టూ మోడల్ నుండి ప్రారంభమవుతుంది మార్కెట్లో దీని ధర రూ.1.65 లక్షలుగా ఉంది. ఇకపోతే జావా క్లాసిక్ ప్రారంభ ధర రూ.1.74 లక్షలు మరియు శక్తివంతమైన పెరాక్ మోటార్‌సైకిల్ ధర రూ.1.94 లక్షల నుండి ప్రారంభం అవుతాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

జావా లవర్స్‌కి షాక్; జనవరి నుండి పెరగనున్న ధరలు

జావా క్లాసిక్ మరియు జావా 42 (ఫోర్టీ-టూ) మోడళ్లు రెండూ ఒకేరకమైన ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తాయి. వీటిలో 298సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 26 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

MOST READ:ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్ ; దీని ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు

జావా లవర్స్‌కి షాక్; జనవరి నుండి పెరగనున్న ధరలు

జావా పెరాక్ మోటారుసైకిల్ విషయానికి వస్తే, ఇది బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్. రెట్రో రూపంతో బాబర్ స్టైల్ డిజైన్‌ను కలిగి ఉండే ఈ మోటార్‌సైకిల్‌లో 334సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ డిహెచ్‌సి ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 30 బిహెచ్‌పి శక్తిని మరియు 32 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తోనే జతచేయబడి ఉంటుంది.

జావా లవర్స్‌కి షాక్; జనవరి నుండి పెరగనున్న ధరలు

జావా పెరాక్ మోటార్‌సైకిల్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, ఇందులో పొడగించిన స్వింగ్ఆర్మ్, రైడర్ కోసం ఒకే సీటు, టియర్‌డ్రాప్ ఆకారంలో ఉండే 14 లీటర్ల ఇంధన ట్యాంక్, డ్యూయెల్ ఎగ్జాస్ట్, టర్న్ ఇండికేటర్లతో కూడిన లో సెట్ టెయిల్ ల్యాంప్స్, గుండ్రటి ఆకారంలో హెడ్‌ల్యాంప్, బార్-ఎండ్ మిర్రర్స్, సింగిల్-పాడ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

జావా లవర్స్‌కి షాక్; జనవరి నుండి పెరగనున్న ధరలు

భారత ద్విచక్ర వాహన విభాగంలో, హీరో మోటోకార్ప్ తరువాత ధరల పెంపును ప్రకటించిన రెండవ టూవీలర్ కంపెనీ జావా మోటార్‌సైకిల్స్. హీరో మోటోకార్ప్ కూడా కొత్త సంవత్సరంలో తమ మొత్తం ఉత్పత్తి శ్రేణి ధరలను రూ.1,500 వరకు పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. పెరిగిన ధరలు జనవరి 2021 నుండి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.

జావా లవర్స్‌కి షాక్; జనవరి నుండి పెరగనున్న ధరలు

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా జావా మోటార్‌సైకిల్స్ బ్రాండ్‌ని కలిగి ఉంది. మహీంద్రా కూడా జనవరి 2021వ తేదీ నుండి తమ ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసినదే. కాగా, మహీంద్రా ఇంకా ఖచ్చితమైన ధరల పెంపు వివరాలను మొత్తాన్ని ప్రకటించలేదు.

MOST READ:ఈ బుల్లి ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ విలువ రూ.1.1 కోట్లకు పైమాటే!

జావా లవర్స్‌కి షాక్; జనవరి నుండి పెరగనున్న ధరలు

జావా మోటార్‌సైకిల్స్ గడచిన 2018లో భారత మార్కెట్లోకి మహీంద్రా గ్రూప్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. దేశీయ మార్కెట్లో జావా విక్రయించే మోటార్‌సైకిళ్లు ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 లైనప్ మరియు బెనెల్లి ఇంపీరియల్ 400 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తాయి.

Most Read Articles

English summary
Jawa To Increase Its Motorcycle Prices From January 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X