Just In
- 15 min ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 43 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 2 hrs ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 3 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
Don't Miss
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరోసారి పెరిగిన కెటిఎమ్, హస్క్వార్నా మోటార్‌సైకిల్ ధరలు
భారత మార్కెట్లో కెటిఎమ్ మరియు హస్క్వార్నా మోటార్‌సైకిళ్ల ధరలు మరోసారి పెరిగాయి. మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఈ రెండు బ్రాండ్ల మోటార్‌సైకిళ్ల ధరలు రూ.1,200 నుంచి రూ.8,500 మధ్యలో పెరిగాయి.

ముందుగా, కెటిఎమ్ ధరల పెంపు విషయానికి వస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే మార్కెట్లో విడుదల కెటిఎమ్ డ్యూక్ 125 మరియు కెటిఎమ్ అడ్వెంచర్ 250 మోటార్‌సైకిళ్ల మినహా తమ ప్రోడక్ట్ లైనప్‌లోని ఇతర మోడళ్ల ధరలను కంపెనీ పెంచింది.

కెటిఎమ్ ఇండియా ప్రోడక్ట్ లైనప్‌లో అతి తక్కువ పెంపును అందుకుంది కెటిఎమ్ ఆర్‌సి 125. ఈ ఎంట్రీ లెవల్ ఫుల్ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ ధర రూ.1,279 మేర పెరిగి ఇప్పుడు రూ.1.61 లక్షల (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది. ఇకపోతే, కెటిఎమ్ 390 డ్యూక్ ధర గరిష్టంగా రూ.8,517 పెరిగింది. ప్రస్తుతం ఈ నేక్డ్ మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.66 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
MOST READ: భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

కెటిఎమ్ డ్యూక్ 390 తర్వాత, అత్యధిక ధరల పెరుగుదలను అందుకు కెటిఎమ్ డ్యూక్ 250 మోడల్. డ్యూక్ 250 ధర రూ.4,738 పెరిగి, రూ.2.14 లక్షలకు చేరుకుంది. బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్, కెటిఎమ్ ఆర్‌సి 390 ధరను రూ.3,539 మేర పెరిగి రూ.2.56 లక్షల వద్ద రిటైల్ అవుతోంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).
Model | Price (Old) | Price (New) | Increase |
200 Duke | ₹1,77,037 | ₹1,78,960 | ₹1,923 |
250 Duke | ₹2,09,472 | ₹2,14,210 | ₹4,738 |
390 Duke | ₹2,58,103 | ₹2,66,620 | ₹8,517 |
RC 125 | ₹1,59,821 | ₹1,61,100 | ₹1,279 |
RC 390 | ₹2,53,381 | ₹2,56,920 | ₹3,539 |
390 Adventure | ₹3,04,438 | ₹3,05,880 | ₹1,442 |
Svartpilen 250 | ₹1,84,960 | ₹1,86,750 | ₹1,790 |
Vitpilen 250 | ₹1,84,960 | ₹1,86,750 | ₹1,790 |
(పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

కెటిఎమ్ డ్యూక్ 200 మరియు 390 అడ్వెంచర్ మోడళ్ల ధరలు వరుసగా రూ.1,923 మరియు రూ.1,442 రూపాయలు చొప్పున పెరిగాయి. తాజా ధరల పెంపు తర్వాత మార్కెట్లో కెటిఎమ్ 200 డ్యూక్ ధర రూ.1.78 లక్షలుగా ఉంటే కెటిఎమ్ అడ్వెంచర్ 390 మోటార్‌సైకిల్ ధర రూ.3.05 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
MOST READ: 27 నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

ఇక హస్క్వర్నా మోటార్‌సైకిల్ ధరల పెంపు విషయానికి వస్తే, ఈ బ్రాండ్ ప్రస్తుతం భారత మార్కెట్లో బ్రాండ్ రెండు మోటార్‌సైకిళ్లు మాత్రమే విక్రయిస్తోంది. అవి: స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250. ఈ రెండు మోడళ్లు దేశంలోని 250సిసి మోటార్‌సైకిల్ విభాగంలో చాలా ప్రత్యేకమైన మోడళ్లు.

హస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 250 ఒక స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ మరియు ఇందులో డ్యూయల్ పర్పస్ ఎమ్ఆర్ఎఫ్ రెవ్జ్ ఎఫ్‌డి టైర్లు, ఫ్లాటర్ సీట్, బ్యాగ్ పెట్టుకోవటానికి ట్యాంక్ ర్యాక్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇది డ్యూయల్ టోన్ సిల్వర్-గ్రే పెయింట్ కలర్ స్కీమ్‌లో లభిస్తుంది.
MOST READ: ఈ జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ధర కేవలం 50 డాలర్లు మాత్రమే!

హస్క్వార్నా విట్‌పిలెన్ 250 చూడటానికి కేఫ్-రేసర్ స్టైల్‌లో ఉంటుంది. ఇందులో లో-సెట్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, ఎమ్ఆర్ఎఫ్ రెవ్జ్ ఎఫ్‌సి1 సాఫ్ట్ కాంపౌండ్ టైర్లు మరియు డ్యూయల్-టోన్ వైట్ అండ్ గ్రే పెయింట్ స్కీమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో విట్‌పిలెన్ 250 మరింత అగ్రెసివ్‌గా, స్పోర్టీగా కనిపిస్తుంది.

కాగా, ఈ రెండు మోటార్‌సైకిళ్ల ధరలను కంపెనీ ఒకే రంగా పెంచింది. ఇప్పుడు ఇవి 1,790 రూపాయల ధరల పెంపును అందుకున్నాయి. తాజా ధరల పెంపు తర్వాత మార్కెట్లో స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 మోడళ్ల ధర రూ.1.86 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇవి రెండూ ఒకే రకమైన ధరతో అందుబాటులో ఉంటాయి.
MOST READ: దూసుకెళ్తున్న నిస్సాన్ మాగ్నైట్, 5 రోజుల్లోనే 5000కి పైగా బుకింగ్స్

కెటిఎమ్, హస్క్వార్నా మోటార్‌సైకిళ్ల ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో యవతను ఆకట్టుకునే మోటార్‌సైకిల్ బ్రాండ్లలో కెటిఎమ్ అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండ్. కెటిఎమ్ తమ మోడళ్లలో బిఎస్6 అప్‌డేట్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ధరలను పెంచింది. కాగా, తాజా ధరల పెంపుకు గల కారణానాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.