కొత్త 2021 బిఎస్6 890 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించిన కెటిఎమ్

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ తమ సరికొత్త 2021 890 అడ్వెంచర్ ఆర్ మరియు లిమిటెడ్ ఎడిషన్ 890 అడ్వెంచర్ ర్యాలీ ఆర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించింది. ఈ రెండు మోటార్‌సైకిళ్లు కెటిఎమ్ 790 అడ్వెంచర్ మోడల్ డిజైన్ మరియు స్టైలింగ్ నుండి స్పూర్తి పొంది తయారు చేశారు.

కొత్త 2021 బిఎస్6 890 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించిన కెటిఎమ్

కొత్త 2021 కెటిఎమ్ 890 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లు రెండూ కూడా కొత్త బిఎస్6 ఇంజన్ అప్‌డేట్‌తో పాటుగా కొత్త ఫ్రేమ్, కొత్త స్వింగార్మ్‌ను కలిగి ఉంటాయి.

కొత్త 2021 బిఎస్6 890 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించిన కెటిఎమ్

ఇంజన్ విషయానికి వస్తే, ఈ రెండు మోటార్‌సైకిళ్లలో ఒకేరకమైన ఇంజన్ ఉంటుంది. ఇందులోని 889సిసి, పారలల్-ట్విన్ బిఎస్6 ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 103 బిహెచ్‌పి శక్తిని, 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 100 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను కెటిఎమ్ డ్యూక్ 890 మోడల్ నుండి గ్రహించి, రీట్యూన్ చేశారు.

MOST READ:దేశీయ మార్కెట్లో హోండా హైనెస్ సిబి 350 బైక్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

కొత్త 2021 బిఎస్6 890 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించిన కెటిఎమ్

ఈ రెండు మోడళ్లలో ముందుగా కెటిఎమ్ 890 అడ్వెంచర్ ఆర్ విషయానికి వస్తే, ఇందులో ఏబిఎస్, ఆఫ్-రోడ్ ఏబిఎస్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి మెరుగైన రైడింగ్ ఎలక్ట్రానిక్ అసిస్టెన్స్ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో క్రూయిజ్ కంట్రోల్ కోసం హ్యాండిల్‌బార్‌లో కొత్తగా స్విచ్ కూడా ఉంటుంది, ఈ ఫీచర్ రెండు మోడళ్లలో స్టాండర్డ్‌గా లభిస్తుంది.

కొత్త 2021 బిఎస్6 890 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించిన కెటిఎమ్

సస్పెన్షన్‌ను గమనిస్తే, ముందు భాగంలో 239 మిమీ ట్రావెల్‌తో కూడిన 48 మిమీ డబ్ల్యుపి అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుకవైపు కూడా 239 మిమీ ట్రావెల్‌తో కూడిన డబ్ల్యుపి మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. అలాగే ముందు వైపు 4-పిస్టన్ కాలిపర్‌లతో అప్-ఫ్రంట్ ట్విన్ 320 మిమీ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుకవైపు 2-పిస్టన్ కాలిపర్‌లతో ఒకే ఒక 260 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా కలిగి ఉంటాయి.

MOST READ:ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

కొత్త 2021 బిఎస్6 890 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించిన కెటిఎమ్

కెటిఎమ్ 890 అడ్వెంచర్ ఆర్ మోటార్‌సైకిల్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, వెనుక స్టీల్ సబ్-ఫ్రేమ్ మరియు ముందు వైపు అల్యూమినియం స్టీరింగ్ ఉంటాయి. ఇంకా ఇందులో 5 ఇంచ్ ఫుల్ కలర్ టిఎఫ్‌టి స్క్రీన్‌ను కూడా ఉంటుంది. ఇది రైడర్‌కు అవసరమైన వివిధ రకాల సమాచారాన్ని అందిస్తుంది. ముందు వైపు 21 ఇంచ్ వీల్ మరియు వెనుక వైపు 19 ఇంచ్ వీల్ ఉంటుంది. వీటిపై మెట్జెలర్ కరూ 3 డ్యూయెల్-స్పోర్ట్ టైర్లు అమర్చబడి ఉంటాయి.

కొత్త 2021 బిఎస్6 890 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించిన కెటిఎమ్

ఇకపోతే, కెటిఎమ్ 890 అడ్వెంచర్ ర్యాలీ ఆర్ విషయానికి వస్తే, ఈ మోడల్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఉంచేందుకు గాను కేవలం 700 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. ఈ మోటార్‌సైకిల్‌లో మెరుగైన ఆఫ్-రోడ్ సామర్థ్యం కోసం డబ్ల్యూపి ఎక్స్‌ప్లోర్ ప్రో సస్పెన్షన్ సెటప్ వంటి ప్రత్యేకమైన విడిభాగాలు ఉంటాయి. ఇందులో అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ ఉంటుంది, ఇది 890 అడ్వెంచర్ ఆర్‌లో కనిపించే దానికంటే 35 శాతం తేలికైనది. ఇంకా ఇందులో 910 మిమీ సీట్ ఎత్తుతో ఇది స్ట్రెయిట్ రేసింగ్ సీట్‌ను కలిగి ఉండి, క్విక్-షిఫ్టర్‌తో పాటుగా 'ర్యాలీ' రైడింగ్ మోడ్‌ను కూడా స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది.

MOST READ:సూపర్ ఫీచర్లతో లాంచ్ అయిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ జి 310 బైక్స్ : పూర్తి వివరాలు

కొత్త 2021 బిఎస్6 890 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించిన కెటిఎమ్

ఈ మోటార్‌సైకిల్‌లోని ర్యాలీ ఫుట్-పెగ్స్, యానోడైజ్డ్ వీల్స్, అప్‌డేటెడ్ రేస్-ట్యూన్డ్ ఛాస్సిస్ మరియు కార్బన్ ఫైబర్ ట్యాంక్ ప్రొటెక్టర్స్ ఉంటాయి. అలాగే, ఈ రెండు మోటార్‌సైకిళ్ల గ్రాఫిక్స్ కూడా భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ మోడళ్లు అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రమే లభ్యం కానున్నాయి. ఇందులో 890 అడ్వెంచర్ ఆర్‌ను కెటిఎమ్ భారత మార్కెట్లో పరిచయం చేసే ఆస్కారం ఉంది. అయితే, 890 అడ్వెంచర్ ర్యాలీ ఆర్ ఎడిషన్‌కు ఆ భాగ్యం లేకపోవచ్చని తెలుస్తోంది.

కొత్త 2021 బిఎస్6 890 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించిన కెటిఎమ్

కొత్త 2021 కెటిఎమ్ అడ్వెంచర్ 890 మోటార్‌సైకిళ్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త బిఎస్6 2021 కెటిఎమ్ 890 అడ్వెంచర్ ఆర్ మరియు 890 అడ్వెంచర్ ర్యాలీ ఆర్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లు రెండూ చాలా అద్భుతంగా కనిపిస్తాయి మరియు ఇవి రెండూ కూడా అత్యుత్తమ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. సమీప భవిష్యత్తులో ఎప్పుడైనా అడ్వెంచరస్ మోటార్‌సైకిళ్లు భారత మార్కెట్‌లోకి ప్రవేశించాలని మేము కోరుకుంటున్నాము.

MOST READ:భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

Most Read Articles

English summary
KTM has taken the wraps off the new 890 Adventure and the limited edition 890 Adventure Rally R. Both motorcycles borrow the design and styling cues from the KTM 790 Adventure. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X