భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త సిఎఫ్‌ మోటో 300 ఎస్‌ఆర్ బైక్

భారత మార్కెట్లో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సిఎఫ్ మోటో 300 ఎస్ఆర్ బైక్ ఈ ఏడాది విడుదల కానుంది. కొత్త 300 ఎస్‌ఆర్ బైక్ ఈ బ్రాండ్ సిరీస్‌లో 300 NK నేకెడ్ ఫేర్డ్ ఎడిషన్ యొక్క నవీనీకరణ. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త సిఎఫ్‌ మోటో 300 ఎస్‌ఆర్ బైక్

సిఎఫ్‌ మోటో 300 ఎస్‌ఆర్ బైక్‌ను ఇప్పటికే వియత్నాం వంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేశారు. ఈ బైక్ ఎగుమతి ఇప్పటికే చైనాలో ప్రారంభమైంది. ఇది త్వరలో దేశీయ మార్కెట్లో కూడా అడుగుపెట్టనుంది. సిఎఫ్ మోటో 300 ఎస్ఆర్ బైక్ ఇప్పటికే భారత మార్కెట్లో లాంచ్ అయి ఉండాలి. కానీ కరోనా ఇన్ఫెక్షన్ వల్ల కొత్త బైక్ విడుదల కాస్త వాయిదా పడింది.

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త సిఎఫ్‌ మోటో 300 ఎస్‌ఆర్ బైక్

కొత్త సిఎఫ్‌ మోటో 300 ఎస్‌ఆర్ బైక్‌లో 292.4 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 8,750 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 28 బిహెచ్‌పి శక్తిని, 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 25.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ స్టాండర్డ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

MOST READ:రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ?

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త సిఎఫ్‌ మోటో 300 ఎస్‌ఆర్ బైక్

ఈ బైక్ లో ఉన్న ఇంజిన్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ కూడా కలిగి ఉంది. ఈ బైక్‌ రైడింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. అంతే కాకుండా ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా అధిక పనితీరును కూడా అందిస్తుంది.

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త సిఎఫ్‌ మోటో 300 ఎస్‌ఆర్ బైక్

ఈ బైక్ యొక్క రూపకల్పన విషయానికొస్తే సిఎఫ్ మోటో 300 ఎస్ఆర్ బైక్ ట్విన్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో చాలా దూకుడుగా ఉంటుంది. ఈ బైక్ కార్బన్-ఫైబర్ ముగింపును కూడా కలిగి ఉంటుంది.

MOST READ:కరోనా టెస్ట్ చేసుకోవడానికి ఇలా కూడా చేస్తారా..?

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త సిఎఫ్‌ మోటో 300 ఎస్‌ఆర్ బైక్

కొత్త సిఎఫ్ ‌మోటో 300 ఎస్‌ఆర్ బైక్‌లో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ బైక్‌లో స్ప్లిట్ సీట్, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, అండర్బెల్లీ ఎగ్జాస్ట్ మరియు రియర్ వ్యూ మిర్రర్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ బైక్ పుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. ఇన్స్ ట్రూమెంట్ కన్సోల్‌లో బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీ ఉండవచ్చునని ఆశించవచ్చు.

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త సిఎఫ్‌ మోటో 300 ఎస్‌ఆర్ బైక్

కొత్త సిఎఫ్ ‌మోటో 300 ఎస్‌ఆర్‌లో బైక్ అప్ ఫ్రంట్ (యుఎస్‌డి) అప్-సైడ్-డౌన్ ఫోర్కులు మరియు వెనుక మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. ఈ బైక్‌కు రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ కూడా ఈ బైక్ లో అందించబడుతుంది.

MOST READ:ఇండియాలో కార్ కేర్ ప్రొడక్ట్ లాంచ్ చేసిన టర్టల్ వాక్స్

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త సిఎఫ్‌ మోటో 300 ఎస్‌ఆర్ బైక్

భారత మార్కెట్లో కొత్త సిఎఫ్‌ మోటో 300 ఎస్‌ఆర్ బైక్‌ను విడుదల చేసిన తర్వాత టివిఎస్ అపాచీ ఆర్‌ఆర్ 310, కెటిఎం ఆర్‌సి 390, కవాసాకి నింజా 400 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #cfmoto
English summary
CFMoto 300SR Fully-Faried Motorcycle Expected To Arrive In India By This Year. Read in Telugu.
Story first published: Saturday, June 20, 2020, 17:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X