బెనెల్లీ ఇంపీరియల్ బైక్‌ను సొంతం చేసుకోవటానికి ఇదే బెస్ట్ ఆఫర్!

ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న "ఇంపీరియల్ 400" మోటార్‌సైకిల్ కోసం కంపెనీ ఓ కొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న ఈ కొత్త ఫైనాన్స్ స్కీమ్‌తో ఇప్పుడు అత్యల్పంగా కేవలం రూ.4,999 ఈఎమ్ఐతో ఈ మోటార్‌సైకిల్‌ను సొంతం చేసుకోవచ్చు.

బెనెల్లీ ఇంపీరియల్ బైక్‌ను సొంతం చేసుకోవటానికి ఇదే బెస్ట్ ఆఫర్!

అంతేకాకుండా, బెనెల్లీ ఇంపీరియల్ 400 మోటార్‌సైకిల్‌పై కంపెనీ ఇప్పుడు గరిష్టంగా 85 శాతం ఫండింగ్‌ను అందిస్తోంది. ఈ కొత్త ఫైనాన్స్ స్కీమ్‌తో ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్‌లో ఈ మోటార్‌సైకిల్ అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

బెనెల్లీ ఇంపీరియల్ బైక్‌ను సొంతం చేసుకోవటానికి ఇదే బెస్ట్ ఆఫర్!

బెనెల్లీ ఈ ఏడాది జూలై నెలలో ఇంపీరియల్ 400 బిఎస్6 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో బిఎస్6 బెనెల్లీ ఇంపీరియల్ 400 మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ (ఇండియా) ధర రూ.1.99 లక్షలుగా ఉంది. బిఎస్4 మోడల్‌తో పోల్చుకుంటే బిఎస్6 మోడల్ ధరను కంపెనీ రూ.20,000 మేర పెంచింది.

MOST READ:మరో వాహనాన్ని కాఫీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ వాహనంలో తెలుసా ?

బెనెల్లీ ఇంపీరియల్ బైక్‌ను సొంతం చేసుకోవటానికి ఇదే బెస్ట్ ఆఫర్!

కొత్త బెనెల్లీ ఇంపీరియల్ 400 బిఎస్6 మోటార్‌సైకిల్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌లో కానీ లేదా భారతదేశం అంతటా ఉన్న ఏదైనా బ్రాండ్ డీలర్‌షిప్ ద్వారా రూ.6,000 టోకెన్ అమౌంట్‌ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ మోటార్‌సైకిల్ 3 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ మరియు కంపెనీ నుండి 2 సంవత్సరాల కాంప్లిమెంటరీ సర్వీస్‌తో అందిస్తున్నారు.

బెనెల్లీ ఇంపీరియల్ బైక్‌ను సొంతం చేసుకోవటానికి ఇదే బెస్ట్ ఆఫర్!

బెనెల్లీ ఇంపీరియల్ 400 మోటార్‌సైకిల్‌లో 374సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 20 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 29 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఇది చూసారా..కష్టాలను ఎదుర్కొని పరీక్షలో 87% మార్కులు సాధించి రూ. 25 వేల బహుమతి గెలిచిన విద్యార్ధి కథ

బెనెల్లీ ఇంపీరియల్ బైక్‌ను సొంతం చేసుకోవటానికి ఇదే బెస్ట్ ఆఫర్!

ఈ మోటార్‌సైకిల్‌లో గుండ్రటి హెడ్‌ల్యాంప్‌, టెయిల్ లాంప్స్ మరియు టర్న్-ఇండికేటర్లతో ఇది క్లాసిక్-రెట్రో రూపాన్ని కలిగి ఉంటుంది. ఇంపీరియల్ 400లోని హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్స్, ఎగ్జాస్ట్, వీల్స్ మొదలైన వాటిని క్రోమ్‌తో గార్నిష్ చేయబడి ఉంటాయి.

దీని ఇంధన ట్యాంక్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ రెట్రో-క్లాసిక్ డిజైన్‌కు మరింత వన్నె తెస్తాయి. ఇందులోని డబుల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో చిన్నపాటి టిఎఫ్‌టి డిస్‌ప్లే ఉంటుంది. ఇధి ఓడో మీటర్ మరియు ట్రిప్-మీటర్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది.

బెనెల్లీ ఇంపీరియల్ బైక్‌ను సొంతం చేసుకోవటానికి ఇదే బెస్ట్ ఆఫర్!

బెనెల్లీ ఇంపీరియల్ 400 ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీలోడెడ్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన డ్యూయెల్-షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంచాయి. మెరుగైన భద్రత కోసం ఇది డ్యూయెల్-ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:పాత స్కూటర్‌తో తల్లిని తీర్థయాత్రలకు తీసుకెళ్లిన కొడుక్కి KUV100 గిఫ్ట్ గా ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

బెనెల్లీ ఇంపీరియల్ బైక్‌ను సొంతం చేసుకోవటానికి ఇదే బెస్ట్ ఆఫర్!

బెనెల్లీ ఇంపీరియల్ 400 సిల్వర్, బ్లాక్ మరియు రెడ్ అనే మూడు రంగులో లభిస్తుంది. బ్లాక్ అండ్ రెడ్ పెయింట్ స్కీమ్స్ సిల్వర్ కలర్ కంటే 10,000 రూపాయలు ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.

బెనెల్లీ ఇంపీరియల్ 400 మోటార్‌సైకిల్ ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350, జావా 350 మరియు ఫోర్టీ టూ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. అయితే, ఈ విభాగంలో త్వరలోనే మరిన్ని కొత్త మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్, హోండా హెచ్'నెస్ అనే రెండు కొత్త మోడళ్లు విడుదల కానున్నాయి.

బెనెల్లీ ఇంపీరియల్ బైక్‌ను సొంతం చేసుకోవటానికి ఇదే బెస్ట్ ఆఫర్!

బెనెల్లీ ఇంపీరియల్ 400 ఈఎమ్ఐ ఆఫర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బెనెల్లీ ఇంపీరియల్ 400 మోటార్‌సైకిల్‌ను సొంతం చేసుకోవటానికి ఇదొక చక్కటి అవకాశం. నెలకు కేవలం 5 వేల రూపాయల మొత్తాన్ని చెల్లిస్తూ ఈ మోటార్‌సైకిల్‌ను దక్కించుకోవచ్చు. అలాగే, ఈ మోడల్‌పై కంపెనీ 85 శాతం వరకూ ఫండింగ్‌ను అందిస్తోంది.

MOST READ:దుమ్మురేపుతున్న ఫార్చ్యూనర్ లెజెండరీ ఎస్‌యూవీ ఆఫ్ రోడ్ పెర్ఫార్మెన్స్ వీడియో

Most Read Articles

English summary
Benelli has announced a new finance scheme for its Imperiale 400 motorcycle in the Indian market. With the new finance scheme, the company aims to boost sales of its only motorcycle during the ongoing festive season in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X