కెటిఎమ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. బడ్జెట్ ఫ్రెండ్లీ 2021 డ్యూక్ 125 వస్తోంది..

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ డ్యూక్ 125లో కంపెనీ ఓ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఆటోకార్ ఇండియా నుండి వచ్చిన నివేదికల ప్రకారం, కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125, ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానున్నట్లు సమాచారం.

కెటిఎమ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. బడ్జెట్ ఫ్రెండ్లీ 2021 డ్యూక్ 125 వస్తోంది..

ఈ నేపథ్యంలో, కెటిఎమ్ డీలర్‌షిప్ కేంద్రాల్లో ఇప్పటికే కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125 కోసం బుకింగ్‌లను స్వీకరించడం కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. లీకైన చిత్రాలను బట్టి చూస్తుంటే, కొత్త డ్యూక్ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది.

కెటిఎమ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. బడ్జెట్ ఫ్రెండ్లీ 2021 డ్యూక్ 125 వస్తోంది..

గమనిక: మునుపటి తరం డ్యూక్ 125 చిత్రాలను ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించబడ్డాయి.

కెటిఎమ్ డ్యూక్ 200 మోడల్ నుండి స్ఫూర్తి పొంది కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125ను రీడిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఈ పెద్ద మోటార్‌సైకిళ్లలో ఉపయోగించిన అనేక భాగాలు డ్యూక్ 125లోనూ కనిపించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్‌లైట్స్, ఫ్యూయల్ ట్యాంక్, ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ మరియు టెయిల్ ప్యానెల్స్‌తో మరియు ఎల్‌సిడి స్క్రీన్ మొదలైనవి ఉండొచ్చని అంచనా.

MOST READ:బ్రేకింగ్ న్యూస్.. త్వరలో పెరగనున్న మహీంద్రా థార్ ధర : వివరాలు

కెటిఎమ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. బడ్జెట్ ఫ్రెండ్లీ 2021 డ్యూక్ 125 వస్తోంది..

డ్యూక్ 125 లేటెస్ట్ డిజైన్ మరియు పరికరాలను దాని పెద్ద మోటార్‌సైకిళ్ల నుండి గ్రహించినప్పటికీ, దాని బాడీ గ్రాఫిక్స్ మరియు పెయింట్ స్కీమ్ ఆప్షన్లు మాత్రం భిన్నంగా ఉంటాయి. కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125లో ప్రధానంగా చేయబోయే డిజైన్ అప్‌గ్రేడ్స్ ఖచ్చితంగా యువ రైడర్లను ఆకర్షించడంలో సహాయపడుతుంది.

కెటిఎమ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. బడ్జెట్ ఫ్రెండ్లీ 2021 డ్యూక్ 125 వస్తోంది..

కొత్త 2021 డ్యూక్ 125 దాని బిగ్ బ్రదర్ అయిన డ్యూక్ 200 మాదిరిగానే అదే ట్రేల్లిస్ ఫ్రేమ్, సస్పెన్షన్ సెటప్ మరియు బ్రేకింగ్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. కాగా, ఈ మోటార్‌సైకిల్‌లో చేసిన ఖచ్చితమైన కాస్మెటిక్ మరియు డిజైన్ మార్పుల వివరాలు భారత మార్కెట్లో ఇది విడుదల కాబోయే సమయంలో అధికారికంగా తెలియనున్నాయి.

MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

కెటిఎమ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. బడ్జెట్ ఫ్రెండ్లీ 2021 డ్యూక్ 125 వస్తోంది..

ఇకపోతే, ఇంజన్ పరంగా, కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 125లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇందులో ఇదివరకటి బిఎస్6 కంప్లైంట్ 124 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 14.5 బిహెచ్‌పి పవర్‌ను మరియు 12 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానించబడి ఉంటుంది.

కెటిఎమ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. బడ్జెట్ ఫ్రెండ్లీ 2021 డ్యూక్ 125 వస్తోంది..

కెటిఎమ్ ఇండియా బ్రాండ్ లైనప్‌లో పాత డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉన్న ఏకైక మోడల్ కెటిఎమ్ డ్యూక్ 125 మాత్రమే. కెటిఎమ్ డ్యూక్ 200ను ఈ ఏడాది ప్రారంభంలో బిఎస్6 అప్‌డేట్‌తో పాటుగా కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేసి కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. ఇది మునుపటి కన్నా మరింత స్పోర్టీగా మరియు అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో, కొత్తగా రానున్న ఎంట్రీ లెవల్ కెటిఎమ్ డ్యూక్ 125 కూడా దాని బిగ్ బ్రదర్ మాదిరిగానే అదే విధమైన డిజైన్ లాంగ్వేజ్‌ను అనుసరిస్తుందని అంచనా.

MOST READ:బెంగళూరులో అమలుకానున్న కొత్త పార్కింగ్ విధానం : పూర్తి వివరాలు

కెటిఎమ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. బడ్జెట్ ఫ్రెండ్లీ 2021 డ్యూక్ 125 వస్తోంది..

కెటిఎమ్ డ్యూక్ 125 మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్ళలో కెటిఎ్మ డ్యూక్ 125 ఒకటి. కొత్తగా రానున్న 2021 కెటిఎమ్ డ్యూక్ 125 దాని రిఫ్రెష్డ్ డిజైన్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ మరియు స్మార్ట్ ఫీచర్లతో మొదటిసారి మోటారుసైకిల్ కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

Source: Autocar India

Most Read Articles

English summary
Austrian sports bike maker KTM is said to be working on an all-new 2021 Duke 125. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X