భారత మార్కెట్‌కు రానున్న కొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 ఫేస్‌లిఫ్ట్!

ప్రముఖ స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ ఎమ్‌వి అగస్టా తమ సరికొత్త 2021 'ఎఫ్3 800' మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. మునపటి వెర్షన్‌తో పోల్చుకుంటే డిజైన్, ఇంజన్, ఫీచర్లలో అదనపు మార్పులు చేర్పులు చేసిన ఓ కొత్త ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 బైక్ కంపెనీ వచ్చే ఏడాది ఆరంభం నాటికి దేశీయ విపణిలో విడుదల చేయనుంది.

భారత మార్కెట్‌కు రానున్న కొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 ఫేస్‌లిఫ్ట్!

భారత మార్కెట్లో తమ సరికొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 ఎట్రీని కంపెనీ సిఈఓ టిమూర్ సర్డరోవ్ ధృవీకరించారు. ఎమ్‌వి అగస్టా బ్రాండ్ అధికారిక సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆయన నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కొత్త మోటార్‌సైకిల్ గురించి ఆయన టెక్నికల్ వివరాలు వెల్లడించక పోయినప్పటికీ, కొత్త ఎఫ్3 800 మాత్రం 2021 ప్రారంభంలో విడుదల చేయవచ్చని ధృవీకరించారు.

భారత మార్కెట్‌కు రానున్న కొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 ఫేస్‌లిఫ్ట్!

గత కొంత కాలంగా భారత మార్కెట్లో ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 బైక్ అమ్మకానికి ఉంది. సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ బైక్ ప్రస్తుతం దేశంలో లభిస్తున్న బెస్ట్ లుకింగ్ మోటర్‌సైకిళ్లలో ఒకటిగా నిలుస్తుంది. అయితే, ప్రస్తుతం దేశీయ విపణిలో ఈ సెగ్మెంట్లో పోటీ నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో, ఎమ్‌వి అగస్టా ఈ మోడల్‌లో ఓ సరికొత్త వెర్షన్‌ను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

MOST READ: మీ ఐఫోన్‌తో మీ BMW కారుని అన్‌లాక్ చేయొచ్చు; ఎలాగో తెలుసా..?

భారత మార్కెట్‌కు రానున్న కొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 ఫేస్‌లిఫ్ట్!

టెక్నికల్ ఫీచర్ల పరంగా ఈ మోడల్‌లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది, అయితే ఓవరాల్ లుక్ అండ్ ఫీల్‌లో పెద్దగా మార్పు ఉండబోదని అనిపిస్తోంది. కొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 బైక్‌లో ఆధునిక ఫీచర్లు, పరికరాలను చేర్చనున్నారు. అలాగే ఎలక్ట్రానిక్స్‌లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి.

భారత మార్కెట్‌కు రానున్న కొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 ఫేస్‌లిఫ్ట్!

కొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 బైక్‌లో చేయబోయే కొన్ని ప్రధాన మార్పుల్లో సరికొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి టర్న్ ఇండికేటర్స్, ఫుల్-కలర్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మొదలైనవి ఉండొచ్చని అంచనా.

MOST READ: మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

భారత మార్కెట్‌కు రానున్న కొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 ఫేస్‌లిఫ్ట్!

ఈ ఆధునిక మోటార్‌సైకిల్‌లో చేర్చబోయే ఎలక్ట్రానిక్ పరికరాల విషయానికి వస్తే, ఇందులో ఐఎమ్‌యూ, స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబిఎస్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్‌తో పాటుగా బహుశా ఇందులో టూ-వే క్విక్‌షిఫ్టర్‌లు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత మార్కెట్‌కు రానున్న కొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 ఫేస్‌లిఫ్ట్!

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 మోడల్‌లో 798సీసీ త్రీ-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 13,000rpm వద్ద 150bhp శక్తిని మరియు 10,500rpm వద్ద 88Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాగా.. కొత్త 2021 మోడల్‌లో కంపెనీ ఇదే ఇంజన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉంది, కాకపోతే ఇందులో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉంది.

MOST READ: బిడది ప్లాంట్‌లో టొయోటా సేవలు పునఃప్రారంభం

భారత మార్కెట్‌కు రానున్న కొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 ఫేస్‌లిఫ్ట్!

కొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 బైక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త 20210 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇండియా మార్కెట్‌కి రావటానికి మరికొన్ని నెలల సమయం పట్టే ఆస్కారం ఉంది. ఇది ప్రీమియం మోటార్‌సైకిల్ కావటంతో, ఇందులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక సాంకేతికతలను కంపెనీ జోడించే ఆస్కారం ఉంది, ఫలితంగా దీని ధర కూడా పెరగవచ్చని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 ధర సుమారు రూ.18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Most Read Articles

English summary
MV Agusta is said to be working on introducing a slew of updates to its F3 800 model in the Indian market. The MV Agusta F3 800 is said to receive a major update in the country and is expected to go on sale sometime in early-2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X