టీవీఎస్ భాగస్వామ్యం నుండి రానున్న నార్టన్ వి4 ఆర్ఆర్ సూపర్‌బైక్

టీవీఎస్-యాజమాన్యంలోని నార్టన్ మోటార్‌సైకిల్స్ తమ కొత్త సూపర్‌బైక్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఏడాది చివరిలోపుగా నార్టన్ బ్రాండ్ తమ మొదటి సూపర్ బైక్ 2021 వి4 ఆర్‌ఆర్ మోడల్‌ను ఆవిష్కరిస్తుందని కంపెనీ సీఈఓ జాన్ రస్సెల్ ధృవీకరించారు.

టీవీఎస్ భాగస్వామ్యం నుండి రానున్న నార్టన్ వి4 ఆర్ఆర్ సూపర్‌బైక్

కొత్త 2021 నార్టన్ వి4 ఆర్ఆర్ మోటార్‌సైకిల్ ‘2021 లో వస్తోంది' అనే ప్రకటనతో బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో కూడా లిస్ట్ చేయబడింది. ఐల్ ఆఫ్ మ్యాన్ టిటిలో తన అనుభవాన్ని ఉపయోగించి నార్టన్ బ్రాండ్ తమ కొత్త నార్టన్ వి4 ఆర్ఆర్‌ను సృష్టించింది.

టీవీఎస్ భాగస్వామ్యం నుండి రానున్న నార్టన్ వి4 ఆర్ఆర్ సూపర్‌బైక్

సరికొత్త 2021 నార్టన్ వి4 ఆర్‌ఆర్ సూపర్‌బైక్ 1200సిపి వి4 ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 12,500 ఆర్‌పిఎమ్ వద్ద 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:ఏనుగులను రక్షించడానికి ట్రైన్ ఆపేసిన లోకో పైలెట్; ఎక్కడో తెలుసా ?

టీవీఎస్ భాగస్వామ్యం నుండి రానున్న నార్టన్ వి4 ఆర్ఆర్ సూపర్‌బైక్

ఈ మోటార్‌సైకిల్‌లో ఏడు అంగుళాల హెచ్‌డి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, బ్రెంబో బ్రేక్‌లు మరియు రెండు చివర్లలో పూర్తి ఓహ్లిన్స్ సస్పెన్షన్ సెటప్‌తో సహా అనేక పరికరాలు మరియు సాంకేతికతలతో నిండి ఉంటుంది. అలాగే, టీజర్ల నుండి చూసినట్లుగా, 2021 నార్టన్ వి4 ఆర్ఆర్ పూర్తి కార్బన్-ఫైబర్ బాడీని కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.

టీవీఎస్ భాగస్వామ్యం నుండి రానున్న నార్టన్ వి4 ఆర్ఆర్ సూపర్‌బైక్

ఈ విషయం గురించి నార్టన్ మోటార్‌సైకిల్స్ సీఈఓ జాన్ రస్సెల్ మాట్లాడుతూ, "మోటార్‌సైకిల్ పరిశ్రమలో నార్టన్ వంటి గొప్ప బ్రాండ్‌లను కొనుగోలు చేసే అవకాశం తరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది, అందుకే టీవీఎస్ నార్టన్‌ను కొనుగోలు చేసింది. ఈ రెండు బ్రాండ్ల కలయికతో మేము ఓ సుధీర్ఘమైన ప్రస్థానాన్ని అన్‌లాక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరికొద్ది రోజుల్లోనే మేము ఏం చేయగలమనేది మార్కెట్‌కు రుచి చూపిస్తామని" ఆయన చెప్పారు.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

టీవీఎస్ భాగస్వామ్యం నుండి రానున్న నార్టన్ వి4 ఆర్ఆర్ సూపర్‌బైక్

భారత్‌లో కొత్త 2021 నార్టన్ వి4 ఆర్ఆర్ బ్రాండ్ యొక్క మొట్టమొదటి మోటార్‌సైకిల్ సమర్పణ అవుతుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో నార్టన్ బ్రాండ్‌ని కొనుగోలు చేసింది. హోసూర్‌కి చెందిన టీవీఎస్ బ్రాండ్ దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటిగా ఉంది. టీవీఎస్ ఈ బ్రిటిష్ బ్రాండ్‌ను జిబిపి 16 మిలియన్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

టీవీఎస్ భాగస్వామ్యం నుండి రానున్న నార్టన్ వి4 ఆర్ఆర్ సూపర్‌బైక్

నార్టన్ నుండి రాబోయే కొత్త వి4 ఆర్ఆర్ సూపర్‌బైక్‌ను కంపెనీ రాబోయే వారాల్లో ఎప్పుడైనా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఆ తర్వాత 2021లో ఇది అధికారికంగా అందుబాటులోకి రానుంది. ఈ మోడల్‌ను కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.

MOST READ:కిడ్నీ తరలించడానికి లంబోర్ఘిని కారు ఉపయోగించిన పోలీసులు.. ఎక్కడో తెలుసా?

టీవీఎస్ భాగస్వామ్యం నుండి రానున్న నార్టన్ వి4 ఆర్ఆర్ సూపర్‌బైక్

టీవీఎస్ - 2021 నార్టన్ వి4 సూపర్‌బైక్ ఆవిష్కరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టీవీఎస్ యాజమాన్యం నుండి వస్తున్న కొత్త 2021 నార్టన్ వి4 ఆర్ఆర్, ఈ ఉమ్మడి బ్రాండ్ యొక్క మొట్టమొదటి మోటార్‌సైకిల్‌గా రానుంది. ఒకవేళ ఈ మోడల్ భారత మార్కెట్లో అడుగుపెడితే, ఇది టీవీఎస్ ఘనతను మరింత పెంచే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Under its new TVS-ownership, Norton Motorcycles is all set to unveil its first motorcycle the 2021 V4 RR before the end of this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X