తమిళనాడులో అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీని పెట్టనున్న ఓలా ; వివరాలు

దేశంలో అతిపెద్ద మొబిలిటీ ప్రొవైడర్ సంస్థ ఓలా, భారతదేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం ఓలా రాష్ట్రంలో 2,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కర్మాగారాన్ని స్థాపించడానికి సిద్దమైంది.

తమిళనాడులో అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీని పెట్టనున్న ఓలా ; వివరాలు

ఓలా స్థాపించనున్న ఈ కర్మాగారం నిర్మాణం పూర్తయిన తర్వాత సుమారు 10,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించబడతాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రకారం, ఈ తయారీ కర్మాగారం ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ కేంద్రంగా ఉండబోతోంది. ఇందులో ఏటా 2 లక్షల యూనిట్ల ద్విచక్ర వాహనాలు తయారు చేయబడతాయి.

తమిళనాడులో అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీని పెట్టనున్న ఓలా ; వివరాలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకారం, ఓలా యొక్క కర్మాగారం, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని సృష్టించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించగలదు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, స్థానిక తయారీని ప్రోత్సహించడం, ఉద్యోగాలు సృష్టించడం వంటి పెద్ద రంగాలలో ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది.

MOST READ:డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

తమిళనాడులో అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీని పెట్టనున్న ఓలా ; వివరాలు

ఈ కర్మాగారం దేశంలో సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి చాలాబాగా ఉపయోగపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కర్మాగారం భారతదేశం యొక్క పర్యావరణ వ్యవస్థను సక్రియం చేస్తుంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో భారతదేశాన్ని ఇతర దేశాలకు కూడా ఆదర్శప్రాయంగా ఉండే విధంగా చేస్తుంది.

తమిళనాడులో అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీని పెట్టనున్న ఓలా ; వివరాలు

భారతదేశం తన ప్రత్యేక నైపుణ్యాలు, మానవశక్తి మరియు జనాభాతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రపంచ కేంద్రంగా ఉందని ఓలా అభిప్రాయపడ్డారు. ఓలా యొక్క కర్మాగారం భారతదేశంలో మాత్రమే కాకుండా యూరప్, ఆసియా, లాటిన్ అమెరికా మరియు ప్రపంచవ్యాప్త మార్కెట్లలో కూడా వినియోగదారుల డిమాండ్‌ను తీర్చనుంది.

MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

తమిళనాడులో అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీని పెట్టనున్న ఓలా ; వివరాలు

రాబోయే నెలల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మొదటి శ్రేణిని విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది. దీనిపై ఓలా చైర్మన్ మరియు సిఇఒ 'భవీష్ అగర్వాల్' మాట్లాడుతూ "ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనే మా ప్రణాళికలను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు.

తమిళనాడులో అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీని పెట్టనున్న ఓలా ; వివరాలు

ఇది ఓలాకు నిజంగా ఒక గొప్ప సదావకాశం అనే చెప్పాలి. మేము వినియోగదారుల అవసరాలకు అనుకూలంగా వాహనాలను తాయారు చేస్తాము, ఇది ఎలక్ట్రిక్ విభాగంలో దేశానికీ గర్వకారణంగా తీర్చి దిద్దుతామని అయన అన్నారు. ఏది ఏమైనా అలా మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం వల్ల చాలామందికి ఉపాధి కల్పించడంతో పాటు, మన దేశం కూడా ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఇతరదేశాలకు పోటీ ఇవ్వగలదు.

MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

Most Read Articles

English summary
Ola Plans To Set Up World’s Largest Scooter Factory In TamilNadu. Read in Telugu.
Story first published: Monday, December 14, 2020, 18:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X