హైదరాబాద్‌లో 'క్రీడాన్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్; అత్యంత శక్తివంతమైన బైక్

నోయిడాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'వన్ ఎలక్ట్రిక్' తమ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ 'క్రీడాన్' డెలివరీలను హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల్లో ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ తర్వాతి దశల్లో దీనిని తమిళనాడు మరియు కేరళ నగరాల్లో డెలివరీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

హైదరాబాద్‌లో 'క్రీడాన్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్; అత్యంత శక్తివంతమైన బైక్

వన్ క్రీడాన్ ఎలక్ట్రిక్ బైక్‌ను రూ.1.29 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరతో ప్రవేశపెట్టారు. మెట్రో నగరాల నుండి ఈ మోడల్‌కు మంచి స్పందన లభిస్తోందని, ఈ నగరాల్లో బైక్‌ల ప్రీ-బుకింగ్ కూడా ప్రారంభించామని, ప్రీ బుకింగ్స్ కోసం కస్టమర్‌లు ఎటువంటి డిపాజిట్ మొత్తాన్ని జమ చేయవలసిన అవసరం లేదని కంపెనీ తెలిపింది.

హైదరాబాద్‌లో 'క్రీడాన్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్; అత్యంత శక్తివంతమైన బైక్

వన్ ఎలక్ట్రిక్ విడుదల చేసిన క్రీడాన్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 95 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. ఈ బైక్ ఎకో మోడ్‌పై 110 కిలోమీటర్లు మరియు సాధారణ మోడ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ కేవలం 8 సెకన్లలో గంటకు 0 - 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

MOST READ:3 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లగ్జరీ కార్‌లో కనిపించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ కార్ ఏదో మీరూ చూడండి

హైదరాబాద్‌లో 'క్రీడాన్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్; అత్యంత శక్తివంతమైన బైక్

వన్ క్రీడాన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 5.5 కిలోవాట్ల శక్తిని మరియు 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ముందు వైపు 240 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇవి రెండూ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి.

హైదరాబాద్‌లో 'క్రీడాన్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్; అత్యంత శక్తివంతమైన బైక్

ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ మరయి వెనుక వైపు హైడ్రాలిక్ ట్విన్ షాక్ అబ్జార్వర్స్ ఉంటాయి. ఇందులో ముందు వైపు 80-100 / 17 ప్రొఫైల్ టైర్లను మరియు వెనుక వైపు 120-80 / 17 టైర్లను అమర్చారు.

MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

హైదరాబాద్‌లో 'క్రీడాన్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్; అత్యంత శక్తివంతమైన బైక్

వన్ ఎలక్ట్రిక్ వచ్చే నెలలో (జనవరి 2021లో) తమిళనాడు మరియు కేరళలో క్రీడాన్ డెలివరీలను ప్రారంభిస్తుంది, ఆ తర్వాత మహారాష్ట్ర మరియు ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతాల్లో దీని డెలివరీలను ప్రారంభించనుంది.

హైదరాబాద్‌లో 'క్రీడాన్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్; అత్యంత శక్తివంతమైన బైక్

వన్ ఎలక్ట్రిక్ అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను సుమారు 80 శాతం వరకూ స్థానికీకరించిన భాగాల నుండి తయారు చేస్తున్నారు. ఈ మోటార్‌సైకిల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇప్పుడు దీని ఉత్పత్తిని వేగవంతం చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం వన్ ఎలక్ట్రిక్ నెలకు 1000 యూనిట్ల క్రీడాన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

MOST READ:సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

హైదరాబాద్‌లో 'క్రీడాన్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్; అత్యంత శక్తివంతమైన బైక్

క్రీడాన్ బైక్‌కు పలు అంతర్జాతీయ మార్కెట్లలో సైతం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు కంపెనీ చేస్తోంది. ఈ నేపథ్యంలో, పలువురు అంతర్జాతీయ క్లయింట్ల నుంచి తమకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్‌లోని పలువురు భాగస్వాములతో కంపెనీ చర్చలు జరుపుతోందని వన్ ఎలక్ట్రిక్ పేర్కొంది. ఇది 165 న్యూటన్ మీటర్ల టార్క్‌తో ఈ విభాగంలోనే అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్‌గా ఉంది.

హైదరాబాద్‌లో 'క్రీడాన్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్; అత్యంత శక్తివంతమైన బైక్

ఈ మోటార్‌సైకిల్ డెలివరీలను ప్రారంభించిన సందర్భంగా, వన్ ఎలక్ట్రిక్ సీఈఓ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల నుండి వచ్చిన ప్రీ-బుకింగ్స్ చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని, ఈ ఎలక్ట్రిక్ బైక్ టెస్ట్ రైడ్‌లు మరియు డీలర్‌షిప్‌ల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ పవర్, స్పీడ్ మరియు పనితీరు పట్ల వినియోగదారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

MOST READ:సినిమాను సైతం తలదన్నే వోల్వో కొత్త ట్రక్ వీడియో.. చూసారా ?

హైదరాబాద్‌లో 'క్రీడాన్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్; అత్యంత శక్తివంతమైన బైక్

ఎలాంటి గేర్లు ఉపయోగించకుండా శక్తివంతమైన మోటార్‌సైకిల్‌ను రైడ్ చేస్తున్న అనుభూతిని అందించే ఈ క్రీడాన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పట్ల వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, పెట్రోల్ వాహనాలతో పోల్చుకుంటే దీని మొత్తం నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.

Most Read Articles

English summary
One Electric Begins Deliveries of Kridn Electric Bike In Hyderabad and Bangalore. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X