Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 4 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ ; ధర & వివరాలు
భారత మార్కెట్లో పియాజియో ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ ని భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బ్రాండ్ యొక్క ప్రీమియం స్కూటర్ ఆఫర్. ఈ స్కూటర్ ధర 1,25,997 రూపాయలు (ఎక్స్-షోరూమ్, పూణే).

ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ప్రీమియం స్కూటర్‌ను మొదటిసారి 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. సాధారణంగా ఈ మ్యాక్సీ స్కూటర్ ప్రారంభంలో ముందుగా ప్రారంభించటానికి ప్రణాళిక చేయబడింది. ఎస్ఎక్స్ఆర్ 160 బ్రాండ్ యొక్క సరికొత్త మ్యాక్సీ-స్కూటర్ డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంది. ఇది అనేక ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంది.

ఈ కొత్త స్కూటర్ యొక్క డిజైన్ ని గమనించినట్లయితే ఇందులో పెద్ద ఆప్రాన్ హౌసింగ్ స్ప్లిట్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు మరియు ఫ్రంట్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్లను కలిగి ఉంది. ఈ స్కూటర్ ముందు భాగంలో విండ్‌స్క్రీన్, పెద్ద సింగిల్-పీస్ సీట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లతో ఇది చాలా ఆకర్షణీయమైన స్టైలింగ్ ని కలిగి ఉంది.
MOST READ:సినిమాను సైతం తలదన్నే వోల్వో కొత్త ట్రక్ వీడియో.. చూసారా ?

ఇక ఎస్ఎక్స్ఆర్ 160 యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో మల్టీఫంక్షనల్ పుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది మైలేజ్ ఇండికేటర్, ఆర్‌పిఎం మీటర్, యావరేజ్ మరియు టాప్ స్పీడ్, ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్స్ వంటివి ఉంటాయి.

ఎస్ఎక్స్ఆర్ 160 అప్సనల్ కనెక్ట్ టెక్నాలజీతో వస్తుంది, రైడర్స్ తమ స్మార్ట్‌ఫోన్‌లను స్కూటర్‌కు కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది, ఇవి మాత్రమే కాకుండా ఇందులో ఇంకా ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటాయి.
MOST READ:ప్రపంచంలోనే పురాతన కార్ల తయారీ సంస్థలు ఏవో మీకు తెలుసా.. అయితే ఇది మీకోసమే

ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 లో 160 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 10.5 బిహెచ్‌పి మరియు 11.6 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ ఏర్పాటు చేయబడింది.

ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ ముందు భాగంలో ఒక డిస్క్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేక్‌లు నిర్వహించబడతాయి. అంతే కాకుండా ఇందులో సింగిల్-ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్ గా ఉంటుంది.
MOST READ:అద్భుతంగా ఉన్న మలయాళీ స్టార్ మమ్ముట్టి లగ్జరీ కారవాన్.. చూసారా !

ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మ్యాక్సీ స్కూటర్ నాలుగు కలర్ అప్సన్స్ తో లభిస్తాయి. అవి గ్లోసి రెడ్, మాట్టే బ్లూ, గ్లోసి వైట్ మరియు మాట్టే బ్లాక్ కలర్స్.

ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 చూడటానికి చాల అద్భుతంగా ఉంటుంది. ఆధునిక యుగంలో వాహనదారులకు ఉపయోగపడే అనుకూలమైన అన్ని ఫీచర్స్ కలిగి ఉంది. ఇవన్నీ వాహనదారులను ఆకర్షించడానికి చాలా ఉపయోగపడతాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :
ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 కొంతకాలం భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియం స్కూటర్లలో ఒకటి. ఈ స్కూటర్‌కు భారతీయ మార్కెట్లో ప్రత్యర్థులు లేరు, కానీ ఇది మాక్సి-స్కూటర్ తరహా స్కూటర్ సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 కి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. రాబోయే కొత్త సంవత్సరం మరియు సంక్రాంతి సమయంలో కొత్త స్కూటర్ కొనాలనుకునే వారికి ఈ స్కూటర్ మంచి ఎంపిక అవుతుంది.