ఇప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన ప్యూర్ ఇవీ సంస్థ

హైదరాబాద్‌కు చెందిన ప్యూర్ ఇవి ఎలక్ట్రిక్ టూ వీలర్ల అంకుర సంస్థ విపణిలోకి సరికొత్త ఇప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. హైస్పీడ్ ఇప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 79,999 లుగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు.

ఇప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన ప్యూర్ ఇవీ సంస్థ

హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే అంశానికి వస్తే, ప్యూర్ ఇవి ఇప్లూటో 7జీ టాప్ స్పీడ్ గరిష్టంగా గంటకు 60కిలోమీటర్లుగా ఉంది. మరియు మరే ఇతర కంపెనీ ఇవ్వని విధంగా 40,000 కిలోమీటర్ల వారంటీ అందిస్తున్నారు.

ఇప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన ప్యూర్ ఇవీ సంస్థ

ఇప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కార్యక్రమంలో నీతి అయోగ్ సభ్యుడు వికె సర్వస్వత్, డీఆర్‌డీఓ ఛైర్మెన్ సతీష్ రెడ్డి, ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మరియు పలువురు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన ప్యూర్ ఇవీ సంస్థ

ఈ సందర్భంగా నీతియో అయోగ్ సభ్యుడు వీకె సరస్వత్ మాట్లాడుతూ, "భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే, ఇ-మొబిలిటి (ఎలక్ట్రిక్ రవాణా) దేశంలో ఒక కొత్త మోటార్ సెక్టార్. వెహికల్స్ విభాగం మాత్రమే, సప్లై చైన్ కూడా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వ్యవస్థలోకి మారాల్సిన ఆవశ్యకత ఉంది. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చారు."

ఇప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన ప్యూర్ ఇవీ సంస్థ

స్కూటర్ విషయానికొస్తే, ఇండియన్ రోడ్లు మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటరీ మరియు వెహికల్‌ను డిజైన్ చేశారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో నెలకు సుమారుగా 2,000 స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.

ఇప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన ప్యూర్ ఇవీ సంస్థ

2020 సంవత్సరం చివరి నాటికి 10,000 లకుపైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. కటింగ్-ఎడ్జ్ రీసెర్జ్ మరియు డెవలప్‌మెంట్, అధిక మొత్తంలో ఉత్పత్తి, ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీ అవసరాల కోసం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు.

ఇప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన ప్యూర్ ఇవీ సంస్థ

ప్యూర్ ఇవి ఎలక్ట్రిక్ టూ వీలర్ల సంస్థ పూర్తి స్థాయి దేశీయ టెక్నాలజీతో మన హైదరాబాద్‌‌లో కార్యకలాపాలు ప్రారంభించారు. తొలుత హైదరాబాదులోనే వీటి విక్రయాలు అధికంగా ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Pure EV launches electric scooter EPluto 7G, priced at Rs 79,999. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X