కోవిడ్-19 భయం, బైక్ టాక్సీ 'ర్యాపిడో' మారిందిలా..

దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రముఖ బైక్ టాక్సీ అగ్రిగేటర్ 'రాపిడో' తమ కెప్టెన్స్ కోసం అదనపు భద్రతను అందించేలా 'రాపిడో బ్యాక్ షీల్డ్స్'ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్యాక్ షీల్డ్స్ ద్వారా రైడర్లు మరియు కెప్టెన్లు ఇద్దరూ సురక్షితంగా ఉండవచ్చని కంపెనీ పేర్కొంది.

కోవిడ్-19 భయం, బైక్ టాక్సీ 'ర్యాపిడో' మారిందిలా..

రైడ్ కెప్టెన్లు మరియు వారి ప్రయాణీకుల మధ్య కొంతవరకు సామాజిక దూరం ఉండేలా ఈ బ్యాక్ షీల్డ్‌ను డిజైన్ చేశారు. షీల్డ్‌ను అదనంగా చేర్చడం బైక్ టాక్సీ సేవలను ఉపయోగిస్తున్నప్పుడు ప్రయాణీకుల భద్రతను పెంచే లక్ష్యంలో భాగమని కంపెనీ తెలిపింది. ఈ షీల్డ్ తేలికపాటి పివిసి బోర్డుతో తయారు చేయబడినది మరియు దీనిని కెప్టెన్ ధరించేందుకు వీలుగా బ్యాక్‌ప్యాక్ స్టైల్ స్ట్రాప్‌లను కలిగి ఉంది.

కోవిడ్-19 భయం, బైక్ టాక్సీ 'ర్యాపిడో' మారిందిలా..

ఈ పోర్టబుల్ బ్యాక్ షీల్డ్ బరువు కేవలం 400 గ్రాములు మాత్రమే మరియు కెప్టెన్ ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా దీనిని ధరించాల్సి ఉంటుంది. రైడ్ కెప్టెన్ ట్రిప్ ప్రారంభించినప్పటి నుంచి ట్రిప్ ముగించే వరకూ రైడర్ మరియు పిలియన్ రైడర్ల మధ్య నేరుగా ఎటువంటి సంబంధాన్ని లేకుండా ఉంచడంలో సహకరిస్తుంది.

MOST READ:భారత్ నుంచి బంగ్లాదేశ్‌కి చేరనున్న 51 టాటా ఏస్ ట్రక్కులు

కోవిడ్-19 భయం, బైక్ టాక్సీ 'ర్యాపిడో' మారిందిలా..

బెంగళూరుకు చెందిన బైక్ టాక్సీ అగ్రిగేటర్ తమ రైడ్ కెప్టెన్లకు ఎటువంటి అధనపు ఖర్చు లేకుండా ఈ షీల్డ్‌ను అందిస్తోంది. ఈ ప్రణాళిక ద్వారా మరింత మంది రైడర్లు ర్యాపిడ్‌ను ఆశ్రయించే అవకాశం ఉందని, ఫలితంగా ఇది కెప్టెన్లకు ఆర్థికంగా సహాయపడగలదని, రక్షణ కవచాల కోసం రైడ్ కెప్టెన్లకు పెట్టే ఖర్చును ఇది నియంత్రిస్తుందని కంపెనీ తెలిపింది.

కోవిడ్-19 భయం, బైక్ టాక్సీ 'ర్యాపిడో' మారిందిలా..

రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ శంకా మాట్లాడుతూ, "ప్రస్తుత పరిస్థితుల్లో మా కస్టమర్ల భద్రత మాకు ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం. వారు రాపిడోను ఉపయోగించినప్పుడల్లా వారు సురక్షితంగా మరియు భరోసాతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. మాస్కులు, శానిటైజర్లను ఉపయోగించడం మరియు కెప్టెన్లను క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం వంటి భద్రతా చర్యలతో పాటు తాజాగా మేము మా రైడర్ల భద్రతను మరింత పెంచే ప్రొటెక్టివ్ గేర్‌గా పనిచేసే ఈ వినూత్న బ్యాక్ షీల్డ్‌ను ఆవిష్కరించామ"ని అన్నారు.

MOST READ:బస్ చార్జీలను నిర్ణయించే కొత్త సాఫ్ట్‌వేర్, ఎక్కడో తెలుసా..!

కోవిడ్-19 భయం, బైక్ టాక్సీ 'ర్యాపిడో' మారిందిలా..

ర్యాపిడో గత కొన్ని వారాలుగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్ మరియు కోల్‌కతా వంటి నగరాల్లో తమ రైడర్ పార్ట్‌నర్స్‌తో ఈ ప్రొటెక్టివ్ షీల్డ్స్‌ను పరీక్షిస్తోంది. ఇటువంటి షీల్డ్స్‌తో కెప్టెన్లు ఇప్పటివరకు 800 లకు పైగా ట్రిప్‌లను నమోదు చేశారని కంపెనీ తెలిపింది.

రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉండే ఉత్తమమైన కవచాన్ని అందించడానికి మరియు ప్రయాణీకులకు టచ్ పాయింట్లను తగ్గించే ఉత్తమమైన కవచాన్ని అందించడానికి గానూ ఈ ప్రొటెక్టివ్ షీల్డ్ పరిమాణం, నాణ్యత మరియు ఏరోడైనమిక్స్ వంటి అంశాలపై పరీక్షలు నిర్వహించారు.

కోవిడ్-19 భయం, బైక్ టాక్సీ 'ర్యాపిడో' మారిందిలా..

ర్యాపిడో రైడ్ కెప్టెన్లు ఈ కవచాలతో పాటుగా ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, శానిటైజర్లను వెంట తీసుకెళ్లాలి మరియు రైడర్ హెల్మెట్‌తో పాటుగా పిలియన్ రైడర్ హెల్మెట్‌ను కూడా తప్పనిసరిగా ఉపయోగించాలి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా రాపిడో సేవలను వినియోగించే కస్టమర్లు తమ స్వంత హెల్మెట్లను తీసుకెళ్లాలని ర్యాపిడో తమ వినియోగదారులను అభ్యర్థిస్తోంది.

MOST READ:శ్రామిక్ ట్రైన్స్ వల్ల ఇండియన్ రైల్వే ఎంత వసూలు చేసిందో తెలుసా ?

కోవిడ్-19 భయం, బైక్ టాక్సీ 'ర్యాపిడో' మారిందిలా..

ర్యాపిడో తమ గైడ్‌లైన్స్‌లో కొన్ని మార్పులు కూడా చేసింది. ఇకపై రైడ్ కెప్టెన్ లేదా రైడర్ (కస్టమర్) ఇద్దరిలో ఎవరైనా మాస్క్ ధరించకపోయినా లేదా ధరించడానికి నిరాకరించినా ఇద్దరూ ఉచితంగా రైడ్‌ను క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదివరకు సైరన కారణం లేకుండా రైడ్ క్యాన్సిల్ చేస్తే కొంత మొత్తం చార్జ్ అయ్యేది.

కోవిడ్-19 భయం, బైక్ టాక్సీ 'ర్యాపిడో' మారిందిలా..

వీటికి అదనంగా, రాపిడో రైడ్ కెప్టెన్లు స్వతగా కొన్ని భద్రతా చర్యలను పాటించాల్సి ఉంటుంది. ప్రతి రైడ్‌కు ముందు బైక్‌ను క్రిమి సంహారకం చేయాల్సి ఉంటుంది. రైడ్ పార్టనర్స్ కోసం కంపెనీ ఓ చెక్‌లిస్ట్‌ను కూడా తయారు చేసింది. ప్రతి రైడ్‌కు ముందు రైడ్ కెప్టెన్ ఈ చెక్‌లిస్ట్‌ను తనిఖీ చేసుకొని, యాప్‌లో అంగీకరించాల్సి ఉంటుంది. వారు ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞను చేయాల్సి ఉంటుంది.

MOST READ:80 మీటర్లు దొర్లుకుంటూ వెళ్లినప్పటికీ బయటపడిన టాటా టియాగోలోని ప్రయాణికులు, ఎలానో మీరే చూడండి

కోవిడ్-19 భయం, బైక్ టాక్సీ 'ర్యాపిడో' మారిందిలా..

ర్యాపిడో బ్యాక్ షీల్డ్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ర్యాపిడో బ్యాక్ షీల్డ్స్ సింపుల్ డిజైన్ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. ఇది చాలా తేలికగా ఉన్నందున రైడర్ భజంపై ఇది పెద్దగా ప్రభావాన్ని చూకపోవచ్చని తెలుస్తోంది. ప్రత్యేకించి రైడర్‌కు, పిలియన్ రైడర్‌కు మధ్య నేరుగా ఉండే కాంటాక్ట్‌ను నిరోధించడంలో ఇది సహకరిస్తుంది.

Most Read Articles

English summary
In an attempt to enhance safety during the current Covid-19 crisis, bike taxi aggregator Rapido has announced launching Rapido Back Shields as an added safety precaution for their Ride Captains, ensuring commuters are more comfortable in the process. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X