అల్లాయ్ వీల్స్‌తో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

చెన్నైకి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న పాపులర్ 650సిసి మోటార్‌సైకిల్స్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోడళ్ల కోసం కంపెనీ కొత్తగా అల్లాయ్ వీల్స్‌ని తయారు చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ రెండు మోడళ్లు అల్లాయ్ వీల్స్‌తో లభ్యం కానున్నాయి.

అల్లాయ్ వీల్స్‌తో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

గాడివాడి నివేదిక ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ 650సిసి ట్విన్ మోటార్‌సైకిళ్ల కోసం కాస్ట్ అల్లాయ్ వీల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ అల్లాయ్ వీల్స్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయని, ఫిబ్రవరి 2021లో ఎప్పుడైనా ఇవి అందుబాటులోకి రావచ్చని కంపెనీ ఓ కస్టమర్‌కు పంపిన ఈమెయిల్‌లో పేర్కొంది.

అల్లాయ్ వీల్స్‌తో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

కాస్ట్ అల్లాయ్ వీల్స్ ప్రారంభించిన తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 కస్టమర్లు ఆప్షనల్‌గా అల్లాయ్ వీల్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ ఆన్‌లైన్ కాన్ఫిగరేటర్‌లో కూడా చేర్చే అవకాశం ఉంది. కాస్ట్ అల్లాయ్ రిమ్స్‌తో పాటుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌ల కోసం ట్యూబ్‌లెస్ టైర్లను కూడా ఆఫర్ చేయవచ్చని సమాచారం.

MOST READ:మతిపోగొడుతున్న మోడిఫైడ్ హిందూస్తాన్ అంబాసిడర్

అల్లాయ్ వీల్స్‌తో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

కాస్ట్ అల్లాయ్ వీల్స్ మినహా ఈ రెండు మోటార్‌సైకిళ్లలో వేరే ఏ ఇతర మార్పులు చేసే అవకాశం లేదు. మార్కెట్లో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సిసి మోటార్‌సైకిళ్లు వాటి సరసమైన ధర కారణంగా అసాధారణమైన స్పందనను అందుకున్నాయి.

అల్లాయ్ వీల్స్‌తో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ 650సిసి ట్విన్ మోటార్‌సైకిళ్లను 2018 చివర్లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ రెండు 650సిసి మోటార్ సైకిళ్ళు కొత్త బిఎస్6 కంప్లైంట్ 649సిసి పారలల్-ట్విన్ ఇంజన్‌తో పనిచేస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పి పవర్‌ను మరియు 52 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్పర్-క్లచ్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఇల్లుగా మారిన ఇన్నోవా కారు.. చూసారా..!

అల్లాయ్ వీల్స్‌తో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ అందిస్తున్న క్లాసిక్ 350లో కొత్తగా రెండు పెయింట్ స్కీమ్‌లను కంపెనీ పరిచయం చేసింది. అదనపు పెయింట్ స్కీమ్స్‌తో పాటుగా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 డ్యూయల్-ఛానెల్ ఏబిఎస్ మరియు స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో లభిస్తాయి.

అల్లాయ్ వీల్స్‌తో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఓ సరికొత్త 650సిసి క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను కూడా డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. కొత్త 650సిసి క్రూయిజర్‌ను కంపెనీ ఇప్పటికే భారతదేశంలో విస్తృతంగా పరీక్షిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మోడల్ మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

MOST READ:మాడిఫైడ్ బెంజ్ 600 పుల్మాన్ లిమోసిన్ : ఈ కార్ ముందు ఏ కారైనా దిగదుడుపే

అల్లాయ్ వీల్స్‌తో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సిసి ట్విన్ మోటార్‌సైకిళ్లలో అల్లాయ్ వీల్స్ ఫీచర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ భారత మార్కెట్లో ఈ బ్రాండ్ నుంచి మంచి విజయవం సాధించిన మోడళ్లు. ఈ రెండు మోటార్‌సైకిళ్లు భారతదేశంలోని మిడిల్-వెయిట్ మోటార్‌సైకిల్ విభాగంలో అందుబాటులో ఉంటాయి. ఈ మోడళ్లలో కాస్ట్ అల్లాయ్ వీల్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ తమ అమ్మకాలను మరింత మెరుగుపడుతాయని భావిస్తోంది.

Source:Gaadiwaadi

Most Read Articles

English summary
Royal Enfield Interceptor 650 and Continental GT650 to get alloy wheels in February 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X