హిమాలయన్ బిఎస్6 టీజర్‌తో హీట్ పెంచేసిన రాయల్ ఎన్ఫీల్డ్: వీడియో!

దేశీయ దిగ్గజ ఐకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తమ అడ్వెంచర్ మోటార్ సైకిల్ "హిమాలయన్" బైకును బిఎస్6 వెర్షన్‌లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తాజాగ హిమాలయన్ బిఎస్6 బైక్ టీజర్ రిలీజ్ చేసింది.

వివిధ రోడ్ల మీద పరుగులు తీస్తున్న షార్ట్ క్లిప్స్‌తో రూపొందించిన హిమాలయన్ బిఎస్6 టీజర్ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అన్ని రోడ్ల కోసం.. రోడ్లు లేని ప్రాంతాల కోసం.. హిమాలయన్ అనే పేరుతోటీజర్ తదితర వీడియో పోస్ట్ చేసింది.

హిమాలయన్ బిఎస్6 టీజర్‌తో హీట్ పెంచేసిన రాయల్ ఎన్ఫీల్డ్: వీడియో!

2020 రాయల్ ఎన్ఫీల్డ్ బిఎస్6 హిమాలయన్ బైక్‌ను ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తుండగా ఇప్పటికే పలుమార్లు ఆటో మొబైల్ మీడియ కంటబడింది. ఎన్నో నూతన ఫీచర్లు ఇందులో వస్తున్నాయి.

హిమాలయన్ బిఎస్6 టీజర్‌తో హీట్ పెంచేసిన రాయల్ ఎన్ఫీల్డ్: వీడియో!

అతి త్వరలో విడుదల కానున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 బైకులో హజార్డస్ లైట్ స్విచ్, రీడైజన్ చేయబడిన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఏడు రకాల మల్టీ ఇన్ఫర్మేషన్ లైట్లు కలిగి ఉంది (ప్రస్తుతం బైకులో 5 లైట్లే ఉన్నాయి) మరియు ఎత్తైన విండ్‌షీల్డ్ కూడా వస్తోంది.

హిమాలయన్ బిఎస్6 టీజర్‌తో హీట్ పెంచేసిన రాయల్ ఎన్ఫీల్డ్: వీడియో!

సరికొత్త హిమాలయన్ బిఎస్6లో మునుపటి మోడల్‌లో ఉన్నటువంటి ఆల్-బ్లాక్ వీల్స్ స్థానంలో క్రోమ్-ఫినిషింగ్ వీల్స్, సియట్ టైర్ల స్థానంలో ఎమ్ఆర్ఎఫ్ మెట్రో టైర్లు వచ్చాయి.

హిమాలయన్ బిఎస్6 టీజర్‌తో హీట్ పెంచేసిన రాయల్ ఎన్ఫీల్డ్: వీడియో!

స్ల్పిట్ క్రాడిల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపునున్న మోనో-షాక్ అబ్జార్వర్ వంటి కీ డిజైన్ ఎలిమెంట్స్‌లో ఎలాంటి మార్పులేదు. బ్రేకింగ్ విధుల కోసం ఫ్రంట్ వీల్‌కు 300మిమీ డిస్క్ మరియు రియర్ వీల్‌కు 240మిమీ డిస్క్ బ్రేక్ కలదు.

హిమాలయన్ బిఎస్6 టీజర్‌తో హీట్ పెంచేసిన రాయల్ ఎన్ఫీల్డ్: వీడియో!

ప్రస్తుతం హిమాలయన్ బైకులో 21-ఇంచుల వీల్స్‌ ఉన్నాయి. వీటి స్థానంలో కాస్త చిన్న సైజ చక్రాలను అందించే అవకాశం ఉందని పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. హిమాలయన్ లుక్ కాస్త మారినప్పటికీ హ్యాండ్లింగ్‌లో రైడర్‌కు చాలా హెల్ప్ అవుతుంది.

హిమాలయన్ బిఎస్6 టీజర్‌తో హీట్ పెంచేసిన రాయల్ ఎన్ఫీల్డ్: వీడియో!

మార్కెట్లో ఉన్న హిమాలయన్ బిఎస్4 వెర్షన్‌లో ఉన్న 411సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ 24.5బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది, దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

హిమాలయన్ బిఎస్6 టీజర్‌తో హీట్ పెంచేసిన రాయల్ ఎన్ఫీల్డ్: వీడియో!

2020 హిమాలయన్ బిఎస్6 బైకులో కూడా ఇదే 411సీసీ ఇంజన్ వస్తుంది. అయితే భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్ అప్‌గ్రేడ్ చేయడంతో మునుపటి పోలిస్తే పవర్ మరియు టార్క్ కాస్త తగ్గే అవకాశం ఉంది.

హిమాలయన్ బిఎస్6 టీజర్‌తో హీట్ పెంచేసిన రాయల్ ఎన్ఫీల్డ్: వీడియో!

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 పలు నూతన పెయింట్ ఆప్షన్స్‌లో రానుంది. అవి, రెడ్ & బ్లాక్ డ్యూయల్ టోన్, గ్రావెల్ గ్రే మరియు లేక్ బ్లూ. వీటితో పాటు ఇది వరకు లభించే గ్రానైట్, స్నో మరియు స్టీల్ పెయింట్ ఆప్షన్స్‌లో కూడా యధావిధిగా లభిస్తుంది.

హిమాలయన్ బిఎస్6 టీజర్‌తో హీట్ పెంచేసిన రాయల్ ఎన్ఫీల్డ్: వీడియో!

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్‌‌కు ఇప్పటి వరకూ సరాసరి పోటీనిచ్చే మోడల్ ఏదీ లేదు. సేల్స్ పెంచుకోవాలనుకుంటే అత్యంత పోటీతత్వంతో కూడిన ధరతో లాంచ్ చేయాల్సి ఉంటుంది.

హిమాలయన్ బిఎస్6 టీజర్‌తో హీట్ పెంచేసిన రాయల్ ఎన్ఫీల్డ్: వీడియో!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకును అన్ని రకాల రోడ్లకు అనువుగా ఉండేలా నిర్మించింది.. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఆఫ్-రోడ్ లేదా ఆన్-రోడ్ ఎలాంటి కండీషన్‌లోనైనా అద్బుతమైన పనితీరు కనబరుస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అడ్వెంచర్ బైక్ కోరుకునే కస్టమర్లకు హిమాలయన్ బెస్ట్ ఛాయిస్.

Most Read Articles

English summary
Royal Enfield Himalayan BS6 Coming Soon: Company Drops New Video Teaser. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X