రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ చూసారా.. !

యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్న మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఇది ప్రస్తుతం యువకుల యొక్క డ్రీమ్ బైక్. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ నుంచి ఇప్పటికే ఇండియన్ మార్కెట్లోకి చాలా మోటార్ సైకిల్స్ వెలువడ్డాయి. ఇప్పుడు ఈ కంపెనీ మరోకొత్త వాహనాన్ని ప్రవేశపెట్టనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ చూసారా.. !

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ పేరు రాయల్ ఎన్ఫీల్డ్ మేటోర్. రాయల్ ఎన్ఫీల్డ్ మేటోర్ బైక్ చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో పరీక్షలను గుర్తించారు. ఈ కొత్త మోటార్ సైకిల్ ని 2020 డిసెంబర్ లో లాంచ్ అచేయడం జరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ చూసారా.. !

స్పై టెస్ట్ చేసిన చిత్రాలు రష్లేన్ బహిర్గతం చేసింది. ఏ విధానగా వచ్చిన ఫొటోస్ లో ఈ కొత్త బైక్ ను గమనించినట్లయితే, ఇది చూడటానికి మునుపటి మోడల్స్ ని పోలి ఉండటమే కాకుండా రిట్రో లుక్ తో బాబర్ తరహా డిజైన్‌ను కలిగి ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ చూసారా.. !

బహిర్గతమైన ఈ ఫొటోస్ ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ మేటోర్ రౌండ్-టైపు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ లాంప్‌ల వంటివి ఈ బైక్ కి జోడించబడ్డాయి. రెండు చివర్లలో రౌండ్-టైప్ ఫెండర్‌లతో కూడిన పెద్ద కాంటౌర్డ్ ఫ్యూయెల్ ట్యాంక్, బ్లాక్-అవుట్ ఎగ్జాస్ట్, పిలియన్ సీట్లు, హ్యాండిల్‌బార్లు మరియు స్ప్లిట్ రియర్ గ్రాబ్ రైల్స్ కూడా ఇందులో ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ చూసారా.. !

ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ లో 346 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ యొక్క ఓవర్‌హెడ్ కామ్‌షాఫ్ట్ (ఓహెచ్‌సి) వెర్షన్‌లో పనిచేస్తుందని తెలుస్తుంది. కొత్త మోటారుసైకిల్‌కు క్లాసిక్ 350 బిఎస్ 6 మోటార్‌సైకిల్ వంటి ప్రీ-క్యాట్ లేదని గమనించవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ చూసారా.. !

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుండి వచ్చిన కొత్త ఓహెచ్‌సి ఇంజిన్ మరింత మెరుగుదల, మెరుగైన ఇంధన సామర్థ్యం మరియు అన్నిటికంటే ప్రస్తుత టాపెట్-వాల్వ్ యుసియి 346 సిసి ఇంజిన్ల కంటే మెరుగైన పనితీరును అందిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో 346 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది19.1 బిహెచ్‌పి మరియు 28 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ చూసారా.. !

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్-షాక్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్‌ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను కలియోగి ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ చూసారా.. !

ఒకసారి లాంచ్ అయినా తరువాత ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మేటోర్, థండర్బర్డ్ మోడళ్లను బ్రాండ్ లైనప్‌లో భర్తీ చేస్తుందని, మరియు జావా పెరాక్‌కు ప్రత్యర్థి గా ఉంటుందని ఆశిస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ మేటోర్ ధర దాదాపు రూ. 1.6 లక్షల నుండి రూ. 1.8 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటుందని భావిస్తున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ చూసారా.. !

రాయల్ ఎన్‌ఫీల్డ్ కి సంబంధించిన ఇతర వార్తల ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ మరియు కాంటినెంటల్ జిటి 650 బిఎస్ 6 మోటార్‌సైకిళ్ళు భారతదేశం అంతటా డీలర్‌షిప్‌ల వద్దకు వచ్చాయి. ఈ రెండు మోటార్ సైకిళ్ళు ధరలో గణనీయమైన పెరుగుదలను కలిగి ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ చూసారా.. !

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

రాయల్ ఎన్ఫీల్డ్ మేటోర్ మోటారుసైకిల్ రెట్రో-లుక్స్ మరియు సిగ్నేచర్ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రమాణాలలో రైడింగ్ పొజిషన్ కలిగి ఉంది. కొత్తగా రానున్న రాయల్ ఎన్ఫీల్డ్ మేటోర్, థండర్బర్డ్ యొక్క లోటుని తెరుస్తున్నాడని భావిస్తున్నారు ఈ కొత్త బైక్ చూడటానికి మునుపటిలాగే ఉండటమే కాకుండా మంచి రైడింగ్ అనుభవాన్ని కూడా ఇస్తుంది.

Source: Rushlane

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారతదేశంలో మరింత విస్తరిస్తోంది. ఈ కరోనా వైరస్ నివారణకు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూకు 'డ్రైవ్‌స్పార్క్' మద్దతు తెలియజేస్తుంది. ప్రజలందరూ ఈ జనతా కర్ఫ్యూకి మద్దతుగా ఈ రోజు ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటోంది. "సర్వే జనా సుఖినోభవంతు".

Most Read Articles

English summary
Royal Enfield Meteor Production Spec Spied Testing Ahead Of Launch: Spy Pics & Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X